విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ బీజేపీపై వైసీపీ ఎదురుదాడి వ్యూహం- కాషాయ నేతల్లో విభేదాలే లక్ష్యంగా...

|
Google Oneindia TeluguNews

కొరియా నుంచి తెప్పించిన కరోనా టెస్టింగ్ కిట్ల వ్యవహారం ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా టెస్టింగ్ కిట్ల ధరలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ చేస్తున్న ఆరోపణలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన బీజేపీలో అంతర్గత విభేదాలను సైతం పరోక్షంగా ప్రస్తావించడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

ఏపీ బీజేపీ- కరోనా కిట్ల వ్యవహారం..

ఏపీ బీజేపీ- కరోనా కిట్ల వ్యవహారం..

ఏపీలో కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ల ధరల వ్యవహారం కాస్తా బీజేపీ వర్సెస్
వైసీపీగా మారిపోయింది. కరోనా వైరస్ టెస్టింగ్ కు వాడే కొరియా ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి వ్యూహం మార్చారు.
ఓవైపు బీజేపీ నేతల ఆరోపణలకు కౌంటర్లు ఇస్తూనే మరోవైపు ఆ పార్టీలో అంతర్గత సమస్యలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకూ బీజేపీలో పాత నేతలకూ, టీడీపీ నుంచి వచ్చిన నేతలకూ మధ్య ఉన్న విభేదాలు పార్టీకే పరిమితం కాగా.. ఇప్పుడు విజయసాయి వ్యాఖ్యలతో అది కాస్తా జనంలో చర్చనీయాంశమవుతోంది.

విజయసాయి వ్యూహం అదేనా ?

విజయసాయి వ్యూహం అదేనా ?

వాస్తవానికి బీజేపీ ప్రస్తావించిన కరోనా కిట్ల ధరల వ్యవహారానికి సమాధానంగా వైసీపీ కౌంటర్ విమర్శలు చేస్తే సరిపోయేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో బీజేపీ నుంచి తరచూ ఎదురవుతున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని భావించారో ఏమో విజయసాయి.. ఆ పార్టీ అంతర్గత విభేదాలను తెరపైకి తెచ్చారు. అలాగని బీజేపీలో విభేదాలు ఉన్నాయని కూడా చెప్పలేదు. కరోనా కిట్లపై బీజేపీ నేతలు అడిగితే సమాధానం చెబుతాను కానీ బీజేపీలో ఉన్నటీడీపీ నేతలు అడిగితే చెప్పబోనన్నారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

 సుజనాకు చెక్ పెట్టేందుకే..

సుజనాకు చెక్ పెట్టేందుకే..


బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న నేతలకూ, టీడీపీ నుంచి వచ్చిన నలుగురు ఎంపీలకూ, ఇతర నేతలకూ మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. వీటినే టార్గెట్ చేసుకుని ఎదురుదాడి మొదలుపెట్టాలని భావించిన వైసీపీ వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డితో విమర్శలు చేయించడం మొదలుపెట్టింది. ఇందులో ప్రధానంగా టెస్టింగ్ కిట్ల వ్యవహారాన్ని ముందుగా ప్రస్తావించిన సుజనా చౌదరిని ఒంటరి చేసే లక్ష్యంతో కన్నా ఆరోపణలపై సమాధానం చెప్పకుండా టీజేపీ పేరుతో ఓ కొత్త పేరును సాయిరెడ్డి జనంలోకి తెచ్చారు. టీజేపీ అంటే బీజేపీలోకి వచ్చిన టీడీపీ నేతలన్న మాట. వారి మాటలకు సమాధానం చెప్పను అంటే పరోక్షంగా సుజనా విమర్శలకు సమాధానం చెప్పబోననే అర్దం.

Recommended Video

Coronavirus : Corona Positive Patient Discharged In AP Guntur District
బీజేపీ ప్రతివ్యూహం- తెరపైకి కేసులు..

బీజేపీ ప్రతివ్యూహం- తెరపైకి కేసులు..

బీజేపీలో అంతర్గత విభేదాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలతో ఏపీ బీజేపీ ఛీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కాస్త డిఫెన్స్ లో పడ్డా తిరిగి వ్యూహం మార్చారు. సాయిరెడ్డి అవినీతి కేసులను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. దీంతో సాయిరెడ్డిని తిరిగి అవినీతి చుట్టూ తిరిగేలా చేయాలనేది కన్నా లక్ష్మీనారాయణ వ్యూహంగా తెలుస్తోంది. అయితే కన్నా విమర్శలు చేస్తుంటే సుజనాను ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి సమాధానం చెప్పడాన్ని బట్టి చూస్తే బీజేపీని మొత్తంగా ఆత్మరక్షణలోకి నెట్టాలనే వ్యూహమే కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
ysrcp mp vijayasai reddy starts counter attack on bjp leader kanna lakshminarayana over the prices of covid 19 testing kits. by using the internal differences within bjp, vijayasai reddy given counter and said he can only answer to bjp leaders but not tdp leaders in bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X