• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వర్మ సంచలనం .. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితే టీడీపీ ఓటమి అంతా మర్చిపోతారు

|

గడచిన ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. ఇప్పటికే టీడీపీ ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతుంది. భవిష్యత్ కార్యాచరణ విషయంలో కూడా స్తబ్దంగా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకునే యత్నం చేస్తున్న చంద్రబాబు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్తున్నారు. ఎవరూ బాధ పడొద్దని , ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండే పార్టీ తమదని ఆయన పార్టీ శ్రేణుల్లో కాస్త ధైర్యం నూరిపోస్తున్నారు. అయినా టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం వీడటం లేదు.

టీడీపీని రక్షించగలిగేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే .. పార్టీ పగ్గాలు చేపడితే ఓటమిని అంతా మర్చిపోతారు

టీడీపీని రక్షించగలిగేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే .. పార్టీ పగ్గాలు చేపడితే ఓటమిని అంతా మర్చిపోతారు

ఇక ఇదే సమయంలో వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ తిరిగి మనుగడ సాగించాలంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ బాధ్యతలు చేపట్టాలని తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ స్వీకరిస్తే ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని అందరూ మర్చిపోతారని ట్వీట్ చేశారు. మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది తారక్ ఒక్కరేనని వర్మ అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ కు తన తాతగారిపై ఏమైనా అభిమానం ఉంటే వెంటనే టీడీపీని రక్షించే బాధ్యతలను తన భుజాలపై వేసుకోవాలని సూచించారు.

జగన్ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టిన చిరంజీవి , పవన్ కళ్యాణ్ .. జగన్ స్వయంగా పిలిచినా గైర్హాజరు

పార్టీ క్షేత్ర స్థాయిలో పటిష్టం కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలనే చర్చ

పార్టీ క్షేత్ర స్థాయిలో పటిష్టం కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలనే చర్చ

జూనియ‌ర్ ఎన్టీఆర్ లేక‌పోతే తెలుగుదేశం పార్టీకి భ‌విష్య‌త్తు ఉండ‌దేమో అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఉన్న‌ప్ప‌టి నుండి అన్నీ తానై ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని న‌డిపించాడు చంద్ర‌బాబునాయుడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితి వేరు.. ఇప్పుడు పార్టీ ప‌రిస్థితి వేరు. తాజాగా వ‌చ్చిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ మ‌రీ దారుణంగా ఓడిపోవ‌డంతో ఇప్పుడు కార్య‌కర్త‌లు కూడా కంగారు ప‌డుతున్నారు. పార్టీ భ‌విత‌వ్యం ఎలా ఉండ‌బోతుందో అని ఇప్పుడు అంద‌ర్లోనూ ఒక‌టే కంగారు క‌నిపిస్తుంది. అప్పుడు ఆ తారక‌రాముడు పెట్టిన పార్టీ కాపాడుకోవాలంటే ఇప్పుడు ఈ తార‌క‌రాముడు రావాల్సిందేనని కొంద‌రు పార్టీ కార్య‌కర్త‌లు సైతం చర్చించుకుంటున్నారు . ఇన్నాళ్లూ ఏమో కానీ ఇప్పుడు టీడీపీ చరిత్రలోనే లేని ఓటమి చవి చూసిన త‌ర్వాత క‌చ్చితంగా క్షేత్ర‌స్థాయిలో ప‌టిష్టం చేసుకోవాలంటే ఏదో ఒక‌టి చేయాల‌ని చంద్ర‌బాబుకు కూడా తెలియంది కాదు.

పార్టీ విషయంలో ఏ మాత్రం స్పందించని జూనియర్ పార్టీ పగ్గాలు చేపడతారా ?

పార్టీ విషయంలో ఏ మాత్రం స్పందించని జూనియర్ పార్టీ పగ్గాలు చేపడతారా ?

కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పార్టీ కార్యక్రమాలకు, ఎన్నికల సమయంలో ప్రచారానికి దూరంగా ఉన్నారు. తెలంగాణలో సోదరి సుహాసిని పోటీ చేసినా కూడా ప్రచారం నివహించలేదు. అంతే కాదు ఏపీ ఎన్నికల్లో ఓటమి పాలైనా జూనియర్ స్పందించలేదు. గతంలో టీడీపీని గెలిపించే బాధ్యత భుజాన వేసుకుని ప్రచారం చేసిన జూనియర్ ఇప్పుడు పార్టీలో ఏం జరుగుతున్నా నిర్లిప్తంగా ఉంటున్నారు. ఇక ఇలాంటి సమయంలో వర్మ చెప్పినా, కార్యకర్తలు కోరినా, స్వయానా చంద్రబాబే ఆహ్వానించినా జూనియర్ ఎన్టీఆర్ వింటారా ? పార్టీని బలోపేతం చేసేందుకు పని చేస్తారా ?

English summary
Controversial director Ram gopal varma made sensational comments on junior NTR . He tweeted in his twitter account " If Tarak takes over TDP , all people will immidiately forget TDP’s disastrous failure..NTR’s grandson can be the only saviour and if he has any respect for his grandfather he should immoderately save TDP Jai NTR Jai TARAK". but Tarak is not responding on the party present position and the failure of TDP . He is busy with his movies. There is a big debate on Junior NTR in telugu states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X