విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాడు టీడీపీ..నేడు వైసీపీ: వనజాక్షి వ్యవహారంలో మరో రచ్చ: అధికార పార్టీనేత కనుసన్నల్లో..!

|
Google Oneindia TeluguNews

టీడీపీ ప్రభుత్వ హాయంలో ఏపీలో మహళ పైన దాడులు అనగానే ప్రతిపక్ష టీడీపీ తెర మీదకు తెచ్చిన అంశం ఎమ్మార్వో వనజాక్షి పైన దాడి వ్యవహారం. నాడు టీడీపీ ప్రభుత్వంలో విప్ గా పని చేసిన చింతమనేని ప్రభాకర్ ఎపిసోడ్‌లో స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తహసీల్దార్ వనజాక్షిని పిలిపించి నచ్చ చెప్పి పంపిచా ల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వనజాక్షి ఏకంగా రాష్ట్ర తహశీల్దార్ల సంఘం గౌరవాధ్య క్షురాలుగా ఎన్నికయ్యారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తమ మాట చెల్లుబాటు కాకుండా అడ్డుతుగులుతున్నారంటూ సెలవులో ఉన్న వనజాక్షికి తిరిగి పని చేసే చోట పోస్టింగ్ ఇవ్వలేదు. అధికార పార్టీలో ఒక ముఖ్య నేత ఒత్తిడి మేరకు పని చేస్తున్న మండలం నుండి బదిలీ చేసి మరో మండలంలో పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 మరోసారి వార్తల్లోకి ఎక్కిన వనజాక్షి మరోసారి వార్తల్లోకి ఎక్కిన వనజాక్షి

నాడు వైసీపీకి ప్రచారాస్త్రంగా వనజాక్షి...

నాడు వైసీపీకి ప్రచారాస్త్రంగా వనజాక్షి...

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నాటి విప్ చింతమనేని ప్రభాకర్ మహిళా ఎమ్మార్వో పైన దాడికి దిగారని ప్రతిపక్షం పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. దీంతో..ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎమ్మార్వో వనజాక్షిని తన వద్దకు పిలిపించి బుజ్జగించాల్సి వచ్చింది. దీని పైన వైసీపీ ఆరోపణలు చేసింది. విప్ చింతమనేని పైన చర్యలు తీసుకోకుండా వనజాక్షిని బుజ్జగించటం పైన విమర్శలు గుప్పించింది. ఇక, టీడీపీ అధికారంలో ఉన్న సమయం మొత్తం..మహిళల పైన దాడుల అంశం చర్చకు వచ్చిన సమయంలో వనజాక్షి వ్యవహారమే ప్రధానంగా తెర మీదకు వచ్చేది.

మంచి అధికారిణిగా గుర్తింపు

మంచి అధికారిణిగా గుర్తింపు


ఇక, 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. నాడు సాధారణ ఎమ్మార్వోగా ఉంటూ అధికార పార్టీనే కదలించిన అధికారిణిగా గుర్తింపు రావటంతో రాష్ట్ర తహ శీల్దార్ల సంఘం గౌరవాధ్య క్షురాలుగా సహచర అధికారులు ఎన్నుకున్నారు. విజయ వాడ రూరల్‌ మండల తహశీల్దార్‌గా పని చేస్తున్న వనజాక్షి ప్రభుత్వ పధకాల అమల్లో యాక్టివ్ గా వ్యవహరించారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అసైన్డ్ భూముల సేకరణలో సైతం భూ యజమానులను ఒప్పించి ప్రభుత్వానికి భూములు ఇచ్చేలా ఒప్పించారు.

అధికార పార్టీ నేత ఆగ్రహంతో...

అధికార పార్టీ నేత ఆగ్రహంతో...

ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న దొనవల్లి వనజాక్షివిజయవాడ రూరల్‌ మండల తహశీల్దార్‌గా ఉంటూ సెలవు పైన వెళ్లారు. అయితే, తిరిగి పోస్టింగ్ చేరే సమయంలో జిల్లా నుండి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక ముఖ్య నేత వనజాక్షిని విజయవాడ రూరల్ నుండి బదిలీ చేయాలంటూ ఉన్నతాధికారుల పైన ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఆ మండలంలో తాము అనుకున్న విధంగా నిర్ణయాల అమల్లో వనజాక్షి అడ్డు తగులుతున్నారనే కారణంతో సెలవు నుండి తిరిగి వచ్చిన తరువాత సైతం పోస్టింగ్ ఇవ్వలేదు. పోలీసు శాఖ తరహాలో రిజర్వ్ లో ఉంచారు. దీని పైన జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది.

Recommended Video

చింత‌మ‌నేని పై పోటీ కి.... మ‌హిళా అభ్య‌ర్థిని నిలబెట్టిన పవన్..!! | Oneindia Telugu
 విజయవాడ రూరల్ నుంచి గూడూరుకు బదిలీ

విజయవాడ రూరల్ నుంచి గూడూరుకు బదిలీ

ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ రూరల్ మండలంలో మాత్రం వనజాక్షికి బాధ్యతలు ఇవ్వద్దంటూ ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో..ఈ వ్యవహారం మరింత ముదరకుండానే ముందుగా వనజాక్షికి పోస్టింగ్ ఇవ్వాలంటూ ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాలతో తాజాగా జిల్లా కలెక్టర్ ఆమె విషయంలో నిర్ణయం తీసుకన్నారు. విజయవాడ రూరల్ మండలం నుండి తప్పిస్తూ గూడూరు తహసీల్దార్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. జిల్లాలోని వీరులపాడు లో పని చేస్తున్న బీ సాయి శ్రీనివాస్‌ నాయక్‌ను విజయవాడ రూరల్‌ తహశీల్దార్‌గా నియమించారు. దీంతో..ప్రభుత్వాలు మారినా..అధికారులుగా తమ పైన ఉండే ఒత్తిడి.. తమతో వ్యవహరించే తీరు మాత్రం ఒకే విధంగా ఉంటుందనే చర్చ ఉద్యోగ సంఘాల్లో మొదలైంది.

English summary
MRO Vanajakhsi who faced troubles in Chandrababu govt is now facing the same in YCP govt also. She is now transferred to the other Mandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X