విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

25న టిడిపిలో రాధా : జ‌న‌సేన లో చేరాల‌న్న అభిమానులు : జ‌గ‌న్ టిక్కెట్లు అమ్ముకుంటున్నారు ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Vangaveeti Radha Decides To Join In TDP On This Month 25th | Oneindia Telugu

వైసిపికి రాజీనామా చేసిన వంగ‌వీటి రాధా ఈ నెల 25న టీడీపీలో చేర‌నున్నారు. ఈ మేర‌కు పార్టీ నేత‌ల‌తో జ‌రిగిన చ‌ర్చ లల్లో నిర్ణ‌యానికి వ‌చ్చారు. ముఖ్య‌మంత్రి సైతం కృష్ణా జిల్లా నేత‌ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై రాధా పార్టీలోకి రావ‌టం పై అభిప్రాయ సేక‌ర‌ణ చేసారు. అంద‌రూ క‌లిసి న‌డ‌వాల‌ని నిర్ధేశించారు. ఇదే స‌మ‌యంలో ఇక వైసిపి అధినేత జ‌గ‌న్ లక్ష్యంగా రాధా రాజ‌కీయ అడుగులు వేయ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ను లక్ష్యంగా చేసుకోవాల‌ని...టిడిపి అను కూలంగా ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించారు..

జ‌న‌సేన లో చేర‌మని అభిమానుల సూచ‌న‌..

జ‌న‌సేన లో చేర‌మని అభిమానుల సూచ‌న‌..

వైసిపి కి రాజీనామా చేసిన వెంట‌నే రాధా త‌న అనుచ‌ర వ‌ర్గం..రాధారంగా మిత్రమండలి సభ్యుల తో స‌మావేశ‌మ‌య్యా రు. వారితో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అందులో టిడిపి నుండి ఆహ్వానం అందుత‌న్న విష యాన్ని రాధా వివ‌రించారు. సామాజిక స‌మీక‌ర‌ణాలు దృష్టిలో పెట్టుకొని జ‌న‌సేన‌లో చేరితో బాగుంటుంద‌న్న సూచ‌న ల‌ను అభిమానులు చేసారు. అయితే, టిడిపిలో వెళ్ల‌టం ద్వారా రాజ‌కీయంగా జ‌రిగే ప్ర‌యోజ‌నాల‌ను రాధా వివ‌రించిన ట్లు స‌మాచారం. అయితే, ప్ర‌స్తుతం విజ‌య‌వాడ న‌గ‌రంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ముగ్గురు టిడిపి స‌భ్యులే ఉన్నా రు. దీంతో..ఆయ‌న‌కు ఎమ్మెల్యే సీటు ద‌క్కే అవ‌కాశం క‌నిపించ‌టం లేదు. టిడిపి నుండి ఎమ్మెల్సీ ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు. దీంతో..ఆయ‌న టిడిపి లో చేర‌టం లాంఛ‌నంగానే క‌నిపిస్తోంది.

టీడీపీలోకి వంగవీటి రాధాకు స్వాగతం, ఆ పదవి ఆఫర్?: జగన్‌కు రెండ్రోజుల గడువు వెనుక! టీడీపీలోకి వంగవీటి రాధాకు స్వాగతం, ఆ పదవి ఆఫర్?: జగన్‌కు రెండ్రోజుల గడువు వెనుక!

రాధా వ‌స్తున్నారు..క‌లిసి ప‌ని చేసుకోండి..

రాధా వ‌స్తున్నారు..క‌లిసి ప‌ని చేసుకోండి..

సోమ‌వారం రాత్రి మంత్రివ‌ర్గ సమావేశం ముగిసిన త‌రువాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కృష్ణా జిల్లా నేత‌ల‌తో స‌మావేశ మ‌య్యారు. పార్టీ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా వంగ‌వీటి రాధాను పార్టీలోకి తీసుకుంటున్నామ‌ని..అంద‌రూ క‌ల‌సి ప‌ని చేయాల ని సూచించారు. పార్టీ నేత‌ల‌తో స‌మావేశం స‌మ‌యంలో రాధాను పార్టీలోకి తీసుకోవాల‌ని అనుకుంటున్నాం. మీ అభి ప్రాయం చెప్పండి..అని చంద్ర‌బాబు అడిగారు. పార్టీ నేత‌లంగా మీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని స్ప‌ష్టం చేసారు. వ్యక్తిగ‌త అభిప్రాయాల‌ను ప‌క్క‌న పెట్టి అంద‌రూ క‌లిసి పని చేయాల‌ని సీయం సూచించారు. దేవినేని నెహ్రూ త‌న‌యు డు అవినాశ్ కు న్యాయం చేయాల‌ని కొంద‌రు నేత‌లు కోర‌గా..తాను చూసుకుంటాన‌ని హామీ ఇచ్చారు.

జ‌గ‌న్ టిక్కెట్లు అమ్ముకున్నారు..ఇక టార్గెట్ ఆయ‌నే..

జ‌గ‌న్ టిక్కెట్లు అమ్ముకున్నారు..ఇక టార్గెట్ ఆయ‌నే..

వైసిపి వీడిన వంగ‌వీటి రాధా ఇక వైసిపి అధినేత జ‌గ‌న్ ను టార్గెట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే రాధా మిత్ర మండ‌లి స‌భ్యులు జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. జ‌గ‌న్ టిక్కెట్ల‌ను అమ్ముకుంటున్నార‌ని..దీని కార‌ణంగానే రాధా కు టిక్కెట్ నిరాక‌రించార‌ని ఆరోపిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో..ఒక ప్ర‌ధాన సామాజిక వ‌ర్గంలో రంగా త‌న‌యుడిగా రా ధాకు ఉన్న ఇమేజ్ ను పూర్తి స్థాయిలో పార్టీకి ఇమేజ్ పెంచేలా వినియోగించుకోవాల‌ని టిడిపి నేత‌లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా.. వంగ‌వీటి రాధా రానున్న రోజుల్లో కృష్ణా - గుంటూరు- ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌గ‌న్ ల‌క్ష్యంగా టిడిపికి అనుకూలంగా ప్రచారం చేయ‌నున్నారు. మార్చి నెలాఖ‌రుకు ఖాళీ అయ్యే శాస‌న మండ‌లి స్థానాల్లో రాధాకు టిడిపి అధినాయ‌క‌త్వం అవ‌కాశం క‌ల్పించ‌నుంది.

English summary
Vangaveeti Radha decided to join in TDP on this month 25th. C.M Chandra babu discussed with party leaders about Radha entry into party. Radha also informed his followers that he joining in TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X