• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అచ్చెన్నాయడు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు- త్వరలో ఈఎస్‌ఐ స్కాంపై ఏసీబీ ఛార్జిషీట్‌..

|

ఏపీలో చోటు చేసుకున్న ఈఎస్‌ఐ మందులు, వైద్య పరికరాల కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డైరెక్టర్లు, ప్రైవేటు సంస్ధలతో కుమ్మక్కై ఈఎస్‌ఐలో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుపుతున్న ఏసీబీ ఈ మేరకు కీలక ఆధారాలు సంపాదించింది. వీటి ప్రకారం స్కాంలో మరిన్ని వివరాలను ఇవాళ ఏసీబీ బయటపెట్టింది. వీటిని ఆధారంగా చేసుకుని త్వరలో ఛార్జిషీట్‌ దాఖలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అభియోగాలు రుజువైతే అచ్చెన్నాయుడుకు మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు.

చురుగ్గా ఈఎస్‌ఐ స్కాం దర్యాప్తు...

చురుగ్గా ఈఎస్‌ఐ స్కాం దర్యాప్తు...

ఏపీలో గత టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఈఎస్‌ఐ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ఏసీబీ అధికారులు తాజాగా మరింత పురోగతి సాధించారు. ఈ స్కాంలో రూ.151 కోట్ల మొత్తం చేతులు మారిందనే అంచనాకు వచ్చిన అధికారులు వీటి కొనుగోళ్లకు సంబంధించి మరిన్ని ఆధారాలను తాజాగా గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసిన ఏసీబీ.. మరో ఏడుగురు నిందితుల అరెస్టుకు సిద్దమవుతోంది. ఇందులో మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా నిందితుడిగా ఉన్నట్లు ఏసీబీ జేడీ రవికుమార్‌ తెలిపారు. తాజా దర్యాప్తులో గుర్తించిన వివరాలను ఆయన ఇవాళ విజయవాడలో మీడియాకు వెల్లడించారు.

రూ.970 కోట్ల బడ్జెట్‌లో రూ.151 కోట్ల స్కాం...

రూ.970 కోట్ల బడ్జెట్‌లో రూ.151 కోట్ల స్కాం...

2014 నుంచి 2019 మధ్య సాగిన ఈఎస్‌ఐ స్కాంలో మొత్తం రూ.151 కోట్ల మొత్తం అదనపు చెల్లింపులు జరిగినట్లు ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. అయితే మొత్తం ఈఎస్‌ఐకి కేటాయించిన రూ.970 కోట్ల బడ్జెట్‌లో ఈ మొత్తం ఎలా చేతులు మారిందనే అంశంపై తాజాగా ఏసీబీ మరిన్ని ఆధారాలు సంపాదించింది. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు వేయకుండా జరిగిన కేటాయింపులు ప్రధానంగా ఉన్నాయి. వీటికి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఇప్పుడు ఆయనకు ఇబ్బందిగా మారింది. అలాగే ఈ స్కాంలో భాగంగా రూ.400 కోట్ల విలువైన అనవసర మందులు కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించారు. ఇవి ఎక్కడెక్కడ జరిగాయయన్న అంశంపైనా ఏసీబీ కీలక ఆధారాలు సంపాదించినట్లు జేడీ రవికుమార్‌ వెల్లడించారు.

 అచ్చెన్నాయుడు చుట్టూ ఉచ్చు...

అచ్చెన్నాయుడు చుట్టూ ఉచ్చు...

టీడీపీ హయాంలో కార్మిక మంత్రిగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ మందుల స్కాంలో ప్రధాన నిందితుడిగా ఇప్పటికే ఏసీబీ పేర్కొంది. అయితే ఆయన తాను టెలీ హెల్త్ సర్వీసెస్‌కు కాంట్రాక్టు ఇవ్వాలని మాత్రమే సూచించినట్లు చెబుతున్నారు. కానీ అంతకు మించి ఆయన మరిన్ని కొనుగోళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఏసీబీ చెబుతోంది. ఇందులో మందులు, వైద్య పరికరాలతో పాటు బయో మెట్రిక్‌ పరికరాలు కూడా ఉన్నాయి. వీటి కోసం భారీగా చెల్లింపులు జరిగాయని, వీటికి మంత్రి హోదాలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అచ్చెన్నాయుడుపై మరిన్ని అభియోగాలు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. అదే జరిగితే ఇప్పటికే బెయిల్‌ దొరక్క ఇబ్బందులు పడుతున్న అచ్చెన్నాయుడుకు మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు.

త్వరలో మరిన్ని అరెస్టులు - ఛార్జిషీట్...

త్వరలో మరిన్ని అరెస్టులు - ఛార్జిషీట్...

టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాలుగా అధికార దుర్వినియోగం చేసి అధికారులు, మంత్రులు కుమ్మక్కై ఈ స్కాంకు తెరలేపారని ఆరోపిస్తున్న ఏసీబీ.. ఈ మేరకు పూర్తి వివరాలతో త్వరలో ఛార్జిషీట్‌ దాఖలు చేసేందుకు సిద్దమవుతోంది. ఛార్జిషీట్‌ లో ప్రధానంగా అచ్చెన్నాయుడు పాత్ర, డైరెక్టర్లు ఇచ్చిన అనుమతులు, వాటి ద్వారా ఈఎస్‌ఐకి జరిగిన నష్టం, ఎక్కడెక్కడ ఎంతెంత నష్టం జరిగిందనే వివరాలు పొందుపర్చనుంది. దీనికి ముందే మరో ఏడుగురు నిందితులను అరెస్టు చేసేందుకు ఏసీబీ సిద్దమవుతోంది. ప్రస్తుతం ఏసీబీ దూకుడు చూస్తుంటే మరో వారం రోజుల్లోనే ఈఎస్‌ఐ స్కాంలో మరిన్ని అరెస్టులు చోటు చేసుకోవచ్చని తెలుస్తోంది.

English summary
andhra pradesh anti corruption bureau is planning to file charge sheet in alleged esi scam worth rs.151 cr. acb found more evidence regarding former minister atchannaidu's role in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X