విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మండలి రద్దు రోజాకు కలిసొస్తుందా ? ఈసారైనా మంత్రి పదవి వరిస్తుందా? ఏపీలో హాట్ టాపిక్

|
Google Oneindia TeluguNews

వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజాకు మంత్రి మండలి రద్దు కలిసి రానుందా ? రోజాకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందా? వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న రోజాకు ఈ సారి సీఎం జగన్ మంత్రిగా స్థానం కల్పిస్తారా ? అన్నది ఏపీలో ప్రధానంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ .

Recommended Video

Abolish of AP Legislative Council : Roja Sensational Comments Over Council Cancellation || Oneindia

ఆ విషయంలో రోజాకు జగన్ వార్నింగ్: ఫైర్ బ్రాండ్ రోజాతో పాటు నేతలంతా సైలెంట్!! ఆ విషయంలో రోజాకు జగన్ వార్నింగ్: ఫైర్ బ్రాండ్ రోజాతో పాటు నేతలంతా సైలెంట్!!

శాసనమండలి రద్దుతో ఇద్దరు మంత్రులు రాజీనామా చేసే ఛాన్స్

శాసనమండలి రద్దుతో ఇద్దరు మంత్రులు రాజీనామా చేసే ఛాన్స్

శాసన మండలి రద్దుతో రోజా రొట్టె విరిగి నేతిలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజాకుమంత్రి పదవి వస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలో శాసన మండలి రద్దు చేసిన వైసీపీ సర్కార్ కేబినెట్ మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజీనామా చేయించే యోచనలో ఉంది. ఇక వారు కూడా రాజీనామాలకు సిద్ధం అని ప్రకటించారు. మండలి రద్దుకు ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇద్దరు మంత్రులు నైతికంగా కొనసాగటం సరికాదనే భావన వైసీపీ అధినేత జగన్ కు ఉన్నట్టు తెలుస్తుంది.

రాజీనామా చేస్తే క్యాబినెట్ లో రెండు ఖాళీలు.. రోజాకు మంత్రిగా అవకాశం ?

రాజీనామా చేస్తే క్యాబినెట్ లో రెండు ఖాళీలు.. రోజాకు మంత్రిగా అవకాశం ?

త్వరలోనే ఈ ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం . ఆ ఇద్దరు మంత్రులు గనుక రాజీనామాలు చేస్తే కేబినెట్‌లో రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతాయి. ఇదే రోజాపై చర్చకు కారణం . గతంలో ఈ పదవులు ఆశించి భంగ పడ్డవారికి మంత్రి పదవులను ఇచ్చే ఆలోచనలో జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశం ఎక్కువగానే ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం .

అధికార పార్టీ నేతగా ప్రతిపక్షంపై విరుచుకుపడుతున్న రోజా

అధికార పార్టీ నేతగా ప్రతిపక్షంపై విరుచుకుపడుతున్న రోజా

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపధ్యంలో టీడీపీ విమర్శలకు ప్రతి విమర్శలు చేసే సమర్ధులైన నాయకులు కావాలి. రోజా అధికార పార్టీ నేతగా ఆ పాత్ర చాలా స్ట్రాంగ్ గా పోషిస్తారు. అంతే కాక
నిజానికి ఆమె తొలిసారి మంత్రివర్గంలో స్థానం ఆశించినా సీఎం జగన్ సామాజిక వర్గాల సమీకరణాల నేపధ్యంలో కల్పించలేకపోయారు. అనంతరం రోజాకు ఏపీఐఐసీ పదవిని ఇచ్చినా ఆమె పదవితో ఆమె సంతృప్తి చెందలేదు అనేది పార్టీ వర్గాల్లో జరిగిన చర్చ .

తొలిసారి మంత్రిగా మిస్ అయిన రోజా .. ఈ సారి రోజాకు మంత్రి పదవి ?

తొలిసారి మంత్రిగా మిస్ అయిన రోజా .. ఈ సారి రోజాకు మంత్రి పదవి ?

అయినప్పటికీ రోజా సీఎం జగన్‌పై ఉన్న నమ్మకంతో పార్టీ కోసం పని చేశారు. బలమైన వాయిస్ వినిపించారు. ఎప్పుడూ తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న అసహనం ప్రదర్శించకుండా జగన్ ఆదేశాల మేరకు నడుచుకున్నారు. ఇక ఈ నేపధ్యంలో ఇప్పుడు రోజాకు మంత్రిగా అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం . ఏది ఏమైనా రోజా మంత్రి కావాలనే కల ఈసారైనా తీరుతుందా ? లేకా అది కలగానే మిగులుతుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

English summary
Will the Cabinet berth confirmed to MLA Nagari MLA APIIC chairman Roja? Legislative council abolish decision benifits roja..? Does Roja have a chance to be a minister? Roja, who has been waiting for a ministerial post since the YCP came to power, will Jagan appoint roja as minister this time? That is the debate in AP, mainly in political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X