విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ కేజీహెచ్‌లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య: వేధింపులే కారణమా?

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: కేజీహెచ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అనకాపల్లి ప్రాంతానికి చెందిన బేబీ శివలక్ష్మి కేజీహెచ్‌లో చివరి సంవత్సరం చదువుతోంది.

మరో మూడు నెలల్లో కోర్సు ముగిసిపోనుండగా ఈ ఘోరం జరగడంతో శివలక్ష్మి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, భోధనేతర సిబ్బంది వేధింపుల కారణాంగానే శివలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

నిన్న ఉదయం తమతో ఫోన్లో బాగానే మాట్లాడిందని.. ఇవాళ ఉదయం ఈ వార్త వినాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. శివలక్ష్మి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

 A nursing student committed suicide in visakhapatnam KGH

ఇంజినీరింగ్ విద్యార్థిపై కత్తులతో దాడి

నెల్లూరు జిల్లా కోవూరు వద్ద హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులతో దాడులు చేసుకోవడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంనకు చెందిన అవినాష్, ప్రమోద్‌లు కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డారు. స్పృహతప్పి రోడ్డుపక్కన పడిపోయిన విద్యార్థులను గమనించిన కొందరు వాహనదారులు కోవూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎస్పీ రాఘవరెడ్డి, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కృష్ణారెడ్డి ఘటనపై ఆరా తీశారు.

అంబాజీపేటలో విషాదం

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టింది. అంబాజీపేట గ్రంథాలయం సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

తీవ్రగాయాలపాలైన భర్త మాకు శ్రీనివాస్(30) అక్కడికక్కడే మృతి చెందారు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. అమలాపురం ఆస్పత్రిలో ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస్ దంపతులది ముమ్మిడివరం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A nursing student committed suicide in visakhapatnam KGH.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X