విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడవాసుల చిరకాల కల: రేపట్నుంచే: ప్రారంభం వాయిదా పడ్డా: వాహనాలకు ఓకే

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఇంకొన్ని గంటలే. విజయవాడవాసుల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. వారి కల ఫలించబోతోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెర పడబోతోంది. కనకదుర్గ ఫ్లైఓవర్ శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఉదయం నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. దుర్గగుడి వంతెన ప్రారంభ కార్యక్రమం వాయిదా పడినప్పటికీ.. వాహనాలదారుల కోసం అందుబాటులోకి తీసుకుని రానున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని వెల్లడించారు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశారు.

సాఫ్ట్ పోర్న్‌స్టార్: ఊర్మిళా మతోండ్కర్‌పై కంగనా ఫైర్: తల కోసుకుంటా గానీ: సన్నీలియోన్‌నూసాఫ్ట్ పోర్న్‌స్టార్: ఊర్మిళా మతోండ్కర్‌పై కంగనా ఫైర్: తల కోసుకుంటా గానీ: సన్నీలియోన్‌నూ

నిజానికి- కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది. దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. నితిన్ గడ్కరీ.. కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ సోకడంతో ఐసొలేషన్‌లోకి వెళ్లారు. ఫలితంగా- కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభ కార్యక్రమం మళ్లీ వాయిదా పడుతుందని భావించారు.

Vijayawada: Vehicles to be allowed on Kanaka Durga flyover from tomorrow

వాహనదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్దేశిత షెడ్యూల్‌ నాటికి ఈ ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తీసుకుని రావాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా శుక్రవారం ఉదయం నుంచీ దీనిపై వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. ప్రారంభోత్సవంతో సంబంధం లేకుండా వాహనాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కేశినేని నాని తెలిపారు. నితిన్ గడ్కరీ కరోనా నుంచి కోలుకున్న అనంతరం రాష్ట్రంలో ప్రతిపాదించిన జాతీయ రహదారుల నిర్మాణ పనులు, నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న రహదారులను ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు.

కనకదుర్గ ఫ్లైఓవర్ కాస్తా రాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన రాయి పడింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన మరుసటి ఏడాదే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2015 డిసెంబర్ 6వ తేదీన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయన అధికారంలో ఉన్న నాలుగేళ్ల కాలంలో ఈ వంతెన నిర్మాణం పూర్తి కాలేకపోయింది.

Recommended Video

Krishna River : ప్రకాశం బ్యారేజీకి 4 లక్షల క్యూసెక్కుల వరద, అప్రమత్తంగా ఉండాలని CM Jagan ఆదేశాలు !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు పార్టీలూ ఫ్లైఓవర్ ఘనతను తమ ఖాతాలోకి వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ సైతం పోటీ పడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ మంజూరు చేసిన నిధులతోనే ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేశారని చెబుతోంది. కేంద్రం నిధులు ఇవ్వకుంటే ఎలా పూర్తి చేసేవారనీ ప్రశ్నిస్తున్నారు.

English summary
The Kanaka Durga flyover in Vijayawada will be available to city dwellers from tomorrow with vehicle will be allowed on the flyover from Friday. Vijayawada MP Kesineni Nani announced this through Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X