విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్లేస్కూల్ అడ్డాగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్... రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు...

|
Google Oneindia TeluguNews

ఐపీఎల్... కొంతమందికి వినోదమైతే... మరికొందరికి కాసులు కురిపించే బెట్టింగ్ దందా... ఐపీఎల్ 2020 సీజన్ మొదలవడంతో ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా బెట్టింగ్ దందాలు బయటపడుతున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్ స్మార్ట్ ఫోన్లు,డిజిటల్ యాప్స్ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో పల్లెలకు కూడా పాకింది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలాచోట్ల బెట్టింగ్ దందాలు నడుస్తున్నాయి. తాజాగా విజయవాడలో ఓ హైటెక్ బెట్టింగ్ రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని బెట్టింగ్ లింకులపై ఆరా తీస్తున్నారు.

అవతార్ యాప్‌తో...

అవతార్ యాప్‌తో...

డీసీపీ హర్షవర్దన్ రాజు తెలిపిన వివరాల ప్రకారం... మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొఘల్‌రాజపురంలోని ఓ ప్లేస్కూల్‌ అడ్డాగా ముగ్గురు యువకులు ఆన్‌లైన్ బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో ప్లేస్కూల్ మూసివేయడంతో... దాన్నే అడ్డాగా చేసుకున్నారు. 'అవతార్' అనే మొబైల్ యాప్‌ను ఉపయోగించి ప్రతీ రోజూ భారీ ఎత్తున బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు.

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

బెట్టింగ్‌ దందాపై పక్కా సమాచారంతో ఆ ప్లే స్కూల్‌పై పోలీసులు దాడి చేసి ముగ్గురు యువకులను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అట్లూరి రంజిత్ కుమార్(33),విజయవాడకు చెందిన దివి శ్రీనాథ్(39),పెద్దు నాగ వెంకటేశ్(39) ఉన్నారు. మరో ఇద్దరి సహాయంతో ఈ ముగ్గురు కలిసి ప్లేస్కూల్‌ను అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీరి వద్ద నుంచి 25 సెల్ ఫోన్లు,ఒక ల్యాప్‌ టాప్,ఒక టీవీ,రెండు హెడ్‌సెట్ స్పీకర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా వెనక నవీన్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నట్లు గుర్తించారు.

గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు

గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు


విచారణలో ముగ్గురు నిందితులు నేరం అంగీకరించారు. ఢిల్లీ నుంచి మల్టిపుల్ కాల్ రిసీవర్ బోర్డును కొనుగోలు చేసి బెట్టింగ్స్‌కి వాడుతున్నట్లు చెప్పారు. వీరిపై ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దందా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా... ఇతర రాష్ట్రాల వ్యక్తులను కూడ బెట్టింగ్‌లో ఇన్వాల్వ్ చేస్తున్నారా అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. యువత ఇలాంటి బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని... అనవసరంగా కేసుల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

English summary
Vijayawada police busted hi-tech cricket betting racket on Sunday by arresting three persons. They also seized one multiple call receiver board, 25 mobile phones, one laptop, a television set and two headset speakers from their possession. The accused were identified as Atluri Sri Ranjith Kumar (33) of West Godavari district and Divi Srinath (39) and Peddu Naga Venkatesh (38) of Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X