విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరిగి విజయవాడ-విశాఖ విమాన సర్వీసులు- ఆగస్టు 1 నుంచి మొదలు

|
Google Oneindia TeluguNews

విజయవాడ-విశాఖపట్నం మధ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది ఈ రెండు నగరాల మధ్య విమాన సర్వీసులపై ప్రభావం పడింది. విమాన ప్రయాణాలతో వైరస్ వ్యాప్తి చెందకుండా విమాన సర్వీసులు నిలిపేశారు. వీటిని తిరిగి ఆగస్టు 1 నుంచి పునఃప్రారంభించబోతున్నారు.

కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి విశాఖపట్నం-విజయవాడ మధ్య తిరిగి విమాన సర్వీసులు ప్రారంభించాలని ఇండిగో సంస్ధ నిర్ణయించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి విజయవాడ-విశాఖ మధ్య 74 సీట్ల సామర్ధ్యం గల ఏటీఆర్ విమానం ప్రారంభం కానుంది. దీంతో ఇదే బాటలో మిగతా విమానయాన సంస్ధలు కూడా పయనించే అవకాశముంది.
కరోనాకు ముందు ఇరు నగరాల మధ్య రెగ్యులర్ విమానాలు నడిచేవి. కానీ కరోనా వ్యాప్తితో వాటికి బ్రేక్ పడింది.

vijayawada-vizag flight services will resume on august 1

ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఇండిగో విమానం ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో మధాహ్నం 3.40 గంటలకు విజయవాడలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం వస్తుంది. తిరిగి ఇక్కడి నుంచి సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరి రాత్రి 6.25 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని విమాన సర్వీసులు నడిపేందుకు ఎయిర్ లైన్స్ సంస్ధలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూనే ప్రయాణాలు సాగించాల్సి ఉంటుంది.

English summary
vijayawada-vizag flight servics will be resumed from august 1 and regular flights will travel in alternative days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X