విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

40 మంది జైలుకా- 16 నెలలుగా మీరక్కడేగా- లోకేష్‌కు వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్‌ కౌంటర్‌

|
Google Oneindia TeluguNews

ఏపీలో త్వరలో అధికార వైసీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు జైలుకెళ్తారంటూ టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడింది. లోకేష్‌ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. హత్య కేసులో జైల్లో ఉన్న వారిని పరామర్శించేందుకు లోకేష్‌ ఏపీకి వచ్చారని, ప్రజల కోసమేమీ రాలేదన్నారు.

ఎమ్మెల్యేలను జైలుకు పంపిస్తామని లోకేష్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒక్క ఎమ్మెల్యే అవినీతి చేసినట్లు నిరూపించాలని కోరారు. సవాల్‌ చేసి హైదరాబాద్‌కు పారిపోవడం కాదని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని లోకేష్‌కు జోగి రమేష్‌ సూచించారు. టీడీపీ చేసిన పాపాలకు ప్రజలు 16 నెలలుగా జైల్లోనే కూర్చోబెట్టారన్నారు. లోకజ్ఞానం లేని లోకేష్‌ సీఎం జగన్‌ తాత రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారని, ఆయన గురించి ఏం తెలుసని జోగి రమేష్‌ ప్రశ్నించారు. రాజారెడ్డి పేదల పెన్నిథి అని ఆయన రాజకీయాలు చేసినప్పుడు లోకేష్‌ పుట్టలేదన్నారు.

ysrcp mla jogi ramesh strong counter to tdp mlc lokesh comments on mlas jail

Recommended Video

Kisan Rail From Anantapur To Delhi సౌత్‌లో ఫస్ట్‌ కిసాన్ రైలు,కేంద్రమంత్రితో కలిసి ప్రారంభించిన జగన్

ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో లోకేష్‌ హైదరాబాద్‌లో ఉండటాన్ని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తప్పుబట్టారు. కరోనా ఉన్నా సరే ప్రజల కోసం వైసీపీ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని గుర్తుచేశారు. టీడీపీ నేతలు మాత్రం కరోనాకు భయపడి హైదరాబాద్‌కు పాతిపోతారా అని జోగి రమేష్‌ ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయానికి తాళాలు వేసి ఆరునెలలు అయిందన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా టీడీపీ నేతలు రాబందుల్లా, అక్కుపక్షుల్లా కోర్టులకెళ్లి అడ్డుకున్నారని జోగి రమేష్‌ విమర్శించారు. 14 ఏళ్ల సీఎంగా చంద్రబాబు చేయలేని పనిని జగన్‌ ఏఢాదిలోనే చేశారని, ఇళ్ల స్ధలాలు ఇస్తే లోకేష్‌కు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. బలహీన వర్గాలకు ఇంగ్లీష్‌ మీడియం అవసరం లేదా అని ఆయన టీడీపీ నేతలను ప్రశ్నించారు.

English summary
ysrcp mla jogi ramesh has given strong counter to tdp mlc nara lokesh's recent comments on his colleague mlas. ramesh reminds lokesh that he and his father naidu is in jail for last 16 months and how can ysrcp mlas go to jail without any proof.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X