విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టార్గెట్ టీడీపీ ... వంశీ ఎఫెక్ట్ ... 23 నెంబర్ పై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

|
Google Oneindia TeluguNews

ఏపీలో టీడీపీ టార్గెట్ అవుతోంది. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రాజీనామాతో మరోమారు సోషల్ మీడియా వేదికగా టీడీపీ పై విమర్శలు వెల్లువగా మారాయి. 23 నెంబర్ పై సెటైర్లు పేలుతున్నాయి. అసలే ఎమ్మెల్యేగానూ, టీడీపీ సభ్యుడిగానూ కృష్ణా జిల్లా రాజకీయాల్లో మంచి పట్టు ఉన్న నేత రాజీనామా చెయ్యటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న టీడీపీని సోషల్ మీడియా మరింత ఇబ్బంది పెడుతుంది.

వల్లభనేని వంశీ వర్సెస్ యార్లగడ్డ ... వంశీ నిర్ణయం ఏంటో? జగన్ ఏం చేస్తారో !! వల్లభనేని వంశీ వర్సెస్ యార్లగడ్డ ... వంశీ నిర్ణయం ఏంటో? జగన్ ఏం చేస్తారో !!

 టీడీపీ పై సోషల్ మీడియాలో నెంబర్ గేమ్ ...

టీడీపీ పై సోషల్ మీడియాలో నెంబర్ గేమ్ ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ కొనసాగుతూనే ఉంది . ఇక వల్లభనేని వంశీ రాజీనామాతో మరోమారు సోషల్ మీడియాపై చర్చ జరుగుతుంది. అసలే గత ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా 23 మంది ఎమ్మెల్యేలతో బయటపడిన తెలుగు దేశం పార్టీకి అప్పటినుండి ఇప్పటివరకు ఇబ్బందులు తప్పడం లేదు. టీడీపీకి అధికార వైసీపీని ఎదుర్కోవటం పెద్ద కష్టంగా మారింది. ఇక సోషల్ మీడియాని సైతం తట్టుకోలేని పరిస్థితి.

ఎన్నికల తర్వాత నుండి 23 నెంబర్ పై ఏపీలో చర్చ

ఎన్నికల తర్వాత నుండి 23 నెంబర్ పై ఏపీలో చర్చ

ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై దారుణమైన విమర్శలు చేశారు అటు వైసిపి నాయకులు, నెటిజన్లు. 2014 ఎన్నికల తర్వాత 23 మంది వైసిపి ఎమ్మెల్యేలను టిడిపిలోకి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించినందుకు చంద్రబాబుకి అలాంటి ఫలితం 2019 ఎన్నికల్లో వచ్చిందని అప్పుడే సెటైర్లు పేలాయి. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వచ్చాయి. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం చంద్రబాబు 23మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కున్న దానికి దేవుడా స్క్రిప్ట్ రాశాడని, అందుకే 23 స్థానాలే దక్కాయని విమర్శలు గుప్పించారు. అప్పట్లో టిడిపి నుండి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల విషయం ఏపీ లో హాట్ టాపిక్.

 హుజూర్ నగర్ టీడీపీ ఓట్లపై కూడా 23 నెంబర్ తో సెటైర్ వేసిన పీవీపీ

హుజూర్ నగర్ టీడీపీ ఓట్లపై కూడా 23 నెంబర్ తో సెటైర్ వేసిన పీవీపీ

ఇక తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజీనామాతో మరోమారు 23 మంది ఎమ్మెల్యేల అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల పీవీపీ సైతం 23 నెంబర్ పై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం లో హుజుర్ నగర్ ఉప ఎన్నికలో టీడీపీ కి పోలైన అన్ని ఓట్లను కలపగా 23 సంఖ్య వచ్చిందని పీవీపీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. చంద్రబాబు 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే సీట్లు కూడా 23 .ఇక దీనిపై పీవీపీ భగవంతుణ్ణి భక్తుణ్ణి అనుసంధానం చేసేది అంబికా దర్బార్ బత్తి, టీడీపీ కి, ఓటమిని అనుసంధానం చేసేది 23 అని సెటైర్లు పేల్చారు.

వంశీ ఎఫెక్ట్ .. హమ్మయ్య 23 కాస్త 22 అయింది అంటూ సెటైర్లు

వంశీ ఎఫెక్ట్ .. హమ్మయ్య 23 కాస్త 22 అయింది అంటూ సెటైర్లు

గత సార్వత్రిక ఎన్నికలు ముగిసి 6 నెలలు కావస్తున్నా టీడీపీకి మాత్రం 23 బాధ తప్పటం లేదు. ఇప్పుడు వల్లభనేని వంశీ రాజీనామాతో మరోమారు 23 నెంబర్ పై ట్రోల్స్ మొదలయ్యాయి.
తాజాగా వల్లభనేని వంశీ రాజీనామా తో 23 కాస్త 22 అయింది అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. టిడిపికి ఇకనుండి 23 బాధ తప్పింది అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కమ్మ రాజ్యం లో కడపరెడ్లు చిత్రం లో చంద్రబాబు, నారా లోకేష్ పాత్రలను పోషించిన వారి ఫోటోని పోస్ట్ చేసి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.

వైసీపీ నేతలకు సరదాగా మారిన 23 సంఖ్యపై ట్రోల్స్

వైసీపీ నేతలకు సరదాగా మారిన 23 సంఖ్యపై ట్రోల్స్


హమ్మయ్య 23 బాధ తప్పింది అంటూ వైసిపి నేతలు సైతం సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. ఏదేమైనా వంశీ రాజీనామా టీడీపీకి కోలుకోలేని దెబ్బ కాగా సోషల్ మీడియాలో 23 నెంబర్ పై చేస్తున్న వ్యాఖ్యలు, టిడిపి పై వేస్తున్న సెటైర్లు టిడిపి నేతలకు ఇబ్బందికరంగా మారాయి. వైసీపీ నేతలకు మాత్రం సరదాగా ఉన్నాయని చెప్పొచ్చు. వంశీ రాజీనామా ఎఫెక్ట్ తో మరోమారు 23 నెంబర్ పై జరుగుతున్న చర్చ, సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సెటైర్లు చంద్రబాబుకి సైతం తలనొప్పిగా మారాయి.

English summary
With the resignation of Gannavaram MLA Vallabhaneni Vamsi Mohan trolls started again in social media platform on 23 number. The resignation of the key leader of the Krishna district shocking TDP and social media even more troubling TDP with the number 23 trolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X