• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చెత్త నా కొడకా ... అంటూ యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ పై వంశీ తిట్ల దండకం... షాక్ లో టీడీపీ

|

నిర్మాణ కార్మికుల కోసం ఇసుక దీక్ష చేసిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తూ నిన్న జరిగిన రాజకీయ పరిణామాలు ఏపీ లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు దేవినేని అవినాష్ వైసిపి కండువా కప్పుకోవడం, మరోవైపు టీడీపీకి రాజీనామా చేసినప్పటికీ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అధికార పార్టీని పొగుడుతూ చంద్రబాబును, టిడిపి నాయకులను పరుష పదజాలంతో తిట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

డైలమాలో వల్లభనేని వంశీ ... వైసీపీలో చేరికపై ఇంకా కొనసాగుతున్న సస్పెన్స్

యలమంచిలిపై విరుచుకుపడిన వల్లభనేని వంశీ

యలమంచిలిపై విరుచుకుపడిన వల్లభనేని వంశీ

వల్లభనేని వంశీ పార్టీ మారాలని నిర్ణయం తీసుకుని టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఇక ఉన్నట్టుండి నిన్న చంద్రబాబు దీక్ష సందర్భంగా నోరు విప్పిన వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆయన కుమారుడు లోకేష్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చాలా దారుణమైన విమర్శలు చేశారు. ఇక ఇదే క్రమంలో ఓ చర్చా కార్యక్రమంలో వల్లభనేని వంశీ, టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్‌ల మధ్య కూడా పెద్ద వార్ జరిగింది.

వంశీకి చంద్రబాబు రాజకీయ జన్మనిచ్చారన్న యలమంచిలి

వంశీకి చంద్రబాబు రాజకీయ జన్మనిచ్చారన్న యలమంచిలి

సహనాన్ని కోల్పోయిన వంశీ, యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ మీద ఆగ్రహంతో ఊగిపోయారు. నోటికొచ్చినట్టు చెత్త నా కొడకా అంటూ తిట్టారు. వల్లభనేని వంశీకి ఆయన తండ్రి జన్మనిస్తే, చంద్రబాబు రాజకీయ జన్మనిచ్చారని రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఎన్టీఆర్ ఫ్యామిలీకి సన్నిహితమైన దాసరి కుటుంబాన్ని పక్కనబెట్టి వంశీకి చంద్రబాబు సీటిచ్చారన్నారు. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు వంశీకి బాసటగా నిలిచారని పేర్కొన్నారు రాజేంద్రప్రసాద్.

డెల్టా సాగునీటి విషయంలో కూడా చంద్రబాబు వంశీకే మద్దతు తెలిపారన్న రాజేంద్రప్రసాద్

డెల్టా సాగునీటి విషయంలో కూడా చంద్రబాబు వంశీకే మద్దతు తెలిపారన్న రాజేంద్రప్రసాద్

డెల్టాకు రావాల్సిన పోలవరం కుడి కాల్వ నీటిని మోటార్ల ద్వారా తరలించడానికి వంశీ ప్రయత్నిస్తే ఆ సమయంలో దేవినేని ఉమా అడ్డుకున్నారని, అయితే అదే సమయంలో చంద్రబాబు నాయుడు వంశీకి మద్దతు తెల్పుతూ నీటి తరలింపుకు అంగీకరించారని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అయితే అప్పటికే ఆగ్రహంతో ఉన్న వల్లభనేని వంశీ, రాజేంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

చెత్త నా కొడకా ... అంటూ ఘాటుగా తిట్టిపోసిన వంశీ

చెత్త నా కొడకా ... అంటూ ఘాటుగా తిట్టిపోసిన వంశీ

డొక్క పగులుద్ది... నోరు మూసుకోవోయ్, ఎవరి పొలాలకు నీళ్లు ఇచ్చార్రా , చెత్త నా కొడకా.. చెప్పు తెగుతుంది అంటూ పరుషపదజాలం ఉపయోగిస్తూ వ్యక్తిగత దూషణలకు దిగారు వల్లభనేని వంశీ. దీంతో రాజేంద్రప్రసాద్‌, వంశీల మధ్య తీవ్రస్థాయిలోనే వాదన జరిగింది . సంస్కారం లేకుండా మాట్లాడొద్దు అంటూ రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు .అయ్యప్ప మాల వేసుకున్నప్పటికి వల్లభనేని కోపాన్ని నియంత్రించుకోలేక యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ పై తిట్ల దండకం చదవడం, వ్యక్తిగత విమర్శలు చేయడం టిడిపి నేతలను ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది.

వంశీ తిట్లను విన్న టీడీపీ నేతలు షాక్ .. చంద్రబాబు స్పందిస్తారా ?

వంశీ తిట్లను విన్న టీడీపీ నేతలు షాక్ .. చంద్రబాబు స్పందిస్తారా ?

అంతేకాదు వంశీ టిడిపికి రాజీనామా చేసింది పార్టీలో ఉన్న అంతర్గత కలహాల నేపథ్యంలోనే అన్న విషయం మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇంతగా ఘాటైన పదజాలంతో చెప్పలేని విధంగా టిడిపి నేతలను దుర్భాషలాడిన వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు స్పందిస్తారా ? నిన్న ఇసుక దీక్ష సందర్భంగా కూడా వంశీ చంద్రబాబుకు పలు ప్రశ్నలను సందించారు . ఇక ఆ ప్రశ్నలకు బాబు సమాధానం చెప్తారా ? భవిష్యత్తులో వంశీ ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

English summary
Gannavaram MLA Vallabhaneni Vamsi Mohan began the discussion by addressing the TDP MLC as 'Rajendra Anna'. Within no time, The Gannavaram MLA lost his temper and began hurling abuses without even bothering that its adebate. he shouted and abused in a fit of anger,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X