విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై బీజేపీ నాయకుల మాటల దాడి .. బాబుకు ప్రజలు బుద్ధి చెప్పారు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Election Results 2019 : చంద్రబాబుపై... బీజేపీ నాయకుల మాటల దాడి...!! || Oneindia Telugu

ఏపీలో టీడీపీ చావు దెబ్బ తింది. ఊహించని రీతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది . ఇక ఎన్నికల ఫలితాల తర్వాత అసలే ఓటమి బాధలో ఉన్న చంద్రబాబు మీద బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

చంద్రబాబు కొంప ముంచింది పవనేనా ... అసలేం జరిగిందిచంద్రబాబు కొంప ముంచింది పవనేనా ... అసలేం జరిగింది

 చంద్రబాబుపై మాటల దాడి చేస్తున్న బీజేపీ నేతలు

చంద్రబాబుపై మాటల దాడి చేస్తున్న బీజేపీ నేతలు

బీజేపీ నేత జీవీఎల్ , సోము వీర్రాజు , మురళీధర్ రావు సైతం చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు, టీడీపీ చేసిన తప్పులే టీడీపీ ఓటమికి వైసీపీ భారీ విజయానికి కారణం అని జీవీఎల్ అన్నారు. ఇక చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు. ప్రజలు చంద్రుడిని తిరస్కరించారని మురళీధర్ రావు పేర్కొన్నారు.అసలే బాధలో ఉన్న చంద్రబాబుపై ప్రతిపక్షాలు మాటల దాడి చేస్తున్నారు.

మోడీని అడ్డు పెట్టుకుని చంద్రబాబు చేసిన విమర్శలే ఓటమికి కారణం అన్న బీజేపీ నేతలు

మోడీని అడ్డు పెట్టుకుని చంద్రబాబు చేసిన విమర్శలే ఓటమికి కారణం అన్న బీజేపీ నేతలు

మోడీని అడ్డుపెట్టుకుని చంద్రబాబు ఎవరిని విమర్శించినా వారికి లాభం జరుగుతుందన్నారు. జగన్ కు అలాగే లాభం జరిగిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీని కోడికత్తి పార్టీ అని ఎవరైనా విమర్శిస్తారా అని జీవీఎల్ అడిగారు. జగన్ పై దాడిని చంద్రబాబు అవహేళన చేస్తూ మాట్లాడారని ఎవరైనా ఒక ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే అలాగే మాట్లాడతారా అని మండిపడ్డారు. ఏపీలో అద్భుత విజయం సాధించిన జగన్ కు జీవీఎల్ అభినందనలు తెలిపారు.ఇక చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు. చంద్రబాబు ఒరిజినాలిటీ లేని నాయకుడు అని అన్నారు. టీడీపీకి 30కంటే ఎక్కువ సీట్లు రావని ముందే చెప్పామన్నారు. గతంలో చంద్రబాబుతో పొత్తు కారణంగా ఏపీలో బీజేపీ, జనసేన నష్టపోయాయని సోము వీర్రాజు అన్నారు. సాక్ష్యాత్తు స్పీకర్ కోడెలపైనే దాడి చేశారంటే ప్రజల ఆగ్రహం ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవచ్చన్నారు. టీడీపీపై తమకున్న కోపాన్ని ప్రజలు ఓట్ల రూపంలో చూపించారని సోము వీర్రాజు అన్నారు.

ఢిల్లీలో చంద్రగ్రహణం ఉండదు అని బాబుపై విమర్శలు గుప్పించిన బీజేపీ నేతలు

ఢిల్లీలో చంద్రగ్రహణం ఉండదు అని బాబుపై విమర్శలు గుప్పించిన బీజేపీ నేతలు

హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో విజయోత్సవ సభ నిర్వహించారు. బీజేపీ నేతలు లక్ష్మణ్, మురళీధర్ రావు, దత్తాత్రేయ, డీకే అరుణ హాజరయ్యారు.ప్రజలు చంద్రుడిని తిరస్కరించారని ,చంద్రుడు ఉనికి కోసం పోరాడుతున్నారని చంద్రబాబుని ఉద్దేశించి చెప్పారు. చంద్రుడు లేకుంటే ఢిల్లీ ఉండదనే ప్రచారం చేశారని విమర్శించారు. ఢిల్లీపై ఇక చంద్రగ్రహణం ఉండదన్నారు. బీజేపీ ఓటమి కోసం ఏపీ ప్రభుత్వ డబ్బుని చంద్రబాబు దుర్వినియోగం చేశారని మురళీధర్ రావు ఆరోపించారు. ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం బీజేపీకి రాబోతోందని మురళీధర్ రావు చెప్పారు.

English summary
BJP leader GVL, Somu Veerraju and Murlidhar Rao also blamed Chandrababu. GVL said that the YCP's huge success in TDP's defeat was a mistake made by Chandrababu's ecstatic comments. The BJP leaders said that the people of AP defeated chandrababu . Muralidhar Rao has claimed that people have rejected chandrababu .The Opposition has been attacking with words against Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X