• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షర్మిల పార్టీ పెట్టిన ముహూర్తమో , ఏమో .. వైసీపీ పతనం మొదలైంది : దేవినేని ఉమ సంచలనం

|

మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారని, దీంతో టిడిపి మద్దతుదారులు అనేక స్థానాల్లో విజయం సాధించారని టిడిపి పేర్కొంది. మంగళవారం రాత్రి 11 గంటల వరకు వచ్చిన ఫలితాల ప్రకారం 918 చోట్ల తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని మాజీమంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వర రావు పేర్కొన్నారు.

 సీఎం జగన్ కనుసన్నల్లో బలవంతపు ఏకగ్రీవాలు , గ్రామాల్లో బెదిరింపుల పర్వాలు : దేవినేని ఉమ ఫైర్ సీఎం జగన్ కనుసన్నల్లో బలవంతపు ఏకగ్రీవాలు , గ్రామాల్లో బెదిరింపుల పర్వాలు : దేవినేని ఉమ ఫైర్

పంచాయతీ ఎన్నికల మొదటి విడతలోనే వైసీపీ పతనం మొదలైంది

పంచాయతీ ఎన్నికల మొదటి విడతలోనే వైసీపీ పతనం మొదలైంది

టిడిపి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంతో విజయోత్సవ సంబరాలు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుపుకున్న టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు ,ఎమ్మెల్సీ అశోక్ బాబు మరియు ఇతర నేతలు పంచాయతీ ఎన్నికల ఫలితాలపై, వైసిపి అరాచకాలపై మాట్లాడారు. షర్మిల పార్టీ పెట్టిన ముహూర్తమో, ఏమోకానీ ఏపీలో వైసీపీ పతనం మొదలైంది అంటూ దేవినేని ఉమా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తొలిదశలో 500కు పైగా ఏకగ్రీవంగా సాధించామని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని, కానీ అదంతా అబద్ధమని దేవినేని ఉమ స్పష్టం చేశారు.

తమకు ప్రమేయం లేని ఏకగ్రీవాలను వైసీపీ తమ ఖాతాలో వేసుకుంది

తమకు ప్రమేయం లేని ఏకగ్రీవాలను వైసీపీ తమ ఖాతాలో వేసుకుంది

వైసిపి చేసుకుంటున్న ప్రచారంలో దాదాపు 150 ఏకగ్రీవాలు వైసీపీతో ప్రమేయం లేని ఏకగ్రీవాలని, అయినప్పటికీ వైసీపీ వాటిని తమ ఖాతాలో వేసుకుందని దేవినేని ఉమ ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచిన వారందరినీ టిడిపి కార్యాలయంలో మేము ప్రదర్శన పెడతామని వైసిపి ఆ దైర్యం చేయగలదా అంటూ సవాల్ విసిరారు. గ్రామాలలో తొలిదశ ఎన్నికలలో వైసీపీ సర్కార్ పై తిరుగుబాటు స్పష్టంగా కనిపిస్తోందని దేవినేని ఉమా అభిప్రాయపడ్డారు.

900 స్థానాలకు పైగా టీడీపీ మద్దతుదారుల విజయం .. అమరావతి గ్రామాల్లో ప్రలోభాలు

900 స్థానాలకు పైగా టీడీపీ మద్దతుదారుల విజయం .. అమరావతి గ్రామాల్లో ప్రలోభాలు

ఇప్పటివరకు 20 నెలల పాలన చేసిన వైసిపి, మరో నలభై నెలల పాలన సాగించే అవకాశం ఉన్నప్పటికీ ప్రజలు ఎంతో ధైర్యంగా భయపడకుండా తొలిదశ పంచాయతీ ఎన్నికలలో 900 స్థానాలకు పైగా టిడిపి బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అడ్డుకోవడం కోసం వైసిపి చేయని ప్రయత్నం లేదు అని మండిపడిన దేవినేని ఉమా అమరావతి చుట్టుపక్కల రెండు జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో 10 నుండి 12 కోట్ల రూపాయల ఖర్చు పెట్టారని విమర్శలు గుప్పించారు.

టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తుంటే అధికారులు సహకరించలేదు

టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తుంటే అధికారులు సహకరించలేదు

టిడిపి బలపరిచిన అభ్యర్థులు గెలుస్తుంటే అధికారులు కూడా సహకరించలేదని, కొంతమంది కౌంటింగ్ నిలిపివేసి నిద్ర వస్తుందని వెళ్లిపోయారు అంటూ ఆరోపించారు దేవినేని ఉమా. కొన్నిచోట్ల కరెంటు తీసేసి, మరికొన్ని చోట్ల తలుపులు మూసేసి ఫలితాలు ప్రకటించకుండా ఆపేశారని దేవినేని ఉమ ఆరోపించారు . జిల్లాల వారీగా రాత్రి 11 గంటల వరకు వచ్చిన ఫలితాల జాబితాను, అందులో టిడిపి బలపరిచిన అభ్యర్థుల విజయాలను పేర్కొంటూ టిడిపి ఒక జాబితా విడుదల చేసింది.

 పంచాయతీ ఎన్నికల వార్ లో ఎవరి లెక్క వారిదే ..

పంచాయతీ ఎన్నికల వార్ లో ఎవరి లెక్క వారిదే ..

మొత్తానికి మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగిందని , వైసీపీ నేతలు చెబుతుంటే వైసిపి కి షాక్ ఇచ్చేలా ఫలితం వచ్చిందంటూ, ఇది రెండో విడత మూడో విడత ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని టిడిపి నేతలు చెప్పుకోవడం గమనార్హం.
మరి రెండో విడత , మూడో విడత ఎన్నికల సమరానికి అటు పార్టీలు , ఇటు ఎన్నికల కమీషన్ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం అవుతున్నాయి .

English summary
TDP leaders Devineni Umamaheswara Rao, MLC Ashok Babu and other leaders spoke on the results of the panchayat elections and YCP anarchy as the victory celebrations of the TDP-supported candidates at the party headquarters. Devineni Uma made interesting remarks that the fall of the YCP in the AP was because of Sharmila's party's starting muhurth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X