• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాజధానిపై నీలి నీడల ప్రచారం ఎఫెక్ట్.. టీడీపీపైన కంటే రియల్టర్ల పైనే ఎక్కువ

|

ఇప్పుడు ఏపీలో రాజధాని అమరావతి పై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని అభివృద్ధి పనులను నిలుపుదల చేయించారు అని, అలాగే సెక్రటేరియట్ ను మారుస్తున్నారని, అంతేకాదు రాజధాని పేరు మార్పు కూడా చేయనున్నారు అని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏపీ రాజధాని పై టీడీపీ మార్క్ ఉండకూడదన్న భావనతోనే జగన్మోహన్ రెడ్డి ఈ తరహా నిర్ణయం తీసుకున్నారంటూ జోరుగా సాగుతున్న ప్రచారం టిడిపి పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలీదు కానీ రాజధాని పరిసర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ పైన మాత్రం కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది.

తాజ్ మహల్ కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే...? అంటూ కేశినేని నానీ షాకింగ్ పోస్ట్

చంద్రబాబు హయాంలో జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ..

చంద్రబాబు హయాంలో జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ..

రాజధాని అమరావతి.. ఎప్పుడైతే ఏపీ రాజధాని అమరావతిగా మారిందో వెలగపూడి సమీపంలోని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ ఒక్కసారి భూం అందుకుంది. భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వేలకోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. పంట పొలాలని కొనుగోలు చేసిన రియల్టర్లు పెద్ద ఎత్తున తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఎక్కడ చూసిన బహుళ అంతస్తుల భవనాలతో, కమర్షియల్ కాంప్లెక్స్ లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరిగింది.

ఇక చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతిని చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రహ్మాండంగా తమ వ్యాపారం కొనసాగించారు.

 జగన్ అధికారంలోకి రావటంతో రియల్టర్ల గుండెల్లో గుబులు ..

జగన్ అధికారంలోకి రావటంతో రియల్టర్ల గుండెల్లో గుబులు ..

ప్రస్తుతం వైసిపి అధికారంలోకి రావడంతో జగన్ రాజధానిని మారుస్తాడా అన్న అనుమానాలు చాలా మందికి కలుగుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. ఎన్నికలకు ముందు చాలా సందర్భాల్లో జగన్ సీఎం అయితే రాజధానిని మారుస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, రాజధాని నిర్మాణం విషయంలో అవినీతి జరిగిందంటూ గతంలో పేర్కొన్న వైసిపి, ఇప్పుడు అవినీతిని బయటకు తీయడానికి రంగంలోకి దిగడం వంటి కారణాలు రాజధాని పై నీలి నీడలు అనుకునేలా చేశాయి. ఇక ఈ నేపథ్యంలో రాజధాని పరిస్థితి ఎలా ఉంటుందో అన్న అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవుతోంది. వైసీపీ అధికారంలోకి రావడం, రాజధాని సమీక్షలో జరిగిన చర్చ రియల్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ నేపధ్యంలో రియల్టర్లకు భారీ షాక్

రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ నేపధ్యంలో రియల్టర్లకు భారీ షాక్

ఒకవేళ మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉండేదని రియల్టర్లు లబోదిబోమంటున్నారు. రాజధాని విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం టీడీపీకి భారీ షాక్ ఇస్తుంది అని వైసిపి భావిస్తుంటే, రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని , ఆ తర్వాతే రాజధాని అభివృద్ధి పై దృష్టి పెడతామని జగన్ తీసుకున్న నిర్ణయం టిడిపి కంటే రాజధాని పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రియల్టర్లకు భారీ షాక్ ఇచ్చింది అని చెప్పాలి. రాజధాని విషయంలో జగన్ పూర్తి స్పష్టత ఇచ్చే వరకు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందని చెప్పాలి. నిన్నటిదాకా రెక్కలొచ్చి అందకుండా పోయిన భూములు కొంతకాలం పాటు కిందికి దిగుతాయని చెప్పాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Various rumors are spreading over the capital Amravati in AP now. CM Jaganmohan Reddy has announced on that the capital development work will be retained, the secretariat will be renamed and the capital will be renamed...such rumors are spreading in AP .Jagan Mohan Reddy's decision not to have a TDP mark on AP capital It is not known what effect the TDP will have, but it will certainly have an impact on real estate in and around the capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more