విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2 రూపాయలకు 2 ఎకరాలు .. శారదా పీఠానికి భూ కేటాయింపుపై హై కోర్టులో పిల్

|
Google Oneindia TeluguNews

విశాఖ శారదా పీఠానికి రెండు రూపాయలకే రెండు ఎకరాల భూమిని కేటాయించడం వివాదంగా మారింది. తెలంగాణా సీఎం కేసీఆర్ ను విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి హైదరాబాద్ లో స్థలం ఇవ్వాలని కోరారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి కోరిక మేరకు హైదరాబాద్ లోనూ శారద శక్తిపీఠం తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఎకరా భూమి రూపాయి చొప్పున రెండు ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. జూన్ 18న కేబినేట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు సీఎం కెసిఆర్ కోకాపేటలో లో 2 ఎకరాల భూమిని పీఠానికి కేటాయించారు. ఎకరానికి 1 రూపాయి చొప్పున 2 రూపాయలకు 2 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం శారదా పీఠానికిచ్చింది.

బోటును బయటకు తియ్యాలని ఆందోళన .. మద్దతుగా హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలుబోటును బయటకు తియ్యాలని ఆందోళన .. మద్దతుగా హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

రంగారెడ్డి జిల్లా గండి పేట మండలం కొత్తపేట గ్రామం సర్వేనెంబర్ 240 లో భూమిని కేటాయిస్తూ జీవోను సైతం జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విముఖత వ్యక్తం చేస్తున్న భాగ్యనగర వాసి తాజాగా జీవోను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వం ఇష్టానుసారంగా ఇవ్వడానికి వీల్లేదని పిటిషన్ దాఖలు చేసిన సికింద్రాబాద్ నివాసి హెచ్ వీరాచారి తన పిటిషన్లో పేర్కొన్నారు . రెండు రూపాయలకే విశాఖ శారదాపీఠానికి ధారా దత్తం చేయడంపై తమ అభ్యంతరాన్ని తెలియజేశారు.

2 acres for 2 rupees .. Pill in High Court on land allotment to Sarada Peetam

రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ఎకరం ధర కేవలం ఒక్క రూపాయి చొప్పున రెండు ఎకరాల భూమిని శారదా శక్తిపీఠానికి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు సిహెచ్ వీరాచారి. తెలంగాణ రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌, విశాఖ శారదాపీఠం ధర్మాధికారి, హెచ్‌ఎండీఏ మేనేజింగ్‌ డైరెక్టర్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ని ప్రతివాదులుగా తన పిటిషన్లో చేర్చారు. శారదాపీఠానికి కేటాయించిన భూమి విలువ మార్కెట్లో రూ.50కోట్లు వరకు పలుకుతుందన్న ఆయన అందుకే హైకోర్టులో ప్రభుత్వం విశాఖ శారదా పీఠం కేటాయించిన భూమి జీవోను రద్దు చేయాలంటూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసినట్లుగా తెలిపారు.
English summary
CH Veerachary filed a law suit in the High Court challenging the allotment of two acres of land in Kokapeta in Rangareddy district to the Saradha Shakti Peetham. The petition filed by the Revenue Department Special CS, Visakha Sarada Peetam trustee, HMDA Managing Director and District Collector of Rangareddy was included in the petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X