• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కొడాలిని కొట్టేందుకు వంగవీటిని రెడీ చేస్తున్న టీడీపీ-సిద్ధమవ్వాలని రాధా సంకేతం-స్నేహానికి గుడ్ బై ?

|

ఏపీలోని కృష్ణాజిల్లా గుడివాడ రాజకీయం ఎప్పుడూ ఆసక్తికరమే. అక్కడ కొన్నేళ్లుగా పాగా వేసి టీడీపీని ముప్పతిప్పలు పెడుతున్న కొడాలినానిని ఢీ కొట్టేందుకు చంద్రబాబు క్యాంపులో సరైన నేత కనిపించడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల కోసం అన్వేషణ సాగిస్తున్న టీడీపీకి వంగవీటి రాధా రూపంలో మంచి అవకాశం దొరికింది. అయితే కొడాలి నానికి స్నేహితుడిగా పేరు తెచ్చుకున్న రాధాను ఈ మేరకు టీడీపీ ఒప్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఇవాళ రంగంలోకి దిగారు. అంతేకాదు రెడీగా ఉండాలని తన వర్గానికి చెందిన నేతలకు కూడా సూచించారు. ఇది గుడివాడలో రాజకీయాల్ని ఆసక్తికరంగా మార్చింది.

గుడివాడ పాలిటిక్స్

గుడివాడ పాలిటిక్స్

ఏపీలో కమ్మ సామాజికవర్గం హవా కొనసాగే జిల్లాల్లో కృష్ణాజిల్లా ప్రధమ స్ధానంలో ఉంటుంది. అందులోనూ విజయవాడతో పాటు దానికి సమీపంలోనే ఉన్న గుడివాడ నియోజకవర్గంలోనూ ఈ హవా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక్కడ రాజకీయాల్ని శాసించే స్ధాయిలో ఉన్న కమ్మ సామాజికవర్గానికి సరైన నేత లేకపోవడంతో కొన్నేళ్లుగా వైసీపీలోకి ఫిరాయించిన కొడాలినానిపైనే ఆధారపడుతోంది. దీంతో అయిష్టంగానే నానిని తన సొంత సామాజికవర్గం గెలిపిస్తూ వస్తోంది. అయితే ఇదంతా ఎప్పటివరకూ అంటే కాలమే సమాధానం చెప్పాలనేవారూ అధికమే. కానీ ఇప్పుడు టీడీపీ దీనికి విరుగుడు కనిపెట్టే పనిలో బిజీగా కనిపిస్తోంది.

కొడాలిని ఢీకొట్టే నేతలే లేరా ?

కొడాలిని ఢీకొట్టే నేతలే లేరా ?

గుడివాడ నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా మారిన కొడాలి నానిని ఢీకొట్టేందుకు కొంతకాలంగా టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే టీడీపీ వద్ద పెద్దగా ఆప్షన్లు కనిపించడం లేదు. ఇప్పటికే గత ఎన్నికల్లో విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ ను రంగంలోకి దింపి చేతులు కాల్చుకున్న టీడీపీ ఈసారి ఎన్నికల్లో సత్తా చూపాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకే కొడాలి నాని పై సై అంటే సై అనే నేత కోసం ఎదురుచూస్తోంది. ఇందుకోసం కమ్మ సామాజికవర్గంపైనే నిన్న మొన్నటివరకూ ఆశలు పెట్టుకున్న టీడీపీ ఇప్పుడు ఇతర సామాజికవర్గాలైనా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

వంగవీటి రాధాను పంపే యోచన

వంగవీటి రాధాను పంపే యోచన

విజయవాడకు చెందిన కాపు నేత వంగవీటి రాధాను గత ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలోకి దింపాలో తెలియక స్టార్ క్యాంపెయినర్ గా మాత్రమే వాడుకున్న టీడీపీ.. ఇప్పుడు మాత్రం ఆయన విషయంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కృష్ణాజిల్లాతో పాటు రాష్ట్రంలోని కాపు సామాజికవర్గంలో పట్టున్న వంగవీటి రాధాను గుడివాడ పంపితే ఎలా ఉంటుందని టీడీపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తుగానే కొడాలిని ఢీకొట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని వంగవీటికి సూచించినట్లు సమాచారం. టీడీపీ సూచనలతో వంగవీటి రాధా ఇవాళ గుడివాడ వెళ్లి అక్కడ స్ధానిక నేతలతో సమావేశమయ్యారు.

