విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కనకదుర్గ ఫ్లైఓవర్‌ ఓపెనింగ్‌- మొహం చాటేసిన గడ్కరీ- వైసీపీ, టీడీపీ క్రెడిట్‌ గేమ్

|
Google Oneindia TeluguNews

విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి ముందే రాజకీయాలు మొదలయ్యాయి. నగరానికి మణిహారంగా చెప్పుకుంటన్న ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలై వైసీపీ హయాంలో పూర్తయింది. దీంతో ఇరు పార్టీలు ఈ ఫ్లైఓవర్‌ తమ ఘనతే అంటూ ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టాయి. దీంతో ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కాస్తా మొహం చాటేసినట్లు తెలుస్తోంది. ఆన్‌ లైన్‌ ద్వారా ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభించాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు విజయవాడ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ రెడీ- ట్రయల్‌ రన్‌ విజయవంతం- సెప్టెంబర్‌ 4న ప్రారంభం...విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ రెడీ- ట్రయల్‌ రన్‌ విజయవంతం- సెప్టెంబర్‌ 4న ప్రారంభం...

కనకదుర్గ ఫ్లైఓవర్‌ రెడీ...

కనకదుర్గ ఫ్లైఓవర్‌ రెడీ...

విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం పూర్తి చేసుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రస్తుతం నగరానికి మణిహారంగా మారింది. కనకదుర్గ గుడిని ఆనుకుని నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం కాస్త ఆలస్యమైనా అద్భుతమైన ఇంజనీరింగ్‌ ప్రతిభతో తాజాగా పూర్తయింది. రాష్ట్రంలో అత్యంత పొడవైన ఫ్లైఓవర్‌గా పేరు తెచ్చుకున్న ఈ 2.3 కిలోమీటర్ల వంతెన నగరానికి వచ్చే సందర్శకులను సైతం ఆకట్టుకునేలా ఉంది. కృష్ణలంకలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్ నుంచి కనకదుర్గ గుడి దాటాక కుమ్మరి పాలెం సెంటర్‌ మీదుగా భవానీపురం వరకూ నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ నగరంలోని సొరంగం తర్వాత విజయవాడ వాసులను అంతగా ఆకర్షిస్తోంది.

క్రెడిట్‌ పాలిటిక్స్‌..

క్రెడిట్‌ పాలిటిక్స్‌..

2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం ప్రారంభమైంది. ఆ తర్వాత కేంద్రం నుంచి టీడీపీ తప్పుకోవడం, నిధులు ఆలస్యం కావడం, తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చాక లాబీయింగ్‌ తో తిరిగి పనులు మొదలుకావడం, ఆ తర్వాత కరోనా కారణంగా పనులు ఆగడం, తిరిగి ఈ మధ్యే మొదలై నిర్మాణం పూర్తి కావడం జరిగాయి. దీంతో ఈ ఫ్లైఓవర్‌ ప్రతిపాదనే తమదంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని చెబుతున్నారు. అప్పట్లో ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం సాధ్యం కాదని చెప్పిన వారే ఇప్పుడు తామే నిర్మించామని చెప్పుకుంటున్నారని కేశినేని ఆరోపిస్తుండగా.. వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. ఎప్పుడో నిలిచిపోయిన పనులను తమ ప్రభుత్వం వచ్చాక తిరిగి ప్రారంభించి పూర్తి చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

 గడ్కరీని ఆహ్వానించిన కేశినేని...

గడ్కరీని ఆహ్వానించిన కేశినేని...


కేంద్ర ప్రభుత్వ నిధులతో మొదలుపెట్టిన ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి రావాలని ఉపరితల రవాణామంత్రి నితిన్‌ గడ్కరీని విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా ఢిల్లీ వెళ్లి ఆహ్వానించారు. వాస్తవానికి ప్రోటోకాల్‌ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించాల్సి ఉన్నప్పటికీ కేశినేని నాని ప్రత్యేకంగా వెళ్లి అంతకు ముందే ఆయన్ను ఆహ్వానించారు. కేశినేని వ్యవహారం చూశాక ప్రభుత్వం నుంచి ఎవరూ గడ్కరీ వద్దకు వెళ్లలేదు. ఇలాంటి పరిస్ధితుల్లో తాను ప్రారంభోత్సవానికి వస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోనని గడ్కరీ భావించినట్లు తెలుస్తోంది.
కనకదుర్గ ఫ్లైవర్‌ విషయంలో ముందు నుంచీ ఆసక్తి చూపిన కేశినేని నాని.. చివర్లో గడ్కరీని ఆహ్వానించడం ద్వారా ఆ క్రెడిట్‌ తన ఖాతాలో వేసుకోవాలని భావించారు. కానీ అలా జరగలేదు.

మొహం చాటేసిన గడ్కరీ...

మొహం చాటేసిన గడ్కరీ...

కనకదుర్గ ఫ్లైఓవర్‌ విషయంలో వైసీపీ, టీడీపీ రాజకీయాల సెగ గడ్కరీని తాకింది. పరిస్ధితిని గమనించిన గడ్కరీ.. వైసీపీ, టీడీపీ మధ్య పోరు సాగుతున్న తరుణంలో ప్రారంభోత్సవానికి రాకపోవడమే మేలని భావించినట్లు తెలుస్తోంది. కేశినేని ఆహ్వానించి, ప్రభుత్వం తరఫున మంత్రులు కానీ సీఎం జగన్ కానీ ప్రత్యేకంగా ఆహ్వానించనప్పుడు విజయవాడ రావడం అవసరమా అని ఆయన భావించినట్లు సమాచారం. అందుకే ఆన్‌ లైన్‌ ద్వారా ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం పూర్తి చేయాలని గడ్కరీ నిర్ణయించారు. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇవాళ వెల్లడించారు. దీంతో గడ్కరీతో ప్రారంబోత్సవం చేయించి కనకదుర్గ ఫ్లైఓవర్‌ క్రెడిట్‌ సొంతం చేసుకోవాలని భావించిన వైసీపీ, టీడీపీ నేతలకు చివరికి ఆశాభంగం తప్పలేదు.

English summary
the union minister for transport nitin gadkari has decided to open kanakadurga flyover in vijayawada city through online amid credit game between ruling ysrcp and opposition tdp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X