విజయవాడకు చేరుకున్న జగన్ ... ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కాసేపటి క్రితం హైదరాబాద్ నుండి విజయవాడకు చేరుకున్నారు. కాగా జగన్కు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున గన్నవరం ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. జగన్ ఎయిర్ పోర్టు నుండి నేరుగా తన నివాసానికి చేరుకున్నారు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు,ఎయిర్ పోర్టుతో పాటు జగన్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడంతో పార్టీ శ్రేణులు ఉత్సహంతో ఉన్నారు. కాగా ఫలితాలు ట్రెండ్ గురువారం మధ్యహ్నం కల్లా వెలువడనున్నాయి. ఇక ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఎన్నికల ఫలితాలపై జగన్ దిశనిర్ధేశనం చేశారు. మధ్యాహ్నం తర్వాత జగన్ పార్టీ నేతలతో సమావేశం కానున్నట్టు సమాచారం.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!