• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నేడు రాష్ట్రానికి శని పట్టిన రోజు ,రాక్షసుల పండుగ రోజు: వైసీపీ పాలనపై టీడీపీ నేతల ధ్వజం

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన చేపట్టి ఏడాది కాలం కావటంతో టీడీపీ నేతలు వైసీపీ పాలన పై మండిపడుతున్నారు. నేడు చారిత్రక తప్పిదం జరిగిన రోజని కొందరు , ఏడాది పాలన అంతా ప్రజా వ్యతిరేక విధానాలే అని మరికొందరు మండిపడుతున్నారు. ఇక తాజాగా బుద్దా వెంకన్న వైసీపీ పాలనపై భగ్గుమన్నారు. ఈ రోజు రాష్ట్రానికి శని పట్టిన రోజని , రాక్షసుల పండుగ రోజని వ్యాఖ్యానించారు .

వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ, బీజేపీ నేతల విసుర్లు .. ఎవరేమన్నారంటే వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ, బీజేపీ నేతల విసుర్లు .. ఎవరేమన్నారంటే

వైసీపీ ప్రభుత్వానికి దోచుకునే లైసెన్స్ వచ్చిన రోజు

వైసీపీ ప్రభుత్వానికి దోచుకునే లైసెన్స్ వచ్చిన రోజు


మే 23 అంటే అభివృద్ధి కోరుకునే వాళ్లు బాధపడే రోజు అని బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఏపీలో గతేడాది ఈ రోజు వైసీపీ ప్రభుత్వానికి దోచుకునే లైసెన్స్ వచ్చిందని ఆయన మండిపడ్డారు. ఇదే రోజున జగన్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రజల దోపిడీ మొదలు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు . ఇక జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు . ఇక జగన్ అంటే ఎవరికీ తెలీదని వసూల్ రాజా అంటే అందరికీ తెలుస్తుందని బుద్దా వెంకన్న జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు .

జగన్ చట్టూ నాలుగు దుష్ట గ్రహాలు ఉన్నాయన్న బుద్దా వెంకన్న

జగన్ చట్టూ నాలుగు దుష్ట గ్రహాలు ఉన్నాయన్న బుద్దా వెంకన్న


ఉచిత ఇసుకను దోచుకోవడానికి ఇసుక సరఫరా 4 నెలలు ఆపేసి, పాత పాలసీని రద్దు చేసి 60 మంది కూలీల ప్రాణాలు తీశారని వ్యాఖ్యానించారు . 40 లక్షల మంది కార్మికులు ఆకలితో బాధ పడేలా చేసిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. జగన్ పాలన అంతా అరాచకాలు , దౌర్జన్యాలు మాత్రమే అని పేర్కొన్నారు.ఇక ఏపీకి పట్టిన శనితో పాటు జగన్ కు నాలుగు దుష్ట గ్రహాలు చుట్టూ ఉన్నాయని వ్యాఖ్యానించారు . జగన్‌కు విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనే నలుగురు దుష్ట చతుష్టయం అని బుద్దా వెంకన్న ఘాటుగా వ్యాఖ్యానించారు .

జగన్ పాలనతో ఓట్లు ఎందుకు వేశామా అని బాధ పడుతున్న ప్రజలు

జగన్ పాలనతో ఓట్లు ఎందుకు వేశామా అని బాధ పడుతున్న ప్రజలు


జగన్ దెబ్బకు ,జే ట్యాక్స్‌కు భయపడి రాష్ట్రంలో స్థాపించడానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా ముందుకు రావడం లేదన్నారు. ఇక పారిశ్రామికవేత్తలు గడగడలాడుతున్నారని అన్నారు. జగన్ రాకతో కరోనా కూడా వచ్చిందని ఆయన అన్నారు . ప్రజలను కరోనా సమయంలో కూడా పీడిస్తున్న ఇటువంటి ముఖ్యమంత్రి అవసరమా? అని ప్రజలు ఆలోచించుకోవాలని వెంకన్న కోరారు. ఇక జగన్ కు గతంలోపాలాభిషేకం చేసినవాళ్లు , నేడు తాగడానికి నీళ్లు లేవని మొరపెట్టుకుంటున్నారని, ఎందుకు గెలిపించామని తిట్టిపోస్తున్నారని ఆయన పేర్కొన్నారు . జగన్ పాలన దెబ్బకు ఆయనకు ఓట్లు ఎందుకు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారని బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు.

వైసీపీ పాలన అంతా అరాచకాలే .. వేధింపులే : పంచుమర్తి

వైసీపీ పాలన అంతా అరాచకాలే .. వేధింపులే : పంచుమర్తి

ఇక ఇదే సమయంలో పంచుమర్తి అనూరాధ కూడా వైసీపీ ఏడాది పాలనపై నిపులు చెరిగారు.వైసీపీ ఏడాది పాలనంతా దాడులు, దౌర్జన్యాలతోనే గడిచిపోయిందని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ విమర్శించారు. జగన్ పాలన అంతా వేధింపులే అని , కచ్చులూరు బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం చేయమన్నందుకు మాజీ ఎంపీ హర్షకుమార్‌ను వేధించారని గుర్తుచేశారు. ఇక మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను దారుణంగా హింసించారన్నారు. హైకోర్టు 67 సార్లు మొట్టికాయలు వేసినా జగన్ ప్రభుత్వంలో చలనం లేదని ఎద్దేవా చేశారు. జగన్ పాలన అంతా అరాచకం అని ఆమె వ్యాఖ్యానించారు .

English summary
Buddha Venkanna made a strong statement that May 23 is a day for those who feeling sad that they want state's development . He said that the YCP government had got a license to rob it. TDP Women Leader Panchumarti Anuradha has criticized the YCP as a year of violence and demolitions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X