విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Vijayawada: లోకల్ హీట్: గద్దె రామ్మోహన్ కు చెక్ పెట్టడానికి దేవినేనిని దించిన వైసీపీ..!

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడ రాజకీయాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. విజయవాడలో బలమైన నాయకుడిగా ఎదిగిన తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు చెక్ పెట్టే దిశగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదిపింది. తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి, పార్టీలో చేరిన యువ నాయకుడు దేవినేని అవినాష్ ను ఆయనకు పోటీగా దింపింది. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న సమయంలో ఆధిపత్య పోరాటానికి తెర తీసినట్టయింది.

Disha murdec case: దిశ హత్యోదంతం: ఏపీలో బీ సేఫ్ యాప్..రాత్రిళ్లు తోడుగా ఎవరినైనా: మంత్రి సుచరితDisha murdec case: దిశ హత్యోదంతం: ఏపీలో బీ సేఫ్ యాప్..రాత్రిళ్లు తోడుగా ఎవరినైనా: మంత్రి సుచరిత

బైక్ ర్యాలీతో హల్ చల్

బైక్ ర్యాలీతో హల్ చల్

విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా బాధ్యతలను స్వీకరించిన దేవినేని అవినాష్ తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. విజయవాడలో భారీ ఎత్తున బైక్ ర్యాలీని నిర్వహించారు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు, ఇన్ ఛార్జి మంత్రి దీనికి హాజరయ్యారు. విజయవాడ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన దేవినేని నెహ్రూ కుటుంబంతో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.

మంత్రులు హాజరు..

మంత్రులు హాజరు..


గుణదలలోని దేవినేని నెహ్రూ నివాసం వద్ద ఆరంభమైన ఈ బైక్ ర్యాలీ.. ఈఎస్ఐ రోడ్డు, క్రీస్తురాజపురం, సున్నంబట్టీల సెంటర్, డీవీ మ్యానర్ రోడ్ మీదుగా సాగింది. ర్యాలీ ముగిసిన అనంతరం శేషసాయి కల్యాణమండపంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, బొప్పన భవకుమార్ హాజరయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా..

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా..

త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ ర్యాలీని నిర్వహించినట్లు చెబుతున్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలో విజయవాడ అర్బన్ మండలం, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32, 36, 41, 45, 48లతో పాటు 50 నుంచి 74 వరకు వార్డులు ఉన్నారు. ప్రస్తుతం ఆయా వార్డుల్లో మెజారిటీ స్థానాలు తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉన్నాయి. ఈ సారి వైసీపీ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో దేవినేనికి ఆ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ ఇదివరకు తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించడం కలిసి వచ్చే అంశమని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

 కార్పొరేషన్ పై వైసీపీ జెండా ఎగరాలంటూ..

కార్పొరేషన్ పై వైసీపీ జెండా ఎగరాలంటూ..

విజయవాడ కార్పొరేషన్, తూర్పు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడేలా కార్యకర్తలు, దేవినేని కుటుంబ సభ్యులు కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, దేవినేని నెహ్రూ మధ్య స్నేహ సంబంధాలు ఉండేవని, 2014 ఎన్నికలకు ముందు నెహ్రూను వైసీపీలోకి రావాలని ఆహ్వానించామని, అయితే ఎందుకో ఆయన తప్పటడుగు వేశారన్నారు. అవినాష్ వైసీపీలో చేరటం వల్ల దింగత నేత నెహ్రూ ఆత్మ శాంతిస్తుందని అన్నారు.

English summary
YSR Congress Party leader and Vijayawada East Assembly incharge Devineni Avinash conducted a bike rally in Vijayawada City in the row of Local bodies elections. Ministers Kodali Nani, Perni Nani and Peddireddy Ramachandra Reddy were participated in the rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X