• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మంటల్లో కాలుతూ అర్ధరాత్రి యువతి హాహాకారాలు ..యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిందెవరు ?

|

అర్దరాత్రి సమయంలో ఓ యువతి హాహాకారాలు విశాఖ నగరంలోని శివాజీపాలెం వాసులను ఆందోళనకు గురి చేశారు. వొళ్ళంతా కాలుతూ మంటలతో రోడ్ మీదకు పరుగెత్తుకొచ్చిన ఆ యువతిని గుర్తించి మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు స్థానికులు . 60 శాతం గాయాలతో ఉన్న ఆ యువతి ప్రస్తుతం విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

టీడీపీపై స్వరూపానంద విమర్శలు ..ఆ నిధుల దుర్వినియోగంపై విచారణ చెయ్యాలన్న స్వామి

 మంటల్లో కాలుతూ రోడ్ పైకి పరుగెత్తుకొచ్చిన కావ్య అనే యువతి .. ఆస్పత్రికి చేర్చిన స్థానికులు

మంటల్లో కాలుతూ రోడ్ పైకి పరుగెత్తుకొచ్చిన కావ్య అనే యువతి .. ఆస్పత్రికి చేర్చిన స్థానికులు

వెంకోజీపాలెంలోని రామాయలం వీధిలో నివాసముంటున్న 25 సంవత్సరాల వయసు గల కావ్య అనే యువతి విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏఎన్‌ఎంగా పని చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని కారణంగా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కలిసి రామాయలం వీధిలో నివాసం ఉంటున్నారు. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆమెపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారని స్థానికులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి మంటలతో కాలిపోతూ హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తూ వచ్చి శివాజీపాలెం రోడ్డులో ఒక్కసారిగా పడిపోయింది. మంటల్లో కాలుతున్న కావ్యను గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేసి ఆమెను స్థానిక కేజీహెచ్‌కు తరలించారు. బాధితురాలిని శ్రీకాకుళంలోని బత్తిలి గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు.

దుండగుల దాడినా లేకా అత్మహత్యాయత్నామా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు

దుండగుల దాడినా లేకా అత్మహత్యాయత్నామా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు

ఇక ఈ నేపధ్యంలో ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని యువతితో మాట్లాడారు. ఇక కావ్య ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె రహదారి పక్కనే వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని ఏం జరిగిందో ఆమెకు అర్ధం కాలేదని , కాలుతున్న గాయాలతో పరుగులు తీశానని ఆమె చెప్పింది. తనపై ఎవరైనా దుండగులు దాడి చేశారా అన్న ప్రశ్నకు ఆమె నుండి సమాధానం లేదు. తనకేం అర్ధం కాలేది మాత్రం చెప్పినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అసలు యువతిపై ఎవరైనా దుండగులు దాడి చేశారా ? లేకా ఆమెనే ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందా? అసలు ఏం జరిగింది అన్న కోణం లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు.

60 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కావ్య..

60 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కావ్య..

ఇక కావ్య 60 శాతం గాయాల పాలు అయ్యింది అంటే కచ్చితంగా ఆమెపైన ఎవరో పెట్రోల్ పోసి దాడికి అయినా పాల్పడి ఉండాలి. లేదా ఆమెనే ఆత్మ హత్యా యత్నానికి పాలప్ది అయినా ఉండాలి. కానీ కావ్య ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని ఏం జరిగిందో తనకు తెలీదని చెప్తుంది. ప్రస్తుతం ఆమె 60 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా పోలీసులు ఈ కేసులో బయట ఏం జరిగింది అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. అలాగే కావ్య పని చేసే హాస్పటల్ లో కూడా ఆమె గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆమెకు శత్రువులు కానీ , ఆమెకు ప్రేమికులు కానీ ఎవరైనా ఉన్నారా అన్న క్రమంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kavya, a young woman of 25 years, who lives in Ramalayam Street in Venkojipalem, is working as an ANM in a private hospital in Visakha. Due to the absence of parents, two younger sisters live together in Ramayalam Street. Locals believe that unidentified assailants set fire to her on her way home after completing night duties. On Tuesday night, Sivajipalem Road, she was burnt with flames, fell on the road. Locals noticed the burning Kavya and immediately rushed to the local KGH. The victim was identified as a young woman from the village of Bathili in Srikakulam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more