విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వర్ణ ప్యాలెస్ యజమాని శ్రీనివాసరావు కూడా పరారీ- విజయవాడ పోలీసుల ప్రకటన..

|
Google Oneindia TeluguNews

పది మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసు దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఈ ఘటనకు బాధ్యుడైన రమేష్ ఆస్పత్రి యజమాని రమేష్ బాబు పరారీలో ఉన్నట్లు ప్రకటించిన పోలీసులు.. ఇప్పుడు స్వర్ణప్యాలెస్ హోటల్ యజమాని శ్రీనివాసరావు కూడా పరారీలో ఉన్నట్లు గుర్తించారు.శ్రీనివాసరావు కోసం 8 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు ఏసీపీ సూర్యచంద్రరావు ప్రకటించారు.

అటు రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యంపైనా దర్యాప్తు ఊపందుకుంది. ఛైర్మన్ డాక్టర్ రమేష్ బాబు కోసం గాలిస్తున్న పోలీసులు.. కుటుంబసభ్యులపైనా నిఘా పెట్టారు. వారి కాల్‌ లిస్ట్ ఆధారంగా రమేష్‌ బాబు కోసం వేట సాగిస్తున్నారు. కరోనా రోగులకు సిటీ స్కాన్ చేసి కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పి వారి నుంచి రమేష్ ఆస్పత్రి దోపిడీ సాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఫీజులపైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు ప్రకటించారు.

vijayawada police announced swarna palace owner srinivasa rao also in absconding

Recommended Video

AP CM YS Jagan Launches YSR Cheyutha Scheme || Oneindia Telugu

మరోవైపు అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం నియమించిన రెండు వేర్వేరు విచారణ కమిటీల నివేదికలు రేపటిలోగా ప్రభుత్వానికి అందే అవకాశముంది. వీటి ఆధారంగా రమేష్ ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను సీజ్‌ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

English summary
vijayawada police announced that swarna palace hotel owner srinivasa rao, who is one of the accused in fire accident case is also in absonding along with ramesh hospital owner ramesh babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X