మురళి రాంగ్రూట్లో వెళ్లాడట, పిలిచి మాట్లాడమే తప్ప బెదిరించలేదు, ఎస్సై నారాయణమ్మ...
విద్యార్థి మురళిని వేధింపులకు గురిచేయలేదని ఎస్సై నారాయణమ్మ పేర్కొన్నారు. నారాయణమ్మ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మురళి వాట్సాప్ మేసేజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మురళి ఆత్మహత్యతో తనకేం సంబంధం లేదని ఎస్సై తెలిపారు.

రాంగ్ రూట్లో వెళ్లాడట..
మురళి రాంగ్రూట్లో ఓవర్ స్పీడ్‌తో బైక్ నడపడంతోనే స్టేషన్‌కు పిలిచినట్టు నారాయణమ్మ తెలిపారు. పిలిచి మాట్లాడితేనే ఎస్సై అయితే తనకేంటి అన్నట్టు ప్రవర్తించాడని తెలిపారు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేశానే తప్ప వేధించలేదని చెప్పారు.

పరిచయం.. కానీ
మురళి తనకు ఇదివరకు పరిచయం అని నారాయణమ్మ తెలిపారు. స్టేషన్ పిలిచి మాట్లాడిన మాట వాస్తవమే కానీ.. బెదిరించలేదని స్పష్టంచేశారు. తన భర్త కూడా వార్నింగ్ ఇవ్వలేదని చెప్పారు. అయితే ఎస్సై నారాయణమ్మ తన చావుకు కారణమని మురళి పేర్కొన్నాడు. వేధింపులు తాళలేక గన్నవరంలోని కోనాయిచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఎస్సై వివరణ ఇచ్చారు.

చదువుకుంటూనే..
గన్నవరంలో మురళి అనే విద్యార్థి డిగ్రీ ఫైనల్ ఈయర్ చదువుతున్నాడు. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో.. టీ స్టాల్ పెట్టుకొని జీవిస్తున్నాడు. ఉదయం క్లాసులకు హాజరై.. రాత్రి పూట చిన్న హోటల్ నడుపుతున్నాడు. ఇల్లు గడవడంలో తల్లికి చేదోడు వాదోడుగా నిలిచాడు. కానీ సోమవారం విగతజీవై కనిపించాడు.

మురళి వాదన ఇదీ..
మురళి హోటల్ పెట్టిన ప్రాంతంపై వివాదం ఉంది. అయితే ఇటీవల గన్నవరం ఎస్సై నారాయణమ్మ భర్త, మరో టూ వీలర్ ఢీ కొట్టాయి. ప్రమాదంలో ఎస్సై భర్త గాయపడ్డారు. యాక్సిడెంట్‌కు కారణం అక్కడ మురళి హోటల్ ఉండటమేనని అనుకొన్నారు. టీ స్టాల్ లేకుంటే ప్రమాదం జరగదని భావించారు. ఇంకేముంది మురళిని స్టేషన్‌కు పిలిచి వేధించడం మొదలుపెట్టారు.

వేధింపులు
రోజు స్టేషన్‌కు పిలువడంతో మురళి ఇబ్బందికి గురయ్యాడు. తాను చేయని తప్పుకు వేధిస్తున్నారని బాధపడ్డాడు. తాను చదువుకుంటూ, టీ స్టాల్ నడుపుతుంటే హరాస్మెంట్ ఏంటీ అనుకొన్నాడు. ఇక ఈ జీవితం చాలు అని.. చావే పరిష్కారం అనుకొన్నాడు. సోమవారం గన్నవరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన ఆత్మహత్యకు గన్నవరం ఎస్సై నారాయణమ్మ కారణం అని వాయిస్ మేసేజ్ కూడా చేశాడు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!