• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సైంధవుడి పాత్రే చంద్రబాబుది ; ఎంపీ సాయిరెడ్డి ట్వీట్‌ .. ఏ2 శకుని అట్టహాసమంటూ వర్ల రివర్స్ అటాక్

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి . ఫిల్టర్ లేకుండా నోటికొచ్చినట్టు తిట్టుకుంటూనే ఉన్నారు. అంతేకాదు ఆలయాలలో సత్య ప్రమాణాల దాకా రచ్చ ను కొనసాగిస్తున్నారు. తాజాగా మహాభారతాన్ని కూడా వదలకుండా అందులోని పాత్రలతో తిట్టుకోవడం మొదలుపెట్టారు.

అసమర్దుడైన పుత్రరత్నం కోసం 40 ఇయర్స్ ఇండస్టీ ఉన్మాద ధ్వంసరచన : చంద్రబాబుపై సాయిరెడ్డి ఫైర్ అసమర్దుడైన పుత్రరత్నం కోసం 40 ఇయర్స్ ఇండస్టీ ఉన్మాద ధ్వంసరచన : చంద్రబాబుపై సాయిరెడ్డి ఫైర్

 ఇకనైనా భ్రాంతి నుంచి బయటపడు చంద్రబాబు: సాయిరెడ్డి

ఇకనైనా భ్రాంతి నుంచి బయటపడు చంద్రబాబు: సాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిమ్మగడ్డకు ఎన్నికల షెడ్యూల్ ఇప్పించి ఇళ్ల పట్టాల పంపిణీ ,అమ్మఒడి సాయాన్ని ఆపాలి అనుకోవడం, ఆ రోజుల్లో కన్నెర్రజేసి సముద్రాన్ని కంట్రోల్ చేశాను. తుఫానును అడ్డుకున్నానని కోతలు కోయడం వంటిదేనని చంద్రబాబు ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఏదో చేయాలి అనుకుంటారు కానీ ఏమీ జరగదు బాబు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విజయసాయి ఇకనైనా భ్రాంతి నుంచి బయటపడు చంద్రబాబు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మహాభారతంలోని సైంధవుడి పాత్రే ఇప్పటి ఆంధ్ర రాజకీయాల్లో చంద్రబాబుది : సాయిరెడ్డి

మహాభారతంలోని సైంధవుడి పాత్రే ఇప్పటి ఆంధ్ర రాజకీయాల్లో చంద్రబాబుది : సాయిరెడ్డి

ఇదే సమయంలో చంద్రబాబును మహాభారతంలోని సైంధవుడితో పోల్చారు విజయసాయిరెడ్డి.

మహాభారతంలోని సైంధవుడి పాత్రే ఇప్పటి ఆంధ్ర రాజకీయాల్లో చంద్రబాబుది అంటూ చంద్రబాబును సైంధవుడితో పోల్చారు. అన్నింటికీ అడ్డం పడతాడు సైంధవుడు కానీ అది తాత్కాలికమే. ఎందరు సైంధవులు వచ్చినా సంక్షేమ మహాయజ్ఞం ఆగదు. సైంధవ సంహారం కోసం అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగించాడు. చంద్రబాబు పై జనం ప్రజాస్వామ్య అస్త్ర ప్రయోగం తప్పదు అంటూ విజయసాయిరెడ్డి రాష్ట్రంలో సంక్షేమానికి అడ్డుపడుతున్నది చంద్రబాబేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఏ2 విజయసాయిరెడ్డి అట్టహాసం: వర్ల ఫైర్

ఏ2 విజయసాయిరెడ్డి అట్టహాసం: వర్ల ఫైర్

ఇక విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వర్ల రామయ్య కౌంటర్ వేశారు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే ఇస్తే ఏ2 విజయసాయిరెడ్డి అట్టహాసం ఆనాటి మయసభలో జూద విజయం తర్వాత శకుని వికటాట్టహాసం లా ఉంది. అంటూ విజయసాయిరెడ్డిని శకునితో పోల్చారు. విర్రవీగకు నేస్తమా.. ముందుంది జంటకు ముసళ్ళ పండుగ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. క్రమం తప్పకుండా కోర్టుకు హాజరు అవ్వండి చాలు.. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు .

విజయసాయి రెడ్డికి హితబోధ చేసిన వర్ల రామయ్య

విజయసాయి రెడ్డికి హితబోధ చేసిన వర్ల రామయ్య

మిడిసి పడడం మంచిది కాదు అంటూ వర్ల రామయ్య విజయసాయి రెడ్డికి హితబోధ చేశారు. విజయసాయి చేసిన వ్యాఖ్యలకు రివర్స్ ఎటాక్ ఇచ్చారు. చంద్రబాబును సైంధవుడు అంటే, విజయసాయిరెడ్డిని శకుని అంటూ తిట్టిపోశారు. ఏపీ స్థానిక ఎన్నికల విషయంలో మొదటి నుండి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధమే జరుగుతుంది . ఇక ఇప్పుడు హైకోర్టు ఎన్నికలపై స్టే ఇవ్వటంతో ఇది వైసీపీ నేతలకు గుడ్ న్యూస్ కాగా ప్రతిపక్ష నాయకులకు షాక్ అనే చెప్పాలి .

English summary
Vijayasai Reddy made harsh remarks that Chandrababu should get out of the illusion. Chandrababu has been compared to Saindhavudu. Varla Ramaiah countered Vijayasaireddy's comments and compared vijayasai reddy Shakuni in mahabharat after the gambling victory in the Mayasabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X