విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోము రాకతో పవన్ కు కష్టాలేనా ? కీలక అంశాలపై తలోదారి- భవిష్యత్తులో జరిగేది ఇదే..

|
Google Oneindia TeluguNews

కేంద్రంలో సుస్ధిర ప్రభుత్వాన్ని నడుపుతున్నా దక్షిణాదిలో మాత్రం ఓ దశ, దిశ లేకుండా పోతున్న బీజేపీని గాడిన పెట్టేందుకు అధిష్టానం తాజాగా పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్న పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, టీవీ చర్చలకు దూరంగా ఉంచడం, సస్పెన్షన్లు చేయడం వంటి చర్యలు చేపట్టిన హైకమాండ్.. తాజాగా సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమించడం ద్వారా మరో కీలక అడుగు వేసింది. అయితే సోము వీర్రాజు రాకతో బీజేపీలో పరిస్ధితులు రాత్రికి రాత్రే మారిపోకపోయినా పార్టీలో ఇప్పటికే తిష్ట వేసిన టీడీపీ అనుకూల వర్గాన్ని మాత్రం నియంత్రించే అవకాశం దక్కబోతోంది. అదే సమయంలో టీడీపీ పాట పాడే మిత్రుడు పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ ఈసారి ఎలా వ్యవహరించబోతోందన్నది ఆసక్తి రేపుతోంది.

జనసేన కోసం పీకే టీమ్ ? పార్టీ భవిష్యత్తు, పవన్ పై సర్వే- త్వరలో భవిష్యత్ ప్రణాళిక..జనసేన కోసం పీకే టీమ్ ? పార్టీ భవిష్యత్తు, పవన్ పై సర్వే- త్వరలో భవిష్యత్ ప్రణాళిక..

సోము ఎంట్రీతో టీడీపీ వర్గానికి చుక్కలు..

సోము ఎంట్రీతో టీడీపీ వర్గానికి చుక్కలు..

సహజంగానే టీడీపీ పేరు చెబితే మండిపడే సీనియర్ నేత సోమువీర్రాజును బీజేపీ అధిష్టానం ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా నియమించడంతో ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న టీడీపీ నేతలకు అప్పుడే చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీని ఇన్నాళ్లూ ఏపీలో ఎదగనీయకుండా తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్న సదరు నేతలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. చివరి నిమిషం వరకూ సోమును అధ్యక్షుడు కానీయకుండా అడ్డుపడిన వీరంతా ఇప్పుడు సోము ఎంట్రీతో సైలెంట్ అయిపోతున్నారు. ఇన్నాళ్లూ బీజేపీలో ఉంటూ టీడీపీ పాట పాడిన వీరంతా ఇప్పుడు సోము వీర్రాజు నియామకాన్ని కనీసం స్వాగతించలేని పరిస్ధితుల్లో ఉన్నారు.

మిత్రుడు పవన్ కూ ఝలక్...

మిత్రుడు పవన్ కూ ఝలక్...

ఇప్పటివరకూ బీజేపీతో కలిసి ఉన్నాడన్న పేరే కానీ ఎక్కడా పార్టీ సీనియర్ నేతలతో కలిసి కనీసం ఒక్కసారి కూడా నిరసనలు చేపట్టని పవన్ కళ్యాణ్.. సోము వీర్రాజు రాకతో ఇకపైనా అదే వైఖరి కొనసాగిస్తే కష్టమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. కీలక అంశాలపై మిత్రపక్షంగా కలిసి వస్తే రావడం లేకపోతే తన దారి తాను చూసుకోవడం అనే రెండు ఆప్షన్ లను సోము వీర్రాజు పవన్ కు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సహజంగానే ముక్కుసూటిగా మాట్లాడతారని పేరున్న సోము వీర్రాజు.. ఈసారి ఎలాగైనా పార్టీని క్షేత్రస్ధాయి నుంచి బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ కోవర్టులను పార్టీ నుంచి సాగనంపేందుకు సైతం ఆయన సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ జెండా మోస్తారనే ఆరోపణలు ఎదుర్కొన్న పవన్ తో దోస్తీ విషయంలోనూ సోము నిక్కచ్చిగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది.

కీలక అంశాల్లో పవన్ తో విభేదాలు...

కీలక అంశాల్లో పవన్ తో విభేదాలు...


ఏపీలో గతేడాది వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత పలు అంశాలపై పవన్ స్పందిస్తున్నారు. కానీ వీటిలో చాలా మటుకు సోము వీర్రాజు అభిప్రాయాలకు దూరంగా ఉన్నాయని తెలుస్తోంది. ఉదాహరణకు పవన్ ఎక్కువగా మాట్లాడే ఇంగ్లీష్ మీడియం, రాజధాని అమరావతి వంటి విషయాలపై సోము వీర్రాజు గతంలో ఎన్నోసార్లు విభేదించారు. ఇంగ్లీష్ మీడియాన్నే తీసుకుంటే తల్లితండ్రులు సమర్ధిస్తున్నప్పుడు మనమెందుకు వ్యతిరేకించాలనే ధోరణి సోముది. కానీ పవన్ అలా కాదు. ఇంగ్లీష్ మీడియంతో మతానికి లింకు పెట్టి మాట్లాడారు. రాజధాని అమరావతి విషయంలో పవన్ టీడీపీని వదిలిపెట్టి వైసీపీని టార్గెట్ చేస్తుంటారు. కానీ సోము మాత్రం రాజధాని అభివృద్దికి కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇచ్చిన నిధులను అప్పట్లో టీడీపీ దుర్వినియోగం చేసిన విషయాన్ని హైలెట్ చేస్తుంటారు. ఇలా ఎన్నో విషయాల్లో పవన్, సో్ము వీర్రాజు ఇద్దరివీ వేర్వేరు అభిప్రాయాలు.

Recommended Video

APSRTC To Run Limited Services అవసరం లేని రూట్లలో APSRTC సర్వీసులు నిలిపివేత!! || Oneindia Telugu
 వ్యక్తిగతంగానూ సోము, పవన్ తలోరకం...

వ్యక్తిగతంగానూ సోము, పవన్ తలోరకం...

వ్యక్తిగతంగా చూసినా సోము వీర్రాజు ముక్కుసూటి మనిషి. గతంలో కేంద్రం నుంచి లబ్ది పొంది ఎన్డీయే సర్కారుపై ధర్మపోరాటం చేసిన చంద్రబాబును సోమువీర్రాజు ఏకిపారేసేవారు. కానీ పవన్ అలా కాదు తనకు మాట్లాడాలని అనిపించినప్పుడు మాత్రమే సమస్యలపై స్పందిస్తారు. ఏ విషయాన్నీ త్వరగా తేల్చరు. దాదాపు అన్ని కీలక విషయాల్లోనూ అస్పష్ట ధోరణే కనిపిస్తుంటుంది. దీంతో పవన్ కు రాష్ట్రంలో సమస్యలపై స్పష్టం లేదని సగటు ఓటరు సైతం భావించే పరిస్ధితి. ఇద్దరూ కాపు సామాజిక వర్గ నేతలే అయినా సోము మాత్రం ఆరెస్సెస్ మూలాలు కలిగిన నేత. పవన్ మాత్రం అవసరానికి తగ్గట్టుగా సంఘ్ భావజాలాన్ని సమర్ధిస్తుంటారు, వ్యతిరేకిస్తుంటారు.

English summary
after senior leader somu veerraju's appointment as ap bjp state president everyone think about relations between bjp and janasena will sustain or not ? in key issues like english medium and others they had been differed each other earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X