• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చిక్కుల్లో వైసిపి : బీజేపీతో రహస్య సంబంధాలు :టైమ్స్‌ నౌ స్టింగ్‌ ఆపరేషన్‌...!

|
  YCP Leader Kothari Comments On YCP-BJP Relation | Oneindia Telugu

  ఎన్నిక‌ల వేళ వైసిపి చిక్కుల్లో ప‌డింది. ఇప్ప‌టికే బిజెపి తో వైసిపి స‌త్సంబంధాలు కొన‌సాగిస్తుంద‌ని అధికార పార్టీ ఆరో ప‌ణ‌లు గుప్పిస్తున్న వేళ‌..దీనికి మ‌ద్ద‌తుగా అన్న‌ట్లు మరో అంశం వెలుగు లోకి వ‌చ్చింది. ఓ జాతీయ ఛాన‌ల్ నిర్వ‌హిం చిన స్టింగ్ ఆప‌రేష‌న్ లో వైసిపి అధికార ప్ర‌తినిధి మ‌నోజ్ కొఠారీ అంగీక‌రించారు.ఇప్పుడు ఈ అంశం దుమారం రేపు తోంది. దీనిని అధికార పార్టీ అస్త్రంగా మ‌ల‌చుకుంటోంది.

  జ‌న‌సేన అభ్య‌ర్దుల జాబితా విడుద‌ల‌: 4 లోక్‌స‌భ‌..32 అసెంబ్లీ స్థానాల‌కు ..!

  బిజెపితో ఒప్పందం ఉంది..

  బిజెపితో ఒప్పందం ఉంది..

  వైసిపి- బిజెపి మ‌ధ్య ఇరు పార్టీల మధ్య అధికారిక పొత్తు లేనప్పటికీ... పోటీ విషయంలో రహస్య అవగాహన ఉందని

  వైసిపి అధికార ప్ర‌తినిధి అంగీక‌రించారు. టైమ్స్ నౌ నిర్వ‌హించిన స్టింగ్ ఆప‌రేష‌న్ లో ఆయ‌న ఈ విష‌యాన్ని అంగీక రించ‌టం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలాంటి వారు పోటీచేసే చోట సాదాసీదా, బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలపాలన్నది తమ పార్టీ విధానమని మనోజ్‌ వెల్లడించారు. పొత్తులే నంత మాత్రాన అవగాహన లేదని కాదు.. మేం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికాం కదా.. బీజేపీ నిర్ణయాలకు మద్దతు పలుకుతాం. మా మధ్య అవగాహన ఉంది. మావైపు నుంచి విజయసాయి రెడ్డి తన పని పర్‌ఫెక్ట్‌గా చేస్తున్నారు అంటూ కొఠారి చెప్పుకొచ్చారు.

  విజ‌య‌సాయిరెడ్డి కీల‌కంగా మారారు..

  విజ‌య‌సాయిరెడ్డి కీల‌కంగా మారారు..

  బుగ్గన కూడా ఢిల్లీలో రామ్‌మాధవ్‌ను కలిశారు కదా అని చాన‌ల్ ప్ర‌తినిధి ప్ర‌శ్నించ‌గా.. బుగ్గన మంచి విద్యావంతుడు. ఆయన నాన్సెన్స్‌ మాట్లాడరు. బుగ్గన కంటే విజయసాయి రెడ్డి చాలా పర్‌ఫెక్ట్‌గా పని చేస్తున్నారు. ఇక‌, విజ‌య సాయి రెడ్డి గురించి వివ‌రించారు. జగన్‌కు ఏమేమి, ఎలా జరగాలో అవన్నీ జరిగేలా విజయ సాయిరెడ్డి చూస్తున్నారు. చంద్ర బాబు చాలా తెలివైన నాయకుడు. జగన్‌ మరో 50 ఏళ్లు ముఖ్యమంత్రి కాకుండా చేస్తారు. దానికోసం ఏమైనా చేస్తారు. విజ‌య సాయి రెడ్డి కేంద్రానికీ, జగన్‌కూ మధ్య మంచి సంబంధాలు ఉండేలా విజయసాయి రెడ్డి చూస్తున్నారు అని చెప్పుకొచ్చారు. విజెపి పోటీ గురించి వివ‌రిస్తూ.. నిజం చెప్పాలంటే పార్టీ స్టాండ్‌ కూడా ఇదే.. బీజేపీ కొన్ని సీట్లు గెలవాల నుకుంటోంది. అక్కడ మా పార్టీ బలహీన అభ్యర్థులను నిలబెడుతుందని వివ‌రించారు. ఒక్కసారి జగన్‌ సీఎం అయితే చంద్రబాబు ఇక మళ్లీ జన్మలో ముఖ్యమంత్రి కాలేరు అంటూ విశ్లేషించారు.

  ఎవ‌రీ మ‌నోజ్ కొఠారి..

  ఎవ‌రీ మ‌నోజ్ కొఠారి..

  టైమ్స్‌ నౌ' చానల్‌ స్టింగ్‌ ఆపరేషన్‌తో జాతీయ స్థాయిలో వార్తల్లోకి వచ్చిన మనోజ్‌ కొఠారీ విజయవాడ నగర వైసీపీ అధికార ప్రతినిధి. వన్‌టౌన్‌లో హోల్‌సేల్‌ ప్లాస్టిక్‌ వ్యాపారం చేస్తుంటారు. ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిన పేరు... మనోజ్‌ కొఠారీ. మొదటి నుంచీ వైఎస్ కు వీరాభిమాని. వైఎస్‌ మరణం తర్వాత వైసీపీలో క్రియాశీలకంగా పని చేస్తు న్నారు. పార్టీ కోసం, ప్రచారం కోసం భారీగా ఖర్చు పెడుతుంటారు.విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావుకు అనుచరుడిగా ఉన్నారు. ఇప్పుడు ఈ విష‌యం అధికార పార్టీకి అస్త్రంగా మార‌గా..వైసిపి మాత్రం దీని పై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. దీని పై ఎటువంటి స్పంద‌న‌లు వ్య‌క్తం అవుతాయో చూడాలి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YCP leader Kothari comments on YCP-BJP relation now creatin political heat in AP. In Times now sting operation YCP leader Manoj Kothari said politial relation is there between BJP and YCP. AS per agreement YCP supporting BJP in key segments with seak candidates.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more