విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరోసారి లాక్ డౌన్ లోకి విజయవాడ- ఇవాళ్టి నుంచి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు..

|
Google Oneindia TeluguNews

విజయవాడలో చాలా రోజుల తర్వాత మరోసారి లాక్ డౌన్ విధించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నగరాన్ని కంటైన్ మెంట్ జోన్లుగా విభజించి లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేయబోతున్నారు. ఇందుకోసం ప్రధాన మార్గాలతో పాటు చిన్నా చితకా రోడ్లలోనూ బారికేడ్లు వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నగర వ్యాప్తంగా పెరుగుతున్న కేసులను బట్టి చూస్తే పరిస్ధితి తీవ్రమవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Recommended Video

Telangana-AP border: No vehicle Entry Into Guntur District Between 7pm & 7am

ఇక కరోనా అంతమే!: చిలుకూరు బాలాజీ ఆలయంలో అద్భుతంఇక కరోనా అంతమే!: చిలుకూరు బాలాజీ ఆలయంలో అద్భుతం

విజయవాడలో కరోనా వ్యాప్తి....

విజయవాడలో కరోనా వ్యాప్తి....

విజయవాడలో కొంతకాలంగా కరోనా వ్యాప్తి ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ తాజాగా ఇది బాగా పెరిగింది.. నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం, నిన్న ఒక్క రోజు జిల్లా వ్యాప్తంగా 397 కేసులు నమోదైతే ఇందులో అత్యధిక భాగం విజయవాడలోనే ఉన్నాయి. దీంతో అధికారులతో పాటు సాధారణ ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొంటున్నాయి. వైరస్ కారణంగా గత 24 గంటల్లోనే 8 మంది చనిపోయారు. ముఖ్యంగా నగరంలోని స్లమ్ ఏరియాల్లో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. దీంతో అధికారులు సోమవారం నుంచి కఠిన ఆంక్షలకు సిద్ధమయ్యారు.

 ఇవాళ్టి నుంచి లాక్ డౌన్...

ఇవాళ్టి నుంచి లాక్ డౌన్...

పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని నగరాన్ని మరోసారి లాక్ డౌన్ పరిధిలోకి తెచ్చారు. దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ లాక్ డౌన్ విధించడానికి వీలుగా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆంక్షలు ఉల్లంఘించి ఎవరూ బయట తిరగడానికి వీల్లేదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నగరంలోని మొత్తం 21 క్లస్టర్లలో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఇవాళ్టి నుంచి రాకపోకలను పూర్తిగా నియంత్రిస్తున్నారు.. ఆంక్షలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 ప్రధాన కంటైన్ మెంట్ జోన్లు ఇవే...

ప్రధాన కంటైన్ మెంట్ జోన్లు ఇవే...

నగరంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న దృష్ట్యా పలు ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్ల పరిధిలోకి తెచ్చారు. వీటిలో పటమట, కొత్తపేట, మొగల్రాజపురం, విద్యాధరపురం, అజిత్ సింగ్ నగర్, భవానీపురం, చుట్టుగుంట, సత్యనారాయణపురం, వించిపేట, చిట్టినగర్ ప్రాంతాలు కంటైన్ మెంట్ జో్న్లుగా ప్రకటించి కఠిన ఆంక్షలు అమలు చేయబోతున్నారు. వీటికి వెళ్లే ప్రధాన దారులన్నీ ఇప్పటికే బ్యారికేడ్ల నియంత్రణలోకి వచ్చేశాయి. నగరంలో ఉదయం పూట మాత్రమే షాపింగ్, ఇతర పనులకు జనాన్ని అనుమతిస్తున్నారు.

English summary
vijayawada officials has decided to put lockdown in the city once again after growing coronavirus spread. for this they have devided the city into 21 containment zones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X