విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ ఫోటో ఉన్నప్పుడు వైయస్ ది ఎందుకు ఉండకూడదు..? విజయవాడ కార్పోరేషన్లో ఫోటోల పంచాయతీ..!

|
Google Oneindia TeluguNews

విజయవాడ/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వ శాఖల్లో ఫోటో పంచాయతీలు మొదలయ్యాయి. ఎన్టీర్ ఫోటో, వైస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోల మద్య తీవ్ర వాగ్వాదం జరుగుతోందది. బెజవాడ కార్పోరేషన్ లో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోల రగడ తారా స్థాయికి చేరింది. తనని అడగకుండా సీయం జగన్ ఫోటో ను హాల్లో పెట్టడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే ఎన్టీఆర్ ఫోటోను, చంద్రబాబు ఫోటో ను తొలగించి జగన్ ఫోటో పెట్టిన కార్పోరేషన్ అధికారుల మేయర్ కొరగా ఝుళిపించినంత పని చేసారు. చంద్రబాబు ఫోటో తీసినా ప్లేదు, కాని ఎన్టీఆర్ ఫోటో ఎందుకు తీశారని ఆగ్రహం వ్యక్తం చేసారు మేయర్. ఎన్టీఆర్ ఫోటోతో పాటు దివంగత రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టాలని వైసీపీ కార్పోరేటర్ల డిమాండ్ చేసారు. రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టడానికి వీల్లేదన్న మేయర్ శ్రీధర్ పట్టుబట్టారు. చనిపోయిన సీయం ల ఫోటోలు కౌన్సిల్ హాల్లో పెట్టడం సాంప్రదాయమంటున్న వైసీపీ సభ్యుల వాదనను ఆయన తోసిపుచ్చారు.

Why not the YS pic when there is a NTR photo? Photo despute in Vijayawada Corporation..!

ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి ఇద్దరి దివంగత సీయంలే కాబట్టి పెడితే ఇద్దరివి పెట్టాలని మేయర్ పోడియం వద్ద ఆంధోళన చేస్తున్న వైసీపీ కార్పోరేటర్లను నిలువరించే ప్రయత్నం చేసారు. కార్పోరేషన్ నాది.. నేను చెప్పిందే చేయాలంటూ అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఆదిపత్య పోరు జరగడం విచిత్రంగా ఉందని కార్పోరేటర్లు ఆవేదన తెలుపుతున్నారు. అదీ గాక అదికారంలో ఉన్న ముఖ్యమంత్రి చిత్ర పటాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండడం సర్వ సాదారణమని, కాని ఇక్కడ మేయర్ పెత్తనం ఏంటో తమకు అర్థం కావడం లేదని కార్పోరేట్లు వాపోతున్నారు. మేయర్ వ్యవహార శైలికి నిరసనగా వారు కార్పోరేష్ పోడియం వద్ద భైఠాయించారు. కార్పోరేషన్ హాల్లో పెడితే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల ఫోలో పెట్టాలని, లేకపోతే ఇద్దరి ఫోటోలను తొలగించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నట్టు వారు చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్ చి్రపటం కాదని దివంగత వైయస్ చిత్రపటం పెట్టాలని డిమాండ్ చేయడం లేదని కార్పోరేటర్లు అంటున్నారు.

English summary
Photo despute have started in AP government departments. There is a heated argument between NTR photo and ys Rajasekhar Reddy photos. The Bejawada Corporation has become into news about photos of former chief ministers. The mayor expressed his anger over removal the photo of the Cm without asking him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X