విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

year ender 2020 : ఈ ఏడాది టీడీపీకి, అచ్చెన్నాయుడికి మచ్చగా ఏపీ ఈఎస్ఐ స్కాం

|
Google Oneindia TeluguNews

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్న ఈఎస్‌ఐ కుంభకోణం ఈ ఏడాది ఏపీలో అతిపెద్ద స్కాంగా నిలిచింది. ఈ స్కాంలో ప్రస్తుత టీడీపీ రాష్ట అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు నిర్దారణ కావడంతో ఏసీబీ చురుగ్గా దర్యాప్తు నిర్వహిస్తోంది. అనుతుల్లేని కంపెనీల నుంచి భారీగా ఈఎస్‌ఐ కోసం మందులు, ఇతర పరికరాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఈఎస్‌ఐ డైరెక్టర్లు, ఇతర అధికారులతో పాటు టీడీపీ నేత అచ్చెన్నాయుడు, మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణపైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో టీడీపీలో కూడా ఈ స్కాం ఓ కుదుపుకు కారణమైంది.

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ? పార్టీలో సీరియస్‌ చర్చ .. మారిన పరిస్ధితులే కారణం..ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ? పార్టీలో సీరియస్‌ చర్చ .. మారిన పరిస్ధితులే కారణం..

ఏపీ ఈఎస్‌ఈ కుంభకోణం..

ఏపీ ఈఎస్‌ఈ కుంభకోణం..

ఏపీలో ఈ ఏడాది బయటపడిన ఈఎస్‌ఐ స్కాం విపక్ష టీడీపీని ఓ రేంజ్‌లో ఇరుకునపెట్టింది. ముఖ్యంగా ఈఎస్‌ఐ కార్పోరేషన్‌లో ఉద్యోగుల సంక్షేమం కోసం కొనుగోలు చేసే మందులు, ఇతర పరికరాల్లో చోటు చేసుకున్న అక్రమాలు కార్పోరేషన్‌ ప్రతిష్టను సైతం మసకబారేలా చేశాయి. అనుమతుల్లేని కంపెనీల నుంచి భారీ ఎత్తున మందుల కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి రూ.150 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఏసీబీ అంచనా వేసింది. దీంతో ఈ స్కాం జరిగన సమయంలో కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడును ఇందులో ప్రధాన సూత్రధారిగా అభియోగాలు మోపింది. ఈ స్కాం బయటపడ్డాక ఆయన చాలా కాలం పాటు రిమాండ్‌లో గడిపారు. అనంతరం హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

అచ్చెన్నాయుడు సిఫార్సుతోనే...

అచ్చెన్నాయుడు సిఫార్సుతోనే...

టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ అనే సంస్ధకు మందుల సరఫరా కాంట్రాక్టు ఇవ్వాలని సిఫార్సు చేస్తూ అప్పట్లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు పంపిన లేఖ ఈ స్కాంలో ఆయన పాత్రకు ప్రదాన ఆధారంగా నిలిచింది. అచ్చెన్నాయుడు సిఫార్సుతోనే తాము మందులు, ఇతర వైద్య పరికరాలు సదరు సంస్ధల నుంచి కొనుగోలు చేసినట్లు ఈ స్కాంలో ఇతర నిందితులైన ఈఎస్‌ఐ డైరెక్టర్లు తెలిపారు. దీంతో ఈ మొత్తం స్కాంకు సూత్రధారి అచ్చెన్నాయుడే అని ఏసీబీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆయనపై ఛార్జిషీట్‌ కూడా దాఖలైంది. పలుమార్లు కస్టడీలోకి తీసుకున ప్రశ్నించారు కూడా. మరిన్ని వివరాలు అందాక ఈ స్కాంపై తుది ఛార్జిషీట్‌ దాఖలు కానుంది.

టీడీపీకి మచ్చగా మారిన వైనం...

టీడీపీకి మచ్చగా మారిన వైనం...

గతంలో టీడీపీ హయాంలో జరిగిన ఈ స్కాం బయటికి రావడంతో టీడీపీ నేతల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈఎస్‌ఈ స్కాంలో అచ్చెన్నాయుడు పాత్ర లేదని, అయినా ఆయన్ను ఇరికించారని చంద్రబాబు సహా ఇతర టీడీపీ నేతలు కూడా వెనకేసుకొచ్చారు. అయినా కోర్టుల్లో మాత్రం ఏసీబీ సమర్పించిన ఆధారాలతో ఈ స్కాంలో అచ్చెన్నాయుడు ఇరుక్కున్నట్లే తెలుస్తోంది. దీంతో టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఈ స్కాం ఆ పార్టీపై ఓ మచ్చగా నిలిచింది. అద సమయంలో అచ్చెన్నాయుడి కెరీర్‌పైనా ఈఎస్‌ఐ స్కాం ఓ మచ్చగా మారిపోయింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఆయన్ను టార్గెట్‌ చేసిందని భావిస్తున్న టీడీపీ.. ఆయనకు ఏపీలో పార్టీ పగ్గాలు అప్పగించింది.

English summary
ap esi scam would become a stain on oppostion tdp's image this year in andhra pradesh. tdp state president atchannidu's role in rs.951 cr worth esi scam is crucial as acb alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X