విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీస్ అధికారి అర్ధనగ్న ప్రదర్శన.. విజయవాడలో అలజడి..!

|
Google Oneindia TeluguNews

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఓ పోలీస్ అధికారి అర్ధనగ్న ప్రదర్శనకు దిగడం కలకలం రేపింది. ఉన్నతాధికారుల తీరుతో మనస్థాపం చెందిన సదరు అధికారి సోమవారం రాత్రి నిరసనకు దిగారు. దాంతో విజయవాడలో అలజడి చెలరేగింది. విధి నిర్వహణలో తాను సక్రమంగా డ్యూటీ చేస్తే ఉన్నతాధికారులు టార్గెట్ చేయడం జీర్ణించుకోలేక పోయినట్లు తెలుస్తోంది.

విజయవాడ దుర్గ గుడి ఘాట్ రోడ్డులోని టోల్ గేట్ దగ్గర విధి నిర్వహణలో ఉన్న సదరు పోలీస్ అధికారి మంత్రి అనుచరులను అడ్డుకోవడం రచ్చగా మారింది. ఉత్సవ కమిటీకి చెందిన కార్లలో ఓ మంత్రి అనుచరులు ఆలయానికి వస్తున్న క్రమంలో ఆయన అడ్డుకున్నారు. సోమవారం రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే మమ్మల్నే అడ్డుకుంటావా అని ఆ పోలీస్ అధికారిపై సదరు మంత్రి అనుచరులు చెలరేగి పోయినట్లు తెలుస్తోంది.

vijayawada police officer protest against higher officials

హుజుర్‌నగర్‌లో కారుకు బ్రేకులే.. ప్రభుత్వం గూబ గుయ్యి మనాలే.. కాంగ్రెస్ నేతల మూకుమ్మడి దాడిహుజుర్‌నగర్‌లో కారుకు బ్రేకులే.. ప్రభుత్వం గూబ గుయ్యి మనాలే.. కాంగ్రెస్ నేతల మూకుమ్మడి దాడి

ఆ క్రమంలో వారు ఏకంగా మంత్రికి ఫోన్ చేసి అక్కడ జరిగిన విషయం వివరించారు. డ్యూటీలో ఉండి తమను అడ్డుకున్న పోలీస్ అధికారి వివరాలు మంత్రికి చెప్పడంతో ఆయన కాస్తా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దాంతో పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు డ్యూటీలో ఉన్న ఆ అధికారికి ఫోన్ చేసి మందలించినట్లు సమాచారం.

డ్యూటీలో భాగంగా తాను వారిని అడ్డుకున్నానే తప్ప ఎలాంటి దురుద్దేశం లేదని సదరు పోలీస్ అధికారి ఉన్నతాధికారులకు వివరించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎక్కువగా మాట్లాడితే సస్పెండ్ చేస్తామంటూ ఉన్నతాధికారులు తనపై మండిపడ్డారని ఆ పోలీస్ అధికారి వాపోతున్నారు. పై అధికారుల తీరుతో మనస్థాపం చెంది నిరసనకు దిగారు. చొక్కా విప్పి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అదలావుంటే ఉన్నతాధికారులు ఈ విషయాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎలాంటి ఆందోళన చేపట్టలేదని.. ఫిట్స్ కారణంగా ఆయన కింద పడిపోతే హాస్పిటల్‌కు తీసుకెళ్లామని చెబుతున్నారట.

English summary
Vijayawada Police Officer Protest Against Higher Officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X