విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కనకదుర్గ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ , సీఎం జగన్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్

|
Google Oneindia TeluguNews

ట్రాఫిక్ కష్టాలతో నరకం చూస్తున్న బెజవాడ వాసులుకు ఇక నుండి ట్రాఫిక్ కష్టాల నుండి కొంతమేర ఉపశమనం లభించనుంది. . చాలా కాలంగా ఎదురు చూస్తోన్న కనకదుర్గ ప్లైఓవర్ నేడు ప్రారంభమైంది. ఎట్టకేలకు విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన విజయవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్ ను ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లు ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ఈ ప్రారంభోత్సవం నిర్వహించారు .

Recommended Video

Vijayawada Kanaka Durga Flyover Opened For Traffic బెజవాడ వాసులుకు ట్రాఫిక్ కష్టాల నుండి ఉపశమనం..!!
పలుమార్లు వాయిదా పడిన ఫ్లైఓవర్ ఎట్టకేలకు ప్రారంభం

పలుమార్లు వాయిదా పడిన ఫ్లైఓవర్ ఎట్టకేలకు ప్రారంభం

దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వీకే సింగ్, ఏపీ మంత్రి శంకర్ నారాయణ, ఎంపీలు కేశినేని నాని ,కనకమేడల రవీంద్ర కుమార్, సీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎప్పుడో పూర్తికాగా పలుమార్లు ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టి వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక ఇంతకుముందు కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ రావడంతో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది . ఫైనల్ గా నేడు విజయవాడ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్లైఓవర్ వినియోగానికి వచ్చింది.

నేటి నుండి అధికారికంగా వాహన రాకపోకలు

నేటి నుండి అధికారికంగా వాహన రాకపోకలు


నేటి నుండి ఈ ఫ్లైఓవర్ పై వాహన రాకపోకలు కొనసాగనున్నాయి. దీని ప్రారంభోత్సవంతో విజయవాడలోని ట్రాఫిక్ ఇబ్బందులకు కొంతమేర ఉపశమనం దొరికినట్లయింది.

కనకదుర్గ ఫ్లై ఓవర్ ను ప్రారంభించడంతో పాటు గా సీఎం జగన్ మోహన్ రెడ్డి తో కలిసి 7584 వేల కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు భూమి పూజ నిర్వహించారు. మొత్తం 15,592 కోట్ల రూపాయల పనులకు భూమి పూజలు నిర్వహించారు మంత్రి నితిన్ గడ్కరీ. 9 జాతీయ రహదారులు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇచ్చారు.

ఫ్లై ఓవర్ ను జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ


ప్రస్తుతం 502 కోట్ల రూపాయలతో 6 వరుసలతో 2.6 కిలోమీటర్ల మేర నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభించిన నితిన్ గడ్కరీ, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లైఓవర్ ను జాతికి అంకితం చేశారు . మొత్తం 900 రోజుల్లో ఈ ఫ్లైఓవర్ పూర్తి అయినట్లుగా తెలుస్తుంది. దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని ఊపిరి పీల్చుకుంటున్నారు. నేటి నుంచి అధికారికంగా ఈ ఫ్లై ఓవర్ పై వాహన రాకపోకలు కొనసాగనున్నాయి

కనకదుర్గ ఫ్లైఓవర్ కల సాకారమైందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కనకదుర్గ ఫ్లైఓవర్ కల సాకారమైందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ కల సాకారమైందని , ఇది రాష్ట్ర ప్రగతిని మార్చే ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలు ఈ ఫ్లై ఓవర్ వినియోగంలోకి రావడంతో తొలగుతాయని చెప్పిన ఆయన ఏపీ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇక ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన క్రెడిట్ ఎవరికి వారు వారి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

English summary
Public of Vijayawada in and around region are immensely happy today, as the much awaited kanakadurga flyover is open for the public. central minister nitin gadkarialong with AP CM Jagan inaugurated the flyover in virtual method .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X