విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పప్పు వస్తాడా ... వాళ్ళ బాబు వస్తాడా ... చంద్రబాబు డబుల్ వెధవ : వల్లభనేని వంశీ

|
Google Oneindia TeluguNews

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత దూషణలకు దిగారు. నారా లోకేష్ ను, చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేసిన వంశీ టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని, ఇప్పుడు వాళ్ళు తనను పార్టీ నుండి సస్పెండ్ చేసేది ఏంటి అని మాట్లాడారు. ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో కలిసి పని చేయాలంటే టెక్నికల్ గా ఎమ్మెల్యేగా రిజైన్ చేయాల్సి ఉందని పేర్కొన్న వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా రిజైన్ చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు.

సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకర పోస్ట్ లపై వల్లభనేని వంశీ ఫిర్యాదు.. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకర పోస్ట్ లపై వల్లభనేని వంశీ ఫిర్యాదు..

నేను వెధవనైతే చంద్రబాబు డబుల్ వెధవ అన్న వల్లభనేని వంశీ

నేను వెధవనైతే చంద్రబాబు డబుల్ వెధవ అన్న వల్లభనేని వంశీ

గన్నవరానికి పప్పు వస్తాడో వాళ్ళ బాబు చంద్రబాబు వస్తాడో తేల్చుకోవాలన్నారు. ఇద్దరు కలిసి వచ్చినా సరే తాను మాత్రం రెడీగా ఉన్నానని చెప్పారు. టిడిపి సోషల్ మీడియాలో తన గురించి ఇష్టారాజ్యంగా ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పేర్కొన్న వల్లభనేని వంశీ నేను తప్పు చేస్తే నేను సన్నాసినే.. కానీ చంద్రబాబు డబల్ సన్నాసి, నేను వెధవని అయితే చంద్రబాబు డబల్ వెధవ అంటూ తిట్ల దండకం అందుకున్నారు.

చంద్రబాబు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా అంటూ ప్రశ్న

చంద్రబాబు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా అంటూ ప్రశ్న


చంద్రబాబు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ఆస్తులను కాపాడుకోవడానికి, కేసులకు భయపడి పార్టీ మారుతున్నానని చేసిన వ్యాఖ్యలకు మండిపడిన వంశీ చంద్రబాబు లాగా తనమీద ఓటుకు నోటు కేసు లేదన్నారు. అంతేకాదు ప్రస్తుతం నేను చేస్తున్నది పార్టీకి ద్రోహం అయితే నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు అవకాశం ఇచ్చిన ఇందిరాగాంధీ విషయంలో చేసింది ద్రోహమే కదా అని ప్రశ్నించారు.

 చంద్రబాబు నాయుడి తండ్రి ఖర్జూర నాయుడు ఏమైనా మైసూర్ మహారాజానా అని ప్రశ్నించిన వంశీ

చంద్రబాబు నాయుడి తండ్రి ఖర్జూర నాయుడు ఏమైనా మైసూర్ మహారాజానా అని ప్రశ్నించిన వంశీ

తన గురించి చెప్పడానికి ఏమీ పెద్దగా ఉండదని అదే చంద్రబాబు చరిత్ర చెప్పాలంటే చాలానే ఉందని అదంతా బయటపెడతానని హెచ్చరించారు వల్లభనేని వంశీ. పెద్ద సినిమానే తియ్యొచ్చు అన్నారు . అంతేకాదు ఒకటికి పది సార్లు చంద్రబాబు వల్లభనేని వంశీ కి ఏం చూసి టికెట్ ఇచ్చారని పదేపదే మాట్లాడుతున్న వాళ్లకు, నాడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సమయంలో ఇందిరాగాంధీ ఏం చూసి టికెట్ ఇచ్చారు అంటూ ప్రశ్నించాడు. చంద్రబాబు నాయుడి తండ్రి ఖర్జూర నాయుడు ఏమైనా మైసూర్ మహారాజానా చెప్పాలని ప్రశ్నించాడు.

