విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు సంవత్సరాల్లోనే... తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు: కిషన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రానున్న రెండేళ్ల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రాజకీయ మార్పులు చేటు చేసుకుంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈనేపథ్యంలోనే రానున్న రోజుల్లో బీజేపీ జెండాలు ఎగరడం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొడుకుని గెలిపించుకోలేక పోయాడని ఆయన విమర్శించారు. మరోవైపు కేసీఆర్ సైతం తన కూతురు కవితను నిజామాబాద్‌లో గెలిపించుకోలేక పోయారని అన్నారు.

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కిషన్ రెడ్డి విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో ఆ పార్టీ నేతలు నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రానున్నట్టు ఆయన ప్రకటించారు.ఇక ఏపిలో వైఎస్ఆర్‌సీపీకి రాజకీయ ప్రత్యర్థిగా బీజేపీ అవుతుందని అన్నారు.ఇక పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్దిపై కూడ కేంద్రం దృష్టి పెట్టిందని అన్నారు.

unexpected political changes over the next two years; Kishan Reddy

పార్టీ బలోపేతానికి ఉభయ తెలుగు రాష్ట్రల్లో పర్యటిస్తానని కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలో రండవ సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రపంచదేశాల్లో భారత్‌ గౌరవాన్ని నిలబెట్టే విధంగా చర్యలు చేపడుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు దేశాన్ని ఆర్ధిక అస్థిరతకు గురిచేశారని మండిపడ్డ ఆయన ఈ పరిస్థితుల్లో మోడీ ప్రధాని అయ్యారని , అనంతరం దేశ అర్ధిక వ్యవస్థను కూడ గాఢిలో పెడుతున్నారని తెలిపారు.

English summary
Union Minister Kishan Reddy said that the two Telugu states will be accured unexpected changes over the next two years. Against this backdrop, BJP flags will be flying in the coming days, he cleared.and former chief minister Chandrababu Naidu for failing to win his son He criticized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X