రెడీగా ఉండాలన్న వంగవీటి

రెడీగా ఉండాలన్న వంగవీటి


ఇవాళ గుడివాడ నియోజకవర్గానికి వెళ్లి అక్కడి కాపు సామాజిక వర్గ నేతలతో భేటీ అయిన వంగవీటి రాధా వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం రెడీగా ఉండాలని వారిని కోరినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను గుడివాడ నుంచి బరిలోకి దిగబోతున్నట్లు వారికి సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో వంగవీటికి మద్దతుగా కలిసి వచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు చెప్పారని తెలుస్తోంది. గుడివాడలో తాను బరిలోకి దిగితే ఎదురయ్యే సవాళ్లపై వంగవీటి రాధా..ముందుగా సొంత సామాజిక వర్గ నేతల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొడాలి బలహీనతలతో పాటు తన అనుకూలతపైనా ప్రాధమికంగా ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగానే వంగవీటి తన తదుపరి వ్యూహం ఖరారు చేయనున్నారు.

కొడాలితో స్నేహానికి గుడ్ బై ?

కొడాలితో స్నేహానికి గుడ్ బై ?

వాస్తవానికి వంగవీటి రాధాకూ, మంత్రి కొడాలి నానికీ మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. కృష్ణాైజిల్లాలోని ఇతర నేతలతో పోలిస్తే వంగవీటితో కొడాలి సఖ్యతగా ఉంటారన్న ప్రచారం కూడా ఉంది సామాజిక వర్గాలు వేరైనా వీరిద్దరూ వైసీపీలో కలిసి పనిచేశారు. వైసీపీలో ఉండగా కూడా రాధాతో పాటు కొడాలి నాని కలిసి తిరిగే వారు కూడా. కానీ ఇప్పుడు తనకు పోటీ చేసే నియోజకవర్గం కరువవడంతో టీడీపీ అధిష్టానం సూచన మేరకు గుడివాడలో పోటీ చేసేందుకు వంగవీటి రాధా పావులు కదుపుతున్నారు. ఇదే క్రమంలో కొడాలితో స్నేహానికి కూడాై గుడ్ చై చెపుతారన్న ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు గుడివాడ వచ్చినా కొడాలితో కలిసి తిరిగే రాధా ఇవాళ మాత్రం విడిగా వెళ్లి నేతల్ని కలవడంతో ఈ ప్రచారం ఊపందుకుంటోంది.

  Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety
  కొడాలిని కొట్టే మగాడు వంగవీటి ?

  కొడాలిని కొట్టే మగాడు వంగవీటి ?

  కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రాధాకు తన సొంత వర్గంతో పాటు అంగబలం, అర్దబలం కూడా ఉన్నాయి. అదే సమయంలో కొడాలి నాని అప్పులపాలై ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు కొడాలి నాని చంద్రబాబుతో పాటులోకేష్ ను కూడా ఆడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొడాలితో సై అంటే సై అనే నేత కోసం టీడీపీ ఎదురుచూస్తోంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గుడివాడలో టీడీపీ జెండా ఎగరారని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. ఇందుకోసం వంగవీటిని ఇప్పటి నుంచే ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొడాలి నానితో పోలిస్తే మాట తీరు పరంగా కూడా దూకుడుగా ఉండే వంగవీటి అయితేనే తట్టుకోగలరనే ప్రచారం ఉండనే ఉంది. దీంతో వంగవీటిని రంగంలోకి దింపడం ద్వారా కొడాలికి చెక్ పెట్టేందుకు టీడీపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

  English summary
  tdp leader vangaveeti radha's tour in gudivada constituency gives indications on his fight against minister kodali nani in next elections.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X