• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మండలి చైర్మన్ పంతమే నెగ్గింది.. వైసీపీ మంత్రుల షాకింగ్ కామెంట్లు.. నారా లోకేశ్‌కు ఆ అవకాశం..

|

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి రెండు కీలక బిల్లులపై శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ పంతమే నెగ్గింది. వద్దుద్దంటూ వైసీపీ ప్రభుత్వం ఎంత చెప్పినా వినిపించుకోకోని ఆయన గురువారం సెలెక్ట్ కమిటీలను అధికారికంగా ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని అధ్యయనం చేసేందుకు వేర్వేరుగా రెండు సెలెక్ట్ కమిటీల్ని నియమిస్తూ ఆదేశాలిచ్చారు. దీనిపై మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతూ అనూహ్యవ్యాఖ్యలు చేశారు.

గడువు ముగియడంతో..

గడువు ముగియడంతో..

మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లుల్ని శాసన మండలి అడ్డుకోవడం.. ఆ రెండు బిల్లుల్ని సెలెక్ట్ కమిటీ పరిశీలకు పంపుతామని చైర్మన్ షరీఫ్ ప్రకటించడం.. ఆ చర్యను తప్పుపడుతూ జగన్ సర్కారు ఏకంగా మండలినే రద్దు చేయడం తెలిసిందే. కాగా, మండలి రద్దుకు పార్లమెంట్ లో ఆమోదం లభించేదాకా వేచిచూడాలని వైసీపీ భావిస్తుండగా ఈలోపే టీడీపీ, పీడీఎఫ్, బీజేపీలు సెలెక్ట్ కమిటీకి పేర్లను సూచిస్తూ చైర్మన్ కు లేఖలు రాశాయి. కమిటీల ఏర్పాటుకు సంబంధించిన గడువు బుధవారమే ముగిసినా, చైర్మ్ షరీఫ్ మాత్రం గురువారం హడావుడిగా పేర్లు ప్రకటించేశారు.

ఏ కమిటీలో ఎవరంటే..

ఏ కమిటీలో ఎవరంటే..

మండలి చైర్మన్ షరీఫ్ ఆదేశాలతో జారీఅయినట్లుగా చెబుతోన్న ప్రకటనలో రెండు సెలెక్ట్ కమిటీలను ప్రకటించారు. మొదటిది సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీ. దీనికి మంత్రి బొత్స సత్యనారాయణ చైర్మన్ గా వ్యవహరిస్తారని, టీడీపీ నుంచి దీపక్ రెడ్డి, అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు, వైసీపీ నుంచి మొహ్మద్ ఇక్బాల్, పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సభ్యులుగా ఉంటారని ప్రకటనలో తెలిపారు.

లోకేశ్‌కు అవకాశం

లోకేశ్‌కు అవకాశం

మండలిలో మూడు రాజధానుల బిల్లుల్ని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిన టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ కు మండలి చైర్మన్ షరీఫ్ అవకాశం కల్పించారు. వికేంద్రీకరణ బిల్లుపై ఏర్పాటైన సెలెక్ట్ కమిటీలో లోకేశ్ కు చోటు దక్కింది. మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరించే ఈ సెలెక్ట్ కమిటీలో టీడీపీ తరఫున లోకేశ్ తోపాటు అశోక్ బాబు, తిప్పేస్వామి, సంధ్యారాణిలు సభ్యులుగా ఉంటారు. పీడీఎఫ్ తరఫున లక్ష్మణరావు, వైసీపీ తరఫున వేణుగోపాల్ రెడ్డి, బీజేపీతరఫున మాధవ్ కూడా ఉన్నారు.

నన్నెవరూ ప్రశ్నించలేరు..

నన్నెవరూ ప్రశ్నించలేరు..

రెండు బిల్లులపై సెలెక్ట్ కమిటీల ప్రకటనను అడ్డుకునేందుకు అధికార వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది. సెలెక్ట్ కమిటీల ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధమని, మండలి రద్దు బిల్లు సైతం పార్లమెంటులో పెండింగ్ లో ఉందని ఇలాంటి సమయంలో పేర్ల ప్రకటన అవసరం లేదంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉమ్మడిగా చైర్మన్ షరీఫ్ కు లేఖ రాశారు. అయితే కమిటీల ఏర్పాటుపై తన విచక్షణాధికారాల్ని ఎవరూ ప్రశ్నించలేరని చైర్మన్ షరీఫ్ వైసీపీ నేతలతో అన్నట్లు తెలిసింది.

సారీ.. రాలేను..

సారీ.. రాలేను..

కాగా, సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ మండలి చైర్మన్ ఇచ్చిన ప్రకటనను, దానికి సంబంధించిన రెండు లేఖలను సోషల్ మీడియాలో చూశాయని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ చెప్పారు. కమిటీల ఏర్పాటు నిబంధనల ప్రకారం జరగలేదు కాబట్టి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించబోనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్దంటున్నా మండలి చైర్మన్ మాత్రం పట్టుదలతో సెలెక్ట్ కమిటీలను ప్రకటించడంతో తర్వాత ఏంజరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

English summary
the chairman of legislative council mohammed ahmed shariff announced the two select committees for the study of the two bills on thursday. ruling party opposed the movie
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X