విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడ వాసులను కలవరపెడుతున్న వాలంటీర్.. సర్వేకు వెళ్లి...

|
Google Oneindia TeluguNews

విజయవాడలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తొలి దశలో ఓ పానీపూరీ బండి, ఆ తర్వాత ఓ టిఫిన్ బండి, ఇప్పుడు వార్డు వాలంటీర్... ఇలా వైరస్ వాహకాలుగా మారిపోతున్న వారి వ్యవహారం అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కరోనా వైరస్ సర్వేలో పాల్గొన్న ఓ వాలంటీర్ కు తాజాగా కరోనా సోకినట్లు గుర్తించిన అధికారులు ఆమెను క్వారంటైన్ కు తరలించారు.

విజయవాడలో వాలంటీర్ కు కరోనా..

విజయవాడలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వం తాజాగా మూడు విడతల్లో సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఓ వాలంటీర్ కు కరోనా సోకినట్లు తేలడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన ఈ వాలంటీర్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి ఇళ్లలో సర్వే నిర్వహిస్తున్న సందర్భంలో ఓ కరోనా పాజిటివ్ పేషెంట్ నుంచి ఆమెకు సోకిందని భావిస్తున్నారు. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు.

ward volunteer become coronavirus patient in vijayawada after covid 19 survey

కరోనా సోకిన తర్వాత పింఛన్ల పంపిణీ..

Recommended Video

Watch Exclusive YSRCP MLA Undavalli Sridevi Violating Lockdown Rules

సర్వేలో పాల్గొన్నప్పుడు కరోనా వైరస్ సోకిన వార్డు వాలంటీర్ అది వెంటనే బయటపడకపోవడంతో అనంతరం నిర్వహించిన పింఛన్ల పంపిణీలోనూ పాల్గొంది. ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేసింది. ఆ తర్వాత ఆమెకు కరోనా లక్షణాలు బయటపడటంతో ఆస్పత్రిలో చేరింది. దీంతో ఇప్పుడు ఆమె సర్వే నిర్వహించిన ప్రాంతంతో పాటు పింఛన్లు పంపిణీ చేసిన ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు కలిగిన వారు ఎవరైనా ఉంటే ముందే చెప్పాలని కోరుతున్నారు.

English summary
a ward volunteer gets coronavirus in vijayawada city after particpating covid 19 survey in the state recently. she got virus from a covid 19 patient earlier. after that she participated in distribution of pensions at door step also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X