పప్పు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అభద్రతా భావంలో ఉన్నారన్న వంశీ

పప్పు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అభద్రతా భావంలో ఉన్నారన్న వంశీ

ఇక అంతే కాదు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు చేసింది ప్రపంచానికి తెలిసిందే అని మరోమారు మామను వెన్నుపోటు పొడిచిన విషయాన్ని గుర్తు చేశారు . గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటినుండి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో పప్పు అభద్రత భావానికి లోనవుతున్నాడు అని వల్లభనేని వంశీ విమర్శించారు. పార్టీ కోసం చంద్రబాబు చేసింది ఏంటి నా ....... అంటూ పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ అంటే ఎవరో తెలీదు .. పప్పు అనండి అన్న వంశీ

లోకేష్ అంటే ఎవరో తెలీదు .. పప్పు అనండి అన్న వంశీ

నేను వంద సార్లు చెప్పినప్పటికీ చంద్రబాబు పట్టించుకోకపోవడం, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత విమర్శలకు దిగడం, వ్యక్తిత్వాన్ని కించపరచడం తనను చాలా బాధించిందని అందుకే తాను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. ఇక లోకేష్ ప్రస్తావన తెచ్చినప్పుడు, లోకేష్ అంటే ఎవరో అనుకుంటాను .. పప్పు అనండి అంటూ తను మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ పప్పు అనే ప్రస్తావించాడు వల్లభనేని వంశీ.

 పప్పు లాంటి గుదిబండలు ఉంటేనే పార్టీకి నష్టం అన్న వంశీ

పప్పు లాంటి గుదిబండలు ఉంటేనే పార్టీకి నష్టం అన్న వంశీ


తెలుగుదేశం పార్టీలో వల్లభనేని వంశీ వెళ్లిపోవడం వల్ల ఎలాంటి నష్టం లేదని పేర్కొన్న లోకేష్ ను ఉద్దేశించి తన లాంటి వాళ్ళు వెళ్లి పోతే నష్టం లేదని, పప్పు లాంటివాళ్ళు,గుదిబండలుగా మారి పార్టీలో ఉంటే నష్టమని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. పప్పు బరువు మోయలేక టిడిపి పడవ మునిగి పోతుంది అని వంశి తిట్టిపోశారు. షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయం పై మాట్లాడిన వంశీ సహనం నశించి నోటికొచ్చింది తిట్టిపోశారు.

 షోకాజ్ నోటీసు కాకపోతే గాడిద గుడ్డు కూడా ఇవ్వమనండి అంటూ ఆగ్రహం

షోకాజ్ నోటీసు కాకపోతే గాడిద గుడ్డు కూడా ఇవ్వమనండి అంటూ ఆగ్రహం

షోకాజ్ నోటీసు కాకపోతే గాడిద గుడ్డు కూడా ఇవ్వమనండి ,నాకు పప్పు గాడిలా పదవుల మీద వ్యామోహం లేదు. వాళ్ళేంటి నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చేది ...... గాళ్లు అంటూ ఘాటుగా తిట్టారు. చంద్రబాబు చేసిన ఇసుక దీక్ష కు ఎంత మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు అనేది చూస్తే టిడిపి ఎమ్మెల్యేలు ఎంతమంది తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారో తెలుస్తుందని వల్లభనేని వంశీ పేర్కొన్నారు.బతిమాలి పిలిచినా భోజనాలు పెట్టినా ఎవరూ రావటం లేదన్నారు.

చంద్రబాబును, లోకేష్ ను వాడు వీడు అంటూ ఉతికి ఆరేసిన వంశీ

చంద్రబాబును, లోకేష్ ను వాడు వీడు అంటూ ఉతికి ఆరేసిన వంశీ

తనతో మొదలైన ఈ ఉద్యమం ముందు ముందు కొనసాగుతుందని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. టిడిపి చారిత్రక తప్పిదాలు చేస్తూ, పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్నదని వల్లభనేని వంశీ అభిప్రాయపడ్డారు. మొత్తానికి మొన్న రాజేంద్రప్రసాద్ ను,నిన్న చంద్రబాబును, లోకేష్ ను నోటికొచ్చినట్టు తిట్టిన వంశీ ఓ రేంజ్ లో ఉతికి ఆరేశారు. ఇంతకాలం టీడీపీలో ఉండి ఇప్పుడు టీడీపీ పరువంతా తీశారు. అయితే ఇదంతా జగన్ వ్యూహం, వంశీ జగన్ షాడో అని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Gannavaram MLA Vallabhaneni Vamsi Mohan began personal defamation of TDP chief Chandrababu Naidu and Lokesh. Vamsi, who targeted Nara Lokesh and Chandrababu Naidu, has said that he will resign from the TDP's primary membership and the MLA also and he will compete in gannavaram election . pappu and pappu's father Chandranabu to make sure that they can come to Gannavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X