విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కళ్లు మండుతున్నాయా అన్నది నిన్నే బాబూ.. ఆశపడి భంగపడ్డారా : చంద్రబాబుపై విజయసాయి

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి మాటల తూటాలు పేలుస్తున్నారు . తాజాగా ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో వివాదం తలెత్తిన నేపధ్యంలో చంద్రబాబు చాలా ఆసక్తి చూపించారని కానీ మౌని బాబాలా ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేసీఆర్ ఏం మాట్లాడతారో గమనించారని పేర్కొన్నారు . ఇక చంద్రబాబు మీద బోలెడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు .

చంద్రబాబుపై విజయసాయి ఫైర్ ..తుప్పు, పప్పు ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ అవసరమా ?చంద్రబాబుపై విజయసాయి ఫైర్ ..తుప్పు, పప్పు ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ అవసరమా ?

 వ్యక్తి ప్రయోజనాలే కానీ రాష్ట్రం గురించి పట్టదా చంద్రబాబూ?

వ్యక్తి ప్రయోజనాలే కానీ రాష్ట్రం గురించి పట్టదా చంద్రబాబూ?


సగం రాష్ట్రానికి తాగు, సాగు నీరందించే పోతిరెడ్డిపాడు గురించి నోరు మెదపడు చంద్రబాబు అని వ్యాఖ్యానించిన విజయసాయి ఎవరో సస్పెండైన డాక్టరు తాగి రోడ్డుమీద చిందులేస్తే ఒకటే ట్వీట్లు పెడుతున్నాడు అంటూ మండిపడ్డారు .ప్యాకేజీ తీసుకుని పనిచేసే జీతగాళ్లను కూడా ఎగదోస్తున్నాడు అని నిప్పులు చెరిగారు. అంతేకాదు వ్యక్తుల ప్రయోజనాలు తప్ప రాష్ట్రం గురించి పట్టదా చంద్రబాబూ? అని చంద్రబాబుని ప్రశ్నించారు .

 నీకు 71 ఏళ్లు జాగ్రత్త.. కరోనాకు నీ అనుభవం అర్ధం కాదు

నీకు 71 ఏళ్లు జాగ్రత్త.. కరోనాకు నీ అనుభవం అర్ధం కాదు

ఇక కరోనా వైరస్ విషయంలో కూడా విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . కరోనా మనతోటే ఉంటుంది కాబట్టి 65 ఏళ్లు దాటినోళ్లు బయటకు రావద్దని తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా చెప్పారు. జాగ్రత్త బాబూ! నీకు 71 ఏళ్లు అని వైరస్ ఇట్టే పసిగడ్తుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం, ప్రతిపక్ష నేతగా పదకొండేళ్లు లాంటివి కరోనాకు అర్థం కావు అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం చంద్రబాబు అనుకూల మీడియా చాలా ఎదురుచూశారని చివరకు నీరుగారిపోయారని వ్యాఖ్యానించారు .

కేసీఆర్ ప్రెస్ మీట్ నీరు గార్చేసిందా ?

కేసీఆర్ ప్రెస్ మీట్ నీరు గార్చేసిందా ?

ఆ క్షణం కోసం ఎల్లో మీడియా వారం రోజులపాటు ఎదురు చూసింది. ఎడిటోరియల్స్, కాంగ్రెస్ వాళ్లని రెచ్చగొట్టడాలు, టీవీల్లో జలజగడాలంటూ తగాదా పెట్టే చర్చలు అన్నీ నీరు కారిపోయాయి. కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఏదో అంటారని ఆశపడి భంగపడ్డారు. బాబు కూడా లైవ్ చూశాడంట ఏదైనా వినిపిస్తుందేమో అని కానీ అలాంటిదేమీ లేకపోవటంతో పాపం నిరాశలో ఉన్నారట అంటూ సెటైర్లు వేశారు.

Recommended Video

Kishan Reddy Opposes KCR Comments On Central Govt Financial Package
ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ.. ఈ అజ్ఞాత వాసమెక్కడ ?

ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ.. ఈ అజ్ఞాత వాసమెక్కడ ?

ఇక మరో పోస్ట్ లో ‘కళ్లు మండుతున్నాయా' అని అన్నది నిన్నే బాబూ. పొరుగు రాష్ట్రంలో ప్రవాస జీవితం నెరపుతున్నావు. ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ. పక్కింటి వాళ్లు కూడా గుర్తించని అజ్ఞాతవాసం ఎక్కడ. బయట అడుగుపెడితే క్షణాల్లో వీడియోలు సోషల్ మీడియాకెక్కుతున్నాయి. ఎంత కష్టం వచ్చిపడింది అంటూ చంద్రబాబు బయటకు రాలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి .

English summary
Vijayasai Reddy once again criticized Chandrababu. vijayasai reddy stated that chandrababu very curious on KCR pressmeet but unfortunately he siad nothing negative at the press meet. this was disappointed chandrababu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X