విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో అవినీతి ఎక్కువ, ఎన్నికల జిమ్మిక్కులు: చంద్రబాబుపై మండిపడ్డ తలసాని

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ నేతల నుండి రిటర్న్ గిఫ్టుల పరంపర కొనసాగుతోంది..రిటర్న్ గిప్టు లో భాగాంగా ఇప్పటికే పావులు కదుపుతున్న తెలంగాణ మాజి మంత్రి,టిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ లోపర్యటించారు..గతంలో సంక్రాంతి పండగ సంధర్భంలో పర్యటించిన ఆయన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్టు తయారవుతుందని వ్యాఖ్యనించారు..అది ఆయన ఊహించని విధంగా ఉంటుందంటూ ఘాటుగా స్పందించారు....

తాజగా మరోసారి ఆయన రాజమండ్రిలో ఓ పెళ్లికి హజరైయ్యోందుకు వెళ్లారు...దీంతో ఆయనకు ఆంధ్ర యాదవ నాయకులు ఏయిర్ పోర్టులోనే ఘన స్వాగతం పలికారు..ఈనేపథ్యంలోనే విజయవాడలోని మీడియాతో ..తలసాని మాట్లాడారు.. రాజమండ్రిలో ప్రెస్ మిట్ పెట్టకుండా అక్కడి పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు..గతంలో వచ్చినప్పుడు కూడ తమ వాళ్లను ఇబ్బందులు పెట్టారని అన్నారు...రాజకీయాలు అన్నాక చాల సమస్యలు ఉంటాయని ,కాని అధికారం ఉందని వ్యక్తిగత కక్ష్యలు సాధిం హైద్రబాద్ కు చాలా మంది ఏపి మంత్రులు వస్తున్నారని వారిని ఎందుకు వస్తున్నారని పోలీసులు అడుగుతున్నారా అంటూ ప్రశ్నించారు... ఏపి ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీ నిర్ణయాలపై ఆయన మండిపడ్డారు.

trs mla talasani srinivas yadav fire on chandrababu naidu

ఈ సంధర్భంగా ఆయన చంద్రబాబు పై నిప్పులు చెరిగారు....ఏపి లో ప్రభుత్వ పాలన దారుణంగా ఉందని విమర్శించారు... అవినీతి అత్యధికంగా ఉందన్నారు..16 వేల కోట్ల రెవెన్యు లోటు ఉంది అంటూనే .ప్రభుత్వ సోమ్ముతో దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.. ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు...మరోవైపు ఎన్నికల తాయిలాలు విపరీతంగా ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు..పాడి పరిశ్రమను నిర్లక్ష్యం చేస్తున్నారని ,కేంద్రం పాడి పరిశ్రమ అభివఈద్ది కి కౌంటర్ గ్యారంటీ అడుగుతుంటతతే ఇవ్వడం లేదని అన్నారు..ఈనేపథ్యంలోనే హెరిటేజ్ ఎలా లాభాల్లో ఉందో రైతులకు వివరించాలని డిమాండ్ చేశారు...

ఇక ఏపి ప్రభుత్వం రైతులకు ఇస్తామన్న పదివేల రుపాయల పై కూడ స్పష్టత లేదని చెప్పారు..అగ్రవర్ణ పేదలపై కేంద్రం ఇంకా గైడ్ లైన్స్ ఇవ్వలేదని అయిన ఏపి కాపులకు 5 శాతం రిజర్వేషన్ ప్రకటించారని అన్నారు..పసుపు,కుంకుమ పథకం ఒక బోగస్ అని వాఖ్యానించారు..ఏన్నికల కోసం చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నారని అన్నారు..ఏపిని సింగపూర్ చేస్తామని చెబుతున్న బాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు ...హైద్రబాద్ ను నేనే నిర్మించాని చెబుతున్న చంద్రబాబు కనీసం కనకదుర్గమ్మ ప్లైఓవర్ ను ఎందుకు నిర్మించలేకపోతున్నారని ప్రశ్నించారు.

గతంలో ప్రత్యేక హోదా సంజీవని ఏం కాదని ప్రకటించిన చంద్రబాబు, హోదాపై మాట్లాడితే జైల్లో పెడతామని అనలేదా అంటూ ప్రశ్నించారు..మళ్లి ఇప్పుడు కేంద్రం పై ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటున్నారని ఏద్దేవా చేశారు...ఇక కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగు దేశం పార్టీని రాహుల్ గాంధి పాదల దతగ్గర పెడుతున్నారని అన్నారు...

ఆంధ్రప్రదేశ్ లో బీసీలను ఏకం చేస్తామని స్పష్టం చేశారు..ఈనేపథ్యంలో గుంటూర్ జిల్లాలో ,మరియు బీసీ గర్జనను ఏర్పాటు చేస్తామని అన్నారు...

English summary
trs mla talasani srinivas yadav fire on chandrababu naidu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X