• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైఎస్ భారతితో మహేష్ బాబు భార్య నమ్రత భేటీ: ముఖ్యమంత్రి ఇంటికి ఒక్కరొక్కరుగా..

|

అమరావతి: తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఒక్కరొక్కరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి బారులు తీరినట్టే కనిపిస్తోంది. కారణాలేమైనప్పటికీ- సినీ ప్రముఖులు వైఎస్ జగన్ తో భేటీ కావడానికి ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. కొద్ది రోజుల కిందటే మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. భార్య సురేఖతో కలిసి చిరంజీవి స్వయంగా ప్రత్యేక విమానంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసానికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు.

సైరా సినిమా ప్రమోషన్ లో భాగంగా.. వైఎస్ జగన్ ను కలిశారనేది టాక్. సినిమా చూడాలని చిరంజీవి దంపతులు ముఖ్యమంత్రిని కోరారు. వినోదపు పన్ను మినహాయింపును కోరారు. అదలా ఉంటే- తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా అదే బాటలో నడిచారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె వైఎస్ జగన్ భార్య భారతితో సమావేశం అయ్యారు. అరగంట పాటు పలు విషయాలు వారి మధ్య చర్చకు వచ్చాయి.

Tollywood Actor Mahesh Babu wife Namrata Shirodkar meets Chief Minister YS Jagan wife YS Bharati

ప్రత్యేకించి- మహేష్ బాబు చేపట్టిన సామాజిక కార్యక్రమాల గురించి నమ్రత వివరించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, నివేదికలను అందించారు. సామాజిక కార్యక్రమాల కోసం మహేష్ బాబు ఓ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

తన నాయనమ్మ ఘట్టమనేని నాగరత్నమ్మ, రాజా పేరు మీద ఈ ఫౌండేషన్ ను నెలకొల్పారు. ఏపీలో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు.

Tollywood Actor Mahesh Babu wife Namrata Shirodkar meets Chief Minister YS Jagan wife YS Bharati

సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం పరిధిలోని బుర్రిపాలెంలో ఫౌండేషన్ తరఫున పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు.విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఈ ఫౌండేషన్ తరఫున పెద్ద ఎత్తున నిధులను వ్యయం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల, కళాశాల భవనాల మరమ్మతు, రోడ్ల నిర్మాణం, మంచినీటి వసతులను కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, బుర్రిపాలెంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా నమ్రతా.. వైఎస్ భారతికి అందజేశారు. ప్రభుత్వం తరఫున బుర్రిపాలెం అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని కోరారు.

Tollywood Actor Mahesh Babu wife Namrata Shirodkar meets Chief Minister YS Jagan wife YS Bharati

త్వరలో మరి కొందరు సినీ ప్రముఖులు వైఎస్ జగన్ ను కలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత.. చిత్ర పరిశ్రమ తరఫున ఎవ్వరూ ఆయనను అధికారికంగా కలుసుకోలేదు. దీన్ని భర్తీ చేయడానికా? అన్నట్లు చిత్ర పరిశ్రమ ప్రముఖులు మా తరఫున ఆయనను కలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
Tollywood Super Star Mahesh Babu wife Namrata Shirodkar meets Chief Miinster of Andhra Pradesh YS Jagan Mohan Reddy wife Bharati on Friday at Tadepalli in Guntur district. Namrata explained to YS Jagan of his actor husband Mahesh Babu taken social welfare activities and adopted a village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more