విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీ మోసాలు బయటపెడతా .. ధైర్యముంటే సమాధానం చెప్పండి అని లోకేష్, చంద్రబాబులకు మంత్రి సవాల్

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు ఏపీలో సీఎం మొదలుకొని ప్రతి ఒక్కరి లక్ష్యం చంద్రబాబు, లోకేష్.. గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి. ఎవరికి వారు టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబుపై, ఆయన కుమారుడు మాజీ మంత్రి లోకేష్ పై విరుచుకుపడుతున్నారు . మీ అవినీతి పుట్ట పగులుతుంది అని మీ బండారం బయట పెడతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీలోని వ్యవసాయ శాఖామంత్రి కన్న బాబు లోకేష్ పై, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ధైర్యం ఉంటె తాము అడిగే ప్రశ్నలకు లోకేష్, చంద్రబాబులు సమాధానం చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు.

రేసుగుర్రంలో విలన్.. పార్లమెంట్ లో పాట పాడి ఒప్పిస్తాడా ... భోజ్ పురిలో దుమ్ము లేపిన ఎంపీ రవి కిషన్ రేసుగుర్రంలో విలన్.. పార్లమెంట్ లో పాట పాడి ఒప్పిస్తాడా ... భోజ్ పురిలో దుమ్ము లేపిన ఎంపీ రవి కిషన్

రాష్ట్రంలో విత్తనాల సంక్షోభానికి చందరబాబు, లోకేష్ లే కారణం అని ఫైర్ అయిన మంత్రి కన్న బాబు

రాష్ట్రంలో విత్తనాల సంక్షోభానికి చందరబాబు, లోకేష్ లే కారణం అని ఫైర్ అయిన మంత్రి కన్న బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్తనాల సంక్షోభానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. గత చంద్రబాబు సర్కార్ నిర్వాకం నేడు రైతులను నిండా ముంచేసిందని ఆరోపించారు. జనవరి నుంచి విత్తనాల సేకరణకు నిధులు అడిగినా ఇవ్వలేదని, చంద్రబాబుకు 28 సార్లు అధికారులు లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక వ్యవసాయ శాఖాధికారులు రాసిన లేఖలను టీడీపీ ఆఫీసుకు పంపిస్తానని సమాధానం చెప్పండని ఆయన నిలదీశారు .

రైతులను కష్టాలలోకి నెత్తిన ఘనత లోకేష్, చంద్ర బాబులదే .. వ్యవసాయ శాఖలోనూ అంతా అవినీతే అన్న మంత్రి

రైతులను కష్టాలలోకి నెత్తిన ఘనత లోకేష్, చంద్ర బాబులదే .. వ్యవసాయ శాఖలోనూ అంతా అవినీతే అన్న మంత్రి

ఇక అంతే కాదునిధులు ఇవ్వకపోవడంతో ఏపీ సీడ్స్‌ సంస్థ రాష్ట్రంలో రైతులకు కావాల్సిన విత్తనాలు సేకరించలేకపోయిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఏపీ సీడ్స్‌ సంస్థకు రూ. 380 కోట్లు బకాయిలు చెల్లించకపోవటం వల్లే పరిస్థితి ఇలా తయారైందన్నారు. దీంతో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు విత్తనాలు లేకుండాపోయాయని తెలిపారు. రైతులకు విత్తనాలు అందించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆనాటి చంద్రబాబు సర్కారు తీరుపై మంత్రి కురసాల కన్నబాబు ఫైర్ అయ్యారు . మరోవైపు రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం సేకరణ డబ్బులు కూడా గత చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. రైతులను కష్టాల్లోకి నెట్టేసి, రైతుల ఈ దుస్థితికి కారణమైంది చంద్రబాబేనని పేర్కొన్నారు.

విత్తనాలు కావాలని అధికారులు రాసిన లేఖలు టీడీపీ ఆఫీస్ కు పంపుతాం .. సమాధానం ఇవ్వండి అని మండిపడిన మంత్రి కన్నబాబు

విత్తనాలు కావాలని అధికారులు రాసిన లేఖలు టీడీపీ ఆఫీస్ కు పంపుతాం .. సమాధానం ఇవ్వండి అని మండిపడిన మంత్రి కన్నబాబు

ఇక రైతాంగం కోసం ఎంతో చేశామని చెప్తున్న చంద్రబాబు, లోకేష్‌లకు ధైర్యముంటే ఈ విషయంలో సమాధానం చెప్పాలని ప్రశ్నించిన కన్నబాబు .చంద్రబాబు రైతులను ముంచేసినా , సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు . విత్తనాల సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రైతులకు సరఫరా చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విత్తనాలు కొనుగోలు చేసి మరీ రైతులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు చేయాల్సిన నష్టం చేసి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కోసం చంద్రబాబు ఊబలాటపడతారా అంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలు, అక్రమాలు ఆధారాలతో సహా ఎండగడతామని ఆ రోజు ఎంతో దూరంలో లేదని మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు .

English summary
Former CM Chandrababu Naidu has blamed the seed crisis in the state of Andhra Pradesh, said Agriculture Minister Kurasala Kannababu. The former Chandrababu Sarkar irregularities came out today accused the farmers of drowning. He alleged that he had not asked for funds to collect the seeds since January and that he had ignored 28 letters to Chandrababu. He did not reply that the letters written by the Agriculture Officers , we will be sent to the TDP office. if he had any guts he have to reply to the letters minister kannababu fired.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X