విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప‌డ‌గ విప్పుతున్న బెజ‌వాడ క‌క్ష్య‌లు: వైసీపీలో ఉన్నాన‌నే కార‌ణంతో: అదుపులో కీల‌క వ్య‌క్తులు..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి పాల‌నా ద‌క్ష‌త‌కు స‌వాల్‌. బెజ‌వాడలో పాత క‌క్ష్య‌లు ప‌డ‌గ విప్పుతున్నాయి. తాజాగా జ‌రిగిన పారిశ్రామిక వేత్త హ‌త్య పాత సంస్కృతిని గుర్తుకు తెస్తోంది. విజ‌య‌వాడ‌కు చెందిన తేలపోలు రాంప్రసాద్‌ హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హ‌త్య‌కు విజయవాడలోని కామాక్షి స్టీల్‌ ట్రేడర్స్‌తోపాటు పలు సంస్థల్లోని ఆర్థిక లావాదేవీలే కారణమని సమాచారం. సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించారని, దీనివెనక కోగంటి సత్యం హస్తం ఉందని అనుమానిస్తు న్నారు. సుపారీ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి పంజాగుట్ట పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్సు బృందాలు విజయవాడకు బయ ల్దేరాయి. ఇప్పుడు బెజ‌వాడ‌లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి.

 బెజ‌వాడ క‌క్ష్య‌లు..హైద‌రాబాద్‌లో హ‌త్య‌..

బెజ‌వాడ క‌క్ష్య‌లు..హైద‌రాబాద్‌లో హ‌త్య‌..

బెజ‌వాడ‌లో క‌లిసి వ్యాపారం చేసిన స‌మ‌యంలో తలెత్తిన విభేదాలు..కోట్లాది రూపాయ‌ల లావాదేవీలు హ‌త్యకు కార‌ణం అవుతున్నాయి. విజ‌య‌వాడ‌కు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త తేలపోలు రాంప్రసాద్ కామాక్షి స్టీల్‌ ట్రేడర్స్‌తోపాటు పలు సంస్థలు నిర్వ‌హిస్తున్నారు. ఆ సంస్థ‌ల్లో భాగ‌స్వాముల మ‌ధ్య ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని సమాచా రం. సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించారని, దీనివెనక కోగంటి సత్యం హస్తం ఉందని అనుమానిస్తున్నారు. సుపారీ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి పంజాగుట్ట పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్సు బృందాలు విజయవాడకు బయల్దేరాయి. ఆయన విజయవాడతో పాటు పరిగి, ఒంగోలు, తదితర ప్రాంతాల్లో స్టీల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, కోగంటి స‌త్యం మాత్రం త‌న‌కు ఈ హ‌త్య‌తో ఎటువంటి సంబంధం లేద‌ని..తాను ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున ప‌ని చేసాన‌ని..అందుకే త‌న మీదు ఉద్దేశ పూర్వ‌కంగా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని స‌త్యం చెబుతున్నారు.

నాడు భాగ‌స్వాములు..నేడు ప్ర‌త్య‌ర్ధులు..

నాడు భాగ‌స్వాములు..నేడు ప్ర‌త్య‌ర్ధులు..

రాం ప్రసాద్..ఇప్పుడు హ‌త్యారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కోగంటి స‌త్యం 2008లో వ్యాపార భాగ‌స్వామ‌లుగా ఉండేవారు. కోగంటి సత్యం నిర్వహిస్తున్న కామాక్షి స్టీల్‌ ట్రేడర్స్‌లో భాగస్వామిగా చేరారు. 2013లో కామాక్షి స్టీల్‌ ట్రేడర్స్‌లో జరిగిన వ్యాపార లావాదేవీల లెక్కల్లో కోట్లాది రూ పాయలు అవకతవకలు జరిగినట్లు కోగం టి సత్యం అనుమానించారు. ఈ నేపథ్యం లో రాంప్రసాద్‌, సత్యం మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో రాంప్రసాద్‌ సంస్థ నుంచి బయటకొచ్చారు. ఇరువురూ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్నా రు. కిడ్నాప్‌ కేసులో కోగంటి సత్యం 20 రో జులపాటు జైలుకెళ్లి వచ్చారు. దీంతో వారి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో రాంప్రసాద్‌ కుటుంబం 2015 లో హైదరాబాద్‌కు మకాం మార్చింది. రెండేళ్ల క్రితం పరిగిలో అభిరామ్స్‌ స్టీల్స్‌ పేరిట ఫ్యాక్టరీని ఏర్పాటు చేసారు. కోగంటి స‌త్యం కోట్ల రూపాయాలు త‌మ‌కు ఇవ్వాల‌ని రాం ప్రసాద్ కుటుంబ స‌భ్యులు చెబుతుంటే.. కోగంటి స‌త్యం మాత్రం త‌న‌కే రాం ప్ర‌సాద్ బాకీ ఉన్నాంటున్నారు.

కోగంటి నివాసానికి పోలీసులు..

కోగంటి నివాసానికి పోలీసులు..

విజ‌య‌వాడ‌లోని కోగంటి సత్యం ఇంటికి హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీసులు చేరుకున్నారు. ఇదే స‌మ‌యంలో పటమట పోలీసుస్టేషన్‌లో కోగంటి సత్యం అల్లుడు కృష్ణారెడ్డిని పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. కోగంటి స‌త్యం మీడియా సంస్థ‌ల‌తో మాట్లాడుతూ రాం ప్ర‌సాద త‌న బామ్మ‌ర్దితో ఆర్దిక లావాదేవీల్లో గొడ‌వ‌లు ఉన్నాయ‌ని చెప్పారు. ఈ కోణంలోనూ పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా దుండ‌గులు వ‌చ్చిన వాహ‌నాన్ని పోలీసులు గుర్తించారు. ఇక‌, ఇప్పుడు తిరిగి విజ‌య‌వాడ‌లో చోటు చేసుకుంటున్న ప‌రిణామ‌ల పైన ఆదిలోనే పోలీసులు సీరియ‌స్ గా స్పందించ‌క పోతే ఇవి ఎటు వైపు ట‌ర్న్ తీసుకుంటాయో చెప్ప‌లేని ప‌రిస్థితి. దీంతో..ఇప్పుడు ముఖ్య‌మంత్రి ఇక్క‌డి వ్య‌వ‌హారాల పైన ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల‌ని బెజ‌వాడ వాసులు కోరుతున్నారు.

English summary
Vijayawada industrialist murder in Hyderabad. His family members suspecting old partner is behind this Murder. Now panjagutta police went vijayawada and started investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X