ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు -కోర్టు తీర్పుపై విజయసాయిరెడ్డి -పరిషత్ ఎన్నికల స్టేపై విచారణ వేళ
అనూహ్య పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం మళ్లీ వివాదాస్పదమైంది. మరో గంటలో ప్రచార పర్వం ముగియనుందగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం విచారించనుంది. అంతలోనే ఈ వ్యవహారంపై అధికార వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు..

అసలేం జరిగిందంటే..
ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీలకు గురువారం పోలింగ్ జరగాల్సి ఉండగా, హైకోర్టు సింగిల్ మంగళవారం ఎన్నికలకు బ్రేక్ వేసింది. పోలింగ్ ను నిలిపేయాలంటూ ఆదేశాలిచ్చింది. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు చేయాలన్న సుప్రీంకోర్టు గత ఆదేశాలను ఎస్ఈసీ ధిక్కరించిందంటూ టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. ఈ నెల 1న ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్, తదనంతర చర్యలపై స్టే విధించింది. పోలింగ్ కు రెండు రోజుల ముందు ఎన్నికల ప్రక్రియపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఏపీఎస్ఈసీ సవాలు చేయగా
సీఎం జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ -సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ రాకతో వణుకు -వైసీపీ ఎంపీ రఘురామ సంచలనం

డివిజన్ బెంచ్ సమర్థిస్తే సుప్రీంకు?
పరిషత్ ఎన్నికల స్టేపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీ సవాల్ చేసింది. పిటిషన్ర్ వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదని, వ్యక్తిగత హోదాలో వేసిన పిటిషన్‌ను సింగిల్ బెంచ్ కొట్టేసి ఉండాల్సిందని, నాలుగు వారాలు కోడ్ ఉండాలని నిబంధన లేదని ఎస్ఈసీ తన పిటిషన్ లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఏ సందర్భంలో ఆ ఉత్తర్వులు ఇచ్చిందో పరిగణనలోకి తీసుకోలని, కోడ్ అమలుతో ప్రభుత్వ కార్యక్రమాలు ఆగిపోతాయని మాత్రమే సుప్రీం వ్యాఖ్యానించిందని, వీటిని పరిగణనలోకి తీసుకొని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కొట్టేయాలని ఎస్ఈసీ కోరింది. ఎన్నికలపై సింగిల్ బెంచ్ విధించిన స్టేను డివిజన్ బెంచ్ కూడా సమర్థించిన పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా జగన్ సర్కారు యోచిస్తున్నది. ఇంతలోనే..

ఎక్కడ గుద్దాలో అక్కడే..
జెడ్జీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టాల్సి ఉండగా, ఈ వివాదంపై వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలను బహిష్కరించిన తర్వాత కూడా కోర్టుకు వెళ్లి, స్టే తీసుకొచ్చారంటూ టీడీపీపై ఆయన ఫైరయ్యారు. ‘‘బ్రేక్ లు వేయించొచ్చు - అంతిమ విజయం మాత్రం న్యాయానిదే. నాయకుడు తేల్చుకోవాల్సింది ప్రజాకోర్టులోనే. చంకలు గుద్దుకుని తాత్కాలిక ఆనందం పొందితే - జనం ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు'' అని సాయిరెడ్డి మండిపడ్డారు.