• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రోజా ప్రసంగంలో స్లిప్.. అవాక్కయ్యారు : టీడీపీ.. ప్రజారాజ్యంలో అలా..జగన్ ఇలా..!!

|
  చంద్రబాబు ను ముఖ్యమంత్రి గా సంబోధించిన రోజా || Roja Metioned Chandrababu As C M In Her Speech

  వైసీపీ ఫైర్ బ్రాండ్ తన స్పీచ్ లో పొరపాటు పడ్డారు. తన వాగ్దాటితో చంద్రబాబు పైన విరుచుకపడే రోజా ఆడవారిని ముఖ్యమంత్రి అవమానిస్తాడంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రోజా చేసిన వ్యాఖ్యలు విన్న వారు కొద్ది సేపు సభలో అవాక్కయ్యారు. చంద్రబాబును విమర్శించే సమయంలో ఇంకా ముఖ్యమంత్రిగానే వ్యాఖ్యానించారు. దీంతో..ముఖ్యమంత్రి అంటూ ఇలాంటి విమర్శలు చేస్తున్నారేంటని అందరూ ఆశ్చర్య పోయారు. ఆ వెంటనే సరిదిద్దుకున్నారు. జగన్ పైన ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో వాసిరెడ్డి పద్మ ప్రజారాజ్యంలో ఉన్న సమయంలో..తాను టీడీపీలో కేవలం ఇతర పార్టీల పైన విమర్శలు చేయటానికి మాత్రమే వినియోగించుకొనే వారంటూ చెప్పుకొచ్చారు. మాజీ స్పీకర్ కోడెల పైనా సెటైర్లు వేసారు. అసెంబ్లీ దేవాలమం అని చెబుతూ..ఫర్నీచర్ ను ప్రసాదంగా భావించి తీసుకెళ్లిపోయారంటూ వ్యాఖ్యానించారు.

  ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ

  ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ

  వైసీపీ ఎమ్మెల్యే..ఏపీఐఐసీ చైర్మన్ రోజా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు...మాజీ స్పీకర్ కోడెల మీద ఫైర్ అయ్యారు. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రోజా గతంలో జరిగిన ఘటనలను ప్రస్తావించారు. ఆ సమయంలో రోజా తనకు అసెంబ్లీలో జరిగిన అవమానాలను గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో చంద్రబాబును ముఖ్యమంత్రి అంటూ సంబోధించారు.
  గత ప్రభుత్వ హయాంలో ఆడవారి మాన ప్రాణాలకు విలువ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు. విద్యార్ధినుల నుండి ఎమ్మెల్యేల వరకు ఐఏయస్ ల వరకు అందరినీ వేధించారంటూ ఫైర్ అయ్యారు. గతంలో లాగా కాకుండా..ఇప్పటి మహిళా కమిషన్ మహిళలకు భరోసా కల్పించాలని సూచించారు. రిశితేశ్వరి ఆత్మహత్య గురించి ప్రస్తావించారు. కాల్ మనీ వ్యవహారంలో మహిళలను వ్యభిచారం లోకి దించి వేధింపులకు గురి చేసారంటూ ఆవేదన వ్యక్తం చేసారు. అదే సమయంలో అసెంబ్లీలో తనను సస్పెండ్ చేసిన విషయాన్ని రోజా గుర్తు చేసుకున్నారు. కాల్ మనీ వ్యవహారం పైన తాను మాట్లాడితే నిజాలు బయటకు వస్తాయని తనను నిబంధనలకు వ్యతిరేకంగా ఏడాది పాటు సస్పెండ్ చేసారని వివరించారు.

  మాజీ స్పీకర్ కోడెల మీద సెటైర్లు...

  మాజీ స్పీకర్ కోడెల మీద సెటైర్లు...

  మాజీ స్పీకర్ కోడెల మీద రోజా సెటైర్లు వేసారు. అసెంబ్లీలో మహిళా సమస్యల మీద గళం ఎత్తితే తనను ఏడాది పాటు సస్పెండ్ చేసారన్నారు. ఆయన అసెంబ్లీని దేవాలయంలాగా భావించానని చెప్పటాన్ని గుర్తు చేసారు. అందులో ఉన్న ఫర్నీచర్ ను ప్రసాదం అనుకొని తీసుకెళ్లిపోయారంటూ సెటైర్ వేసారు. ఆయన హయాంలో నిర్వహించిన మహిళా పార్లమెంట్ లో తమను కీర్తించేవారికే అవకాశం ఇచ్చారని.. మహిళా అసెంబ్లీ సభ్యులకు అవకాశం ఇవ్వకుండా అరెస్ట్ చేయించారని గుర్తు చేసారు. కారు షెడ్డులో ఉండాలి..మహిళలు ఇంట్లో ఉండాలి అంటూ చేసిన వ్యాఖ్యలను సైతం రోజా ప్రస్తావించారు. చంద్రబాబు సైతం మహిళా పుట్టుకనే అవమానించేలా వ్యాఖ్యలు చేసారని గుర్తు చేసారు. జగన్ మాత్రం తన కోసం నిలబడిన వారికి గుర్తింపు ఇచ్చారన్నారు. తాను టీడీపీలో..వాసిరెడ్డి పద్మ ప్రజారాజ్యంలో ఇతర పార్టీలను విమర్శించటానికే పరిమితమయ్యామని..జగన్ హయాంలో గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చారు. గిరిజన మహిళకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారని.. ఎన్నికల ముందు పుష్పశ్రీవాణి పైన హత్యా యత్నం జరిగిందని గుర్తు చేసారు. కోట్లాది రూపాయలు ఆఫర్ చేసినా..జగన్ అన్న కోసం నిలబడ్డారని ప్రశంసించారు. వారికి జగన్ సరైన గుర్తింపు ఇచ్చారని రోజా వివరించారు.

  స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు..

  స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు..

  ఇక, స్పీకర్ తమ్మినేని సీతారం ఎవరి పేరు ప్రస్తావించకుండానే అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారం పైన స్పందించారు. అసెంబ్లీ ఫర్నీచర్ పైన ఫిర్యాదులు వచ్చాయని..విచారణ సాగుతోందని చెప్పారు. విచారణ పూర్తయిన తరువాత వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేసారు. ఇక, సభలో స్పీకర్ మాట్లాడుతూ మహిళలకు జగన్ ప్రభుత్వంలో మంచి అవకాశాలు దక్కుతున్నాయని చెప్పుకొచ్చారు. ఎవరూ ఇప్పుడు ఉన్న స్థానాల్లో శాశ్వతం కాదని..ఎప్పుడైన మహిళలకు అవకాశం రావచ్చని పేర్కొన్నారు.

  English summary
  YCP MLA Roja metioned Chandrababu as Chief Minister in her speech. Roja fire on Chandra Babu and ex speaker Kodela. Roja remembered her suspension issue in Assembly.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X