విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ సెక్రటేరియట్ లో వాస్తు దోషం .. ఏ ప్రభుత్వానికైనా నష్టమే .. ఓ సిద్దాంతి సంచలనం

|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా ఎన్నికలు పూర్తయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఏపీలో ఊహించని విధంగా వైసీపీ విజయం సాధిస్తుందని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఒక రెండు మూడు సర్వేలు మినహాయించి మిగతా అన్ని సర్వేలు వైసీపీదే విజయం అని చెప్పాయి. జగన్ సీఎం అవుతారని వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే సందట్లో సడేమియా అంటూ ఓ సిద్దాంతి ఏపీ సెక్రటేరియట్ వాస్తు బాగోలేదని చెప్పారు.

వైసీపీలో పండుగ వాతావరణం .. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో జోష్ లో జగన్ పార్టీవైసీపీలో పండుగ వాతావరణం .. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో జోష్ లో జగన్ పార్టీ

ఏపీ సెక్రటేరియట్ లో వాస్తు దోషం అన్న సిద్ధాంతి

ఏపీ సెక్రటేరియట్ లో వాస్తు దోషం అన్న సిద్ధాంతి

ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్ నిర్మాణంలో వాస్తు దోషం చాలా ఉందని సిద్ధాంతి గోటూరి పాములు అన్నారు. సోమవారం విజయవాడలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వాస్తు దోషం వల్లే చంద్రబాబు అధికారం కోల్పోనున్నారా అన్న చర్చ సైతం సాగుతుంది. ఇక గోటూరి పాములు సిద్ధాంతి చెప్పిన దాని ప్రకారం అమరావతిలో ప్రభుత్వకార్యాలయాలలో అనేక వాస్తు దోషాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. వాటి వల్ల నష్టం సంభవిస్తుంది అని పేర్కొన్నారు.

తూర్పు మూసివేయటంవల్ల విపరీతమైన నష్టం జరగుతుందన్న సిద్ధాంతి పాములు

తూర్పు మూసివేయటంవల్ల విపరీతమైన నష్టం జరగుతుందన్న సిద్ధాంతి పాములు

ముఖ్యంగా సెక్రటేరియట్‌‌ను నిర్మించే విషయంలో తప్పుడు వాస్తు ప్రకారం కట్టడాలు కట్టారని సిద్ధాంతి స్పష్టం చేశారు. వాస్తుకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించారని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి వాస్తు వ్యతిరేకంగా నిర్మించడం ద్వారా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికే కాదు రాబోవు ప్రభుత్వలకు నష్టాలు ఏర్పడతాయని గోటూరి పేర్కొన్నారు.సెక్రటేరియట్ రూట్ చివరకు కట్టారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ముందు అసెంబ్లీ కట్టారని, తూర్పు మూతపడిపోయిందని సిద్ధాంతి పాములు చెప్పారు. దీని వల్ల నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు .

ఏ ప్రభుత్వం వచ్చినా నష్టం తప్పదని హెచ్చరిక

ఏ ప్రభుత్వం వచ్చినా నష్టం తప్పదని హెచ్చరిక

ఒక్క ఈశాన్య గేట్ తప్ప... మొత్తం సెక్రటేరియట్ వాస్తు సరిగా లేదన్నారు. ఎవరు ముఖ్యమంత్రిగా అడుగుపెట్టినా... వారికి నష్టం తప్పదని హెచ్చరించారు. సిద్ధాంతి వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలలో అలజడి నెలకొంది. ఒకపక్క జగన్ సీఎం అయితే రాజధాని మారుస్తారట అని ఒక పక్క ప్రచారం జరుగుతుంటే ఇదే సమయంలో ఏపీ సెక్రటేరియట్ కు వాస్తు దోషం వుంది అంటే దీన్ని రాజకీయ వర్గాలు ఎలా తీసుకుంటారో మరి వేచి చూడాల్సిందే.

English summary
Siddhanti Goturi Pamulu said there was a lot of fault in the government offices and the Secretariat building in AP capital Amravati. His comments in Vijayawada on Monday are now a serious debate. The debate over whether Chandrababu will lose power is a mistake. According to Goturi Pamulu , he claimed that there are many missteps in the government in Amravati.Siddhanti Pamulu said the assembly was built before the Chief Minister's office and the eastern one was closed. He said the loss would be caused by this. Except for the Northeast Gate ... the entire Secretariat is not right. Whoever enters the Chief Minister ... warns them not to lose.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X