విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొడాలి నానీ మాట్లాడితే బూతుల కంపే ..వారికి చట్టం వర్తించదా ? వర్ల ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో టిడిపి, వైసిపి నేతల మధ్య వార్ కొనసాగుతుంది . ఏపీలో వైసీపీ నేతలు మంత్రుల తీరు, వారు చేస్తున్న వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. బూతులు మాట్లాడుతున్న మంత్రులు, స్పీకర్ తీరు పై ప్రతిపక్ష పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల భాష ఈ విధంగా ఉంటే సామాన్యులు ఇంకా ఏ విధంగా ప్రవర్తిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం పైన తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇక ఇదే అంశం పైన టిడిపి నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో చట్టం కొంతమందికే చుట్టమా? అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. నోటికొచ్చినట్టు చంద్రబాబుపై దుర్భాషలాడిన ఇప్పుడు చట్టం వర్తించదా అని వర్ల రామయ్య ప్రశ్నించారు.కొడాలి నాని మాట్లాడితే బూతుల కంపు కొడుతుందన్నారు. వైసిపి నేతల బూతులు ఎవరు వినలేక పోతున్నారని వర్ల పేర్కొన్నారు. ఒక సీనియర్ మహిళా జర్నలిస్ట్ మంత్రిని బూతులు మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేశారని, ఒకవేళ బూతులు మాట్లాడితే తన ఇంటర్వ్యూ చేయలేనని చెప్పారని వర్ల రామయ్య గుర్తుచేశారు.

 Varala Ramaiah outrage on Kodali Nani and speaker.. demanded to arrest Nani

స్పీకర్ తమ్మినేని, ఒక శాసనసభ స్పీకర్ హోదాలో ఉండి నోటికొచ్చినట్టు సోనియాగాంధీ ప్రస్తావన తెచ్చి మాట్లాడిన మాటలు శిక్షార్హం కాదా? అని వర్లరామయ్య ప్రశ్నించారు స్పీకర్ ఏం మాట్లాడినా పర్వాలేదా? అంటూ మండిపడ్డారు. కొడాలి నాని ఏం మాట్లాడినా పర్వాలేదు కానీ, సామాన్యులు మాట్లాడితే వారిని అరెస్టు చేస్తారా అంటూ వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మజను అరెస్ట్ చేయడానికి వర్తించే చట్టాలు, కొడాలి నాని కి వర్తించదు అని ప్రశ్నించారు. కొడాలి నాని ని కూడా అరెస్ట్ చేయాల్సిందే అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంత్రి కొడాలి నాని టిడిపి అధినేత చంద్రబాబును,లోకేష్ ను,ముఖ్య నాయకులను తీవ్ర పదజాలంతో దూషిస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు ఉండవా ? చట్టాలు వైసీపీ నేతలకు చుట్టాలా అని ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

English summary
Varla Ramaiah commented that Koodali Nani was the Minister of abuses. Do the laws change as the minister speaks abusive language ? He asked. Varla Ramaiah has demanded to arrest kodali nani about former TDP chief Chandrababu abusive comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X