విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెల్ టవర్ ఎక్కి మహిళల హంగామా .. ఆ విషయంలో జగన్ కు మహిళల డిమాండ్

|
Google Oneindia TeluguNews

విజయవాడలో నిరుద్యోగ మహిళలు ఆందోళన బాట పట్టారు. జగన్ అన్నా జాబ్ ఇవ్వన్నా అంటూ నినాదాలు చేస్తూ సెల్ టవర్ ఎక్కి ఆందోళన నిర్వహించారు. అంతేకాదు సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించకుంటే తాము ఆత్మహత్యలకు పాల్పడతామని తేల్చి చెప్పారు. మహిళలు ఉద్యోగాల కోసం టవర్ ఎక్కి ఆందోళన చెయ్యటం ఏపీలో చర్చనీయాంశం అయింది. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే ..

ఏపీలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారం సాగిస్తున్న నేపధ్యంలో ఇప్పటికే పలు ఉద్యోగాల నోటిఫికేషన్ లు ఇచ్చారు . కానీ చాలా మంది ఉద్యోగాలు రాక తమ ఉపాధి లేక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగాలు రాని నిరుద్యోగులు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా, కొందరు మహిళలు ఊహించని విధంగాఆందోళన చేశారు. విజయవాడలో కొందరు మహిళలు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వన్నా జగన్ అన్నా అంటూ తమ ఆవేదన తెలియజేశారు .

Unemployed women climbed cell tower for jobs

ఇక అంతేకాదు పెట్రోల్ బాటిల్ చేత్తో పట్టుకుని ఉద్యోగాలు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు దిగారు. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వద్ద పెట్రోల్ బాటిల్ చేత్తో పట్టుకుని సెల్ టవర్ ఎక్కి మహిళా నిరుద్యోగులు నిరసన తెలిపారు. జగనన్నా... జాబ్ ఇవ్వన్నాఅంటూ నినాదాలు చేసిన మహిళలు తమ డిమాండ్ పై ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించాలని కోరారు. లేని పక్షంలో ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. వారిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చేందుకు పోలీసులు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఉద్యోగాల కోసం మహిళలు సెల్ టవర్ ఎక్కి హంగామా చెయ్యటం విజయవాడలో హాట్ టాపిక్ అయ్యింది .

English summary
Unemployed women in Vijayawada have raised concerns. With Jagan Anna .. please give jobs slogan , few women climbed cell tower and started protest. they have taken a petrol bottle with them. If CM Jagan Mohan Reddy does not respond, they will commit suicide . Concerns about women climbing the tower for jobs have been the subject of debate in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X