విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్‌కు సాయిరెడ్డి హ్యాట్సాఫ్: మాలోకం ..మాతృభాషలో: దేవాన్ష్ కోసం ఇలా..!

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ విజృంభిస్తున్న వేళ దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ప్రజాప్రతినిధులు కొందరు మాత్రం బయటకు అడుగు పెట్టి తమతమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మరికొందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి వారిలో ఏపీ ప్రతిపక్షనేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్‌లు ఉన్నారు. వారిద్దరూ హైదరాబాదులోని తమ ఇంటికే పరిమితమయ్యారు. దీనిపై అధికార వైసీపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు లాంటి ప్రతిపక్ష నేత ఈ విపత్కర సమయంలో ఇంట్లో ఉండి సలహాలు ఇవ్వడమేంటంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ సారి విజయసాయిరెడ్డి టార్గెట్ లోకేష్ అయ్యారు. ఇంతకీ విజయసాయిరెడ్డి ఎందుకు లోకేష్‌ను టార్గెట్ చేశారు..?

 లోకేష్ పై విజయసాయిరెడ్డి సెటైర్

లోకేష్ పై విజయసాయిరెడ్డి సెటైర్

కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అసలు వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు బయటకు రాకూడదని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. కానీ కొందరు మాత్రం ఆదేశాలను లెక్కచేయడం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కరోనా చుట్టూ రాజకీయాలు పెనేసుకుపోతున్నాయి. నిన్న విజయసాయిరెడ్డి నిబంధనలు ఉల్లంఘించి రక్తదానం చేయడంపై టీడీపీ విమర్శలు గుప్పించింది. మరి ఇందుకు బదులు తీర్చుకున్నట్లు కనిపించారు విజయసాయిరెడ్డి. ట్విటర్ వేదికగా మరోసారి లోకేష్‌పై విరుచుకుపడ్డారు విజయ సాయిరెడ్డి.

స్కేటింగ్ చేసిన దేవాన్ష్.. సైకిల్‌పై లోకేష్

లాక్‌డౌన్ అమలులో ఉండగా ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు మనవడు దేవాన్ష్ రోడ్డుపై స్కేటింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఇక దేవాన్ష్ వెనకాలే తన తండ్రి లోకేష్ సైకిల్‌ తొక్కుతూ కనిపించాడు. అంతేకాదు స్కేటింగ్ చేస్తున్న దేవాన్ష్‌కు లోకేష్ కొన్ని సూచనలు చేస్తున్నట్లు వీడియోలో వినిపిస్తోంది. అయితే ఇంత వరకు సీన్ బాగానే ఉంది. అయితే విజయసాయిరెడ్డి ఎందుకు లోకేష్‌ పై విరుచుకుపడ్డారో తెలుసా..? అక్కడికే వస్తున్నాం.

మాలోకం.. మాతృభాష అంటూ సాయిరెడ్డి సెటైర్

మాలోకం.. మాతృభాష అంటూ సాయిరెడ్డి సెటైర్


లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఉండాల్సిన లోకేష్ దేవాన్ష్‌లు ఇలా రోడ్డుపై స్కేటింగ్ చేస్తూ సైకిల్ తొక్కుతూ కనిపించారు. ఇక లోకేష్ దేవాన్ష్‌కు స్కేటింగ్‌పై సూచనలు చేస్తున్నారు. అయితే అవి ఇంగ్లీష్‌లో దేవాన్ష్‌కు చెబుతుండటం విజయసాయిరెడ్డి అటెన్షన్‌ను పట్టుకుంది. ఇక ఇక్కడే చెడింది. ఇప్పటికే ఏపీలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అనే అంశంపై వివాదం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కూడా షాక్ ఇచ్చింది. ఇంగ్లీష్ మీడియం తప్పని సరి అనే అంశాన్ని టీడీపీ ముందునుంచి వ్యతిరేకిస్తోంది. ఇలాంటి సమయంలో లోకేష్ తన కొడుకు దేవాన్ష్‌తో ఇంగ్లీష్ మాట్లాడుతుండటాన్ని విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో ప్రస్తావించారు. స్టేట్ బోర్డుపై ఎలా వెళ్లాలో కొడుకు దేవాన్ష్‌కు లోకేష్ మాతృభాషలో చెబుతున్నారంటూ సెటైరికల్ ట్వీట్ పోస్టు చేశారు.

మొత్తానికి విజయసాయిరెడ్డి రక్తదానం కార్యక్రమంపై టీడీపీ విరుచుకుపడిన కొన్ని గంటల్లోనే లోకేష్ విజయసాయికి చిక్కాడని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

Recommended Video

Fake News Buster : 08 80 మంది రేడియో జాకీల జాబ్స్ తీసేసిన FM గోల్డ్ ?

English summary
Vijaysai Reddy had tweeted a video that of former minister Lokseh who was riding a cycle amid the lockdown. Lokesh along with his son Devansh were seen outside in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X