విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే సత్తా వైసీపి ప్రభుత్వానికి లేదు..! ద్వజమెత్తిన చంద్రబాబు..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : అదికార పార్టీ పై ప్రతిపక్ష పార్టీ నేత చంద్ర బాబు మరోసారి మండి పడ్డారు. ప్రతిపక్షంపై ఆరోపణలకే సభా సమయాన్నంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేక టీడిపి ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడిపి వ్యూహ కమిటి సభ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పోలవరం పనులు 66 శాతం పూర్తయ్యాయన్నారు. కేంద్రం నుంచి పెండింగ్ నిధులు తెచ్చుకోవడం చేతకాకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడిపి పైన ఆరోపణలు చేస్తోందని మండి పడ్డారు.

ప్రశ్నలు, ఎదురు ప్రశ్నలతో ఏపీ అసెంబ్లీలో రచ్చ .. టీడీపీ నేతలపై స్పీకర్ ఆగ్రహం ప్రశ్నలు, ఎదురు ప్రశ్నలతో ఏపీ అసెంబ్లీలో రచ్చ .. టీడీపీ నేతలపై స్పీకర్ ఆగ్రహం

సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు..! ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం లేదన్న బాబు..!!

సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు..! ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం లేదన్న బాబు..!!

అర్థంలేని అవినీతి ఆరోపణలతో విలువైన శాసనసభ కాలాన్ని వృథా చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. విచారణల పేరుతో కాలం గడిపేయాలని జగన్‌మోహన్‌ రెడ్డి చూస్తున్నారన్నారు. అవినీతి ఆరోపణల ద్వారా పోలవరం పనులను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయని, పీపీఏలపై బురద జల్లాలనే ప్రయత్నం చేసి ప్రభుత్వం అభాసుపాలైందని ఆరోపించారు. 'సున్నావడ్డీ రుణాలు టీడిపి ఇవ్వలేదని జగన్‌ మోహన్‌రెడ్డి రెడ్డి చెప్పారు. ఆధారాలతో సహా బయట పెట్టేసరికి ప్లేటు ఫిరాయించారు. కియా వైఎస్‌ తెచ్చారని బుగ్గన చెప్పడం హాస్యాస్పందంగా ఉందని చంద్రబాబు అన్నారు.

రాజధాని వ్యవహారంలో అవకతవకలపై నిపుణుల కమిటి..! ఘాటు వ్యాఖ్యలు చేసిన బొత్స..!!

రాజధాని వ్యవహారంలో అవకతవకలపై నిపుణుల కమిటి..! ఘాటు వ్యాఖ్యలు చేసిన బొత్స..!!

రాజధాని వ్యవహారంలో అవకతవకలను... నిపుణుల కమిటీ నిగ్గు తెలుస్తుందని మంత్రి బొత్స సత్యానారయణ పేర్కొన్నారు. నేడు ఆయన కాసేపు మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. సదావర్తి భూముల అంశంపై విచారణ జరుగుతోందని బొత్స స్పష్టం చేశారు. విజిలెన్స్ విచారణపై దేవాదాయశాఖ మంత్రి ప్రకటన చేశారన్నారు. రాజధానిలో ప్రారంభం కాని పనులను నిలిపివేశామన్నారు. టెండర్లు పూర్తయినా ప్రారంభం కాని పనులను కూడా నిలిపివేశామన్నారు. 25 శాతం పనులు పూర్తి కాని ప్రాజెక్టులపై పునః సమీక్ష నిర్వహించనున్నట్టు బొత్స స్పష్టం చేశారు.

చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు..! ఇదెక్కగడి సాంప్రదాయమంటున్న నాని..!!

చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు..! ఇదెక్కగడి సాంప్రదాయమంటున్న నాని..!!

బడ్జెట్‌లో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి 400 కోట్ల రూపాయలు కేటాయించామని.. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల అంశంపై ప్రశ్న ఎందుకు వేశారని.. చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకు క్లాస్‌ తీసుకున్నారన్నారు. ఈ విషయం ప్రజల్లోకి వెళితే టీడీపీకి నష్టమని బాబు భయపడుతున్నారన్నారు. అచ్చెన్నాయుడిపై తన మాటలను వక్రీకరించారని పేర్ని నాని పేర్కొన్నారు. తప్పుగా మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని పేర్కొన్నారు. ఆశా వర్కర్ ఎపిసోడ్‌లో ఆధారాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు.

చంద్రబాబు వ్యవహారం బాగాలేదు..! మండిపడ్డ విజయసాయిరెడ్డి..!!

చంద్రబాబు వ్యవహారం బాగాలేదు..! మండిపడ్డ విజయసాయిరెడ్డి..!!

కొత్త ప్రభుత్వం వచ్చి 45 రోజులు కూడా కాకముందే.. టీడీపీ అధినేత చంద్రబాబు విషం చిమ్ముతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ దుర్మార్గాలను అడ్డుకునేందుకే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. జగన్‌ అమరావతికి ప్రాధాన్యతనివ్వడం లేదని శోకాలు పెడుతున్నారని.. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆయనకి బాగా తెలుసని విమర్శించారు. సోలార్, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై.. ప్రభుత్వం పున: పరిశీలన చేస్తానంటే మీరెందుకు వణికిపోతున్నారంటూ చంద్రబాబుని విజయసాయిరెడ్డి నిలదీశారు. కమీషన్లు మింగి చేసుకున్న పీపీఏల వల్ల ఏటా 2,500 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని విమర్శించారు. యూనిట్ 2.70 రూపాయలకి వస్తుంటే 4.84 చెల్లించారని ప్రశ్నిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

English summary
Opposition Party leader Chandra Babu once again ignited the Ruling party. The Telugu Desam Party chief Chandrababu said that the YSR Congress party has been abusing the party all the time. They are angry that they are targeting the TDP for not solving public problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X