విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది..? అమిత్ షాతో భేటీ తర్వాత జగన్ మూడ్ ఎందుకు మారింది..? కారణం అదేనా...?

|
Google Oneindia TeluguNews

Recommended Video

YS Jagan Mohan Reddy Disappointed About Delhi Tour, To Meet Amit Shah || Oneindia Telugu

ఢిల్లీ/హైదరాబాద్ : ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పట్ల రకరకాల ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కేంద్ర మంత్రులు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డికి సమయం కేటాయించలేదని, అందుకోసమే జగన్ ఒక రోజంతా ఢిల్లీలో సమయం వృధా చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. ప్రధానంగా విద్యుత్ ఒప్పందాల్లో నెలకొన్న ప్రతిష్టంభన గురించి కేంద్ర మంత్రులకు సవివరణ ఇవ్వాలనుకున్న ఎపి సీఎం కు కేంద్రమంత్రులు అంతగా సహకరించలేదని తెలుస్తోంది. దీంతో ఒక రోజు ఆలస్యంగా అమీత్ షాతో భేటీ ఐన జగన్ ఆయనకు పుట్టిన రోజు శభాకాంక్షలు చెప్పి వెనుదిరిగినట్టు తెలుస్తోంది.

జగన్ ఢిల్లీ టూర్ అయోమయం..! అంత సాఫీగా సాగని పర్యటన..!!

జగన్ ఢిల్లీ టూర్ అయోమయం..! అంత సాఫీగా సాగని పర్యటన..!!

ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన వెనుక అనేక అంశాలు ముడిపడి ఉనట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణిస్తున్న తరుణంలో పథకాల అమలుకు కేంద్రం ఆర్థిక సాయం కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పేరుతో పీఎం పేరు కూడా పెట్టిన విషయాన్ని కేంద్రంలోని బీజేపీ పెద్దలకు చెప్పి వారిని సంతృప్తి పరచాలని కూడా జగన్ వేసుకున్న ప్రణాళికగా తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా కేంద్ర పెద్దల దృష్టికి తేవాలన్నది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. అయితే జగన్ కార్యక్రమాలను మొత్తం కేంద్ర మంత్రులు నీళ్లపాలు చేసినట్టు వైసీపి శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..! జగన్ మూడ్ పాడైంది అందుకేనా..?

అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..! జగన్ మూడ్ పాడైంది అందుకేనా..?

జగన్ అనుకున్నదొకటి, జరిగింది ఒకటి, అనే చర్చ జరుగుతోంది. ఎన్నో ఆశలతో ఢిల్లీకి వెళ్లిన జగన్, ఇలా వెళ్లిన వెంటనే అలా అమిత్ షా కరుణిస్తాడనుకున్నారు. కానీ అమిత్ షా ఏపి సీఎంను తీవ్రంగా నిరుత్సాహపరిచారు. ఒక సీఎం, ఓ కేంద్ర హోంమంత్రి అపాయింట్ మెంట్ కోసం ఇలా వెయిట్ చేయించడం అరుదై విషయంగా చెప్పుకుంటున్నారు. అనేక కారణాల వల్ల జగన్ కి మొదటిరోజు అపాయింట్మెంట్ దొరకలేదు. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో బేటీలు పెట్టుకుని జగన్ ఢిల్లీకెళితే, ఏదీ సఫలం కాలేదు.

విజ్ఞప్తులను పెద్దగా పట్టించుకోని అమీత్ షా..! అరగంటలో ముగిసిన భేటీ..!!

విజ్ఞప్తులను పెద్దగా పట్టించుకోని అమీత్ షా..! అరగంటలో ముగిసిన భేటీ..!!

అమిత్ షాతో జగన్ సమావేశం మంగళవారానికి వాయిదాపడింది జగన్ కి అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయడం ఇది మూడోసారి కావడం విశేషం. జగన్ కి అమిత్ సా హ్యాండ్ ఇవ్వడంతో ఏపీలో జగన్ షెడ్యూల్ అంతా క్యాన్సిల్ అయ్యింది. ఎట్టకేలకు మంగళవారం అమీత్ షాను కలిసిన జగన్ వెంటనే మిగతా కార్యక్రమాలు రద్దు చేసుకుని నేరుగా వైజాగ్ వెళ్లిపోయారు. జగన్ మూడ్ ఇంతగా చెడిపోవడానికి కారణాలు ఏంటనే అంశంపై ఆరా తీస్తున్నారు విశ్లేషకులు. ప్రధానంగా ఆయన అమిత్ షాను కలవడానికి కొన్ని రోజులుగా విశ్వప్రయత్నం చేస్తున్నారు జగన్. హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో వీరి భేటీ చాలా ఆలస్యం ఐనట్టు తెలుస్తోంది.

కేసుల ప్రస్థావన..! పట్టించుకోని అమీత్ షా.. !!

కేసుల ప్రస్థావన..! పట్టించుకోని అమీత్ షా.. !!

అంతే కాకుండా మెగా కృష్ణారెడ్డి ఆస్తులపై ఈడీ దాడుల నేపథ్యంలో ఆ విషయం కూడా అమిత్ షాతో చర్చించాలని జగన్ భావించినా అమీత్ షా అంత సమయం ఇవ్వలేదని తెలుస్తోంది. కృష్ణారెడ్డిని ఈడీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుందని భావిస్తున్న నేపథ్యంలో జగన్ దీనిపై కేంద్ర పెద్దలతో మాట్లడతారనే చర్చ కూడా జరిగింది. మరోవైపు తనపై ఉన్న సీబీఐ కేసులు కూడా తలనొప్పిగా మారుతున్న తరుణంలో వాటి నుంచి ఉపశమనం కోసం అమీత్ షాతో ప్రస్థావన తేనున్నట్టు తెలిసింది. అందుకు కూడా అమీత్ షా ససేమిరా అనడంతో జగన్ నొచ్చుకున్నట్టు సమాచారం.

English summary
AP CM Jagan Mohan Reddy is coming to the screen of various speculations about the Delhi tour. According to the pre-planned schedule, none of the Union ministers have allotted time to Jaganmohan Reddy, and it is a debate that Jagan has wasted time in Delhi for a day